Home /News /telangana /

HYDERABAD HYDERABAD TRAFFIC POLICE KGF 2 DIALOGUES MEMES GO VIRAL IN SOCIAL MEDIA SB

KGF 2: హేల్ మేట్‌ను దూరంగా ఉంచండి.. యష్ పవర్ ఫుల్ డైలాగ్స్‌తో పోలీసుల మీమ్స్

కేజీఎఫ్ డైలాగ్స్‌తో పోలీసుల మీమ్స్

కేజీఎఫ్ డైలాగ్స్‌తో పోలీసుల మీమ్స్

ఈ నెల 14న పాన్ ఇండియా మూవీగా కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమాలో హీరో పవర్ ఫుల్ డైలాగ్స్‌తో క్రేజీ మీమ్స్ తయారు చేశారు సిటీ పోలీసులు.

    హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రెండింగ్ న్యూస్‌ను బాగా ఫాలో అవుతుంటారు. ఇక సినిమాలపై అయితే ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఏ సినిమా టాక్ బావుంటే.. దాన్ని వాడేసుకుంటారు. అయితే పర్సనల్‌గా కాదండీ. ప్రజల కోసమే. సినిమా డైలాగ్స్‌ను ప్రముఖ హీరోల పోస్టర్లను వాడుతూ.. ప్రజల్లో ట్రాఫిక్ రూల్స్‌పై ( Traffic Rules) అవగాహన కల్పిస్తుంటారు. ప్రముఖ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు, పోస్టర్లు, ట్రైలర్లు వచ్చినప్పుడు.. వాటిని క్యాష్ చేసుకుంటూ.. ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలకు మెసేజ్‌ అందిస్తుంటారు.

    గతంలో సింహా సినిమాలోని ఓ డైలాగ్ వాడుకుని.. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే నీకు నెక్ట్స్ బర్త్ డే ఉండదని చెప్పారు. ఆ తర్వాత ఎన్టీఆర్, చరణ్ ట్రిపుల్ ఆర్ పోస్టర్ విడుదలైనపుడు కూడా తమదైన శైలిలో ప్రచారం చేసుకున్నారు. హెల్మెట్స్ ఎక్కడా అంటూ ఇద్దరి ఫోటోలు పెట్టి పోస్టులు పెట్టారు సైబరాబాద్ పోలీసులు. తాజాగా మన ట్రాఫిక్ పోలీసులు కన్ను ఇప్పుడు కేజీఎఫ్ సినిమాపై పడింది.

    కన్నడ స్టార్ యష్ (Yash) హీరోగా వస్తున్న కేజేఎఫ్ పార్ట్ 2 కోసం దేశవ్యాప్తంగా ఉన్న కేజీఎఫ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన పార్ట్ 2.. పార్ట్ 1 కు మించి ఉంటుందని అంటున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‏లోని డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో హీరో యశ్ చెప్పిన డైలాగ్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి.ఆ ట్రెండ్‌ను ఫాలో అయిన ట్రాఫిక్ పోలీసులు క్రేజీ మీమ్స్ రెడీ చేశారు.

    కేజీఎఫ్ 2(KGF 2 Trailer) ట్రైలర్ లో “వయోలెన్స్… వయోలెన్స్… వయోలెన్స్…. ఐ డోంట్ లైక్ ఇట్… ఐ అవాయిడ్… బట్ వయోలెన్స్ లైక్స్ మీ” అంటూ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్. ‘హెల్మెట్ మీ హెల్ మేట్ ను దూరంగా ఉంచుతుంది’ అంటూ రోడ్ సేఫ్టీకి సంబంధించిన సలహా ఇచ్చారు అందరికి. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. “ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు “హెల్మెట్” తప్పక ధరించండి, సురక్షితంగా మీ గమ్య స్థానాన్ని చేరుకొండి. ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం, ఇతరులకి ఆదర్శంగా నిలుద్దాం” అంటూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దానిపై “హెల్మెట్ హెల్మెట్ హెల్మెట్… ఐ డోంట్ లైక్ హెల్మెట్… బట్ హెల్మెట్ సేవ్స్ మీ… ఐ డోంట్ అవాయిడ్ హెల్మెట్” అని ఉంది.

    ఏప్రిల్ 14న కేజీఎఫ్ 2 (KGF2)ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనెల 14న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. బాహుబలితో మొదలైన పాన్ ఇండియా హవాను కేజీఎఫ్ సినిమా మరింత ముందుకు తీసుకెళ్లింది. ఈ ఒక్క సినిమాతో రాకింగ్ స్టార్ యశ్ (Yash) అన్నిభాషల్లో క్రేజ్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు యశ్ చాలా దగ్గరయ్యాడు
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Hyderabad Traffic Police, KGF, KGF Chapter 2, Yash

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు