హైదరాబాద్‌లో వాతావరణం చల్లగా మారింది. గత రెండు రోజులుగా నగరంలో చలిగాలులు కూడా బాగానే వీస్తున్నాయి. అయితే ఇప్పుడు మరోసారి వింటర్ తిరిగి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ వాసులు మళ్లీ చలికి వణికిపోయే అవకాశం ఉంది. మరోవైపు నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే అవకాశం ఉన్నందున, భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
హైదరాబాద్ నగరంలో మొత్తం ఏడు జోన్‌లు, చార్మినార్, ఖైరతాబాద్, ఎల్‌బి నగర్, సికింద్రాబాద్, మరియు శేరిలింగంపల్లి. అయితే రానున్న రెండు మూడురోజుల్లో చలి తీవ్రత పెరగనుంది. ఫిబ్రవరి 3 మరియు 4 తేదీలలో చలిగాలులు వీస్తాయన్నారు. ఉదయం వేళల్లో పొగమంచు నగరాన్ని కమ్మేస్తోంది. ప్రస్తుత చలికాలంలో హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 6.5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది.
IMD హైదరాబాద్ ప్రస్తుత శీతాకాలంలో నమోదు చేయబడిన కనిష్ట ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉష్ణోగ్రత తగ్గుతుందని అంచనా వేయనప్పటికీ, ఉష్ణోగ్రత తగ్గుదల ఖచ్చితంగా నగరవాసుల్ని వణికించనుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో పొరుగు జిల్లా రంగారెడ్డి ఇప్పటికే వణికిపోతోంది. ఈ జిల్లాలకు ఐఎండీ హైదరాబాద్ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాలకు ఫిబ్రవరి 4 వరకు అలర్ట్ వర్తిస్తుంది.
ఇక ఈ చలికాలం తర్వాత, హైదరాబాద్‌ను ఎండలు ఠారెత్తించనున్నాయి. త్వరలో చలికాలం ముగిసిన తర్వాత హైదరాబాద్‌లో వేసవి కాలం కనిపించనుంది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వేసవి కాలం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని సమాచారం. గత మూడు సంవత్సరాలు లా నినా సంవత్సరాలు అయితే, రాబోయే సంవత్సరం ఎల్ నినో కావచ్చు, ఇది వేసవిని మరింత కఠినతరం చేయడమే కాకుండా రుతుపవనాలు కూడా వైఫల్యానికి దారి తీస్తుంది. 2015లో జరిగిన ఎల్ నినో సంఘటన వేసవిలో నగరంలో ఉష్ణోగ్రతను గణనీయంగా పెంచింది. ఇది భారతదేశంలో వర్షపాతం మరియు పంటల ఉత్పత్తిని కూడా ప్రభావితం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News