హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad : స్విగ్గీలో స్వీట్ ఆర్డర్ చేస్తే .. తినేలోపే అమాయకుడి ప్రాణం పోయింది

Hyderabad : స్విగ్గీలో స్వీట్ ఆర్డర్ చేస్తే .. తినేలోపే అమాయకుడి ప్రాణం పోయింది

Hyderabad Murder

Hyderabad Murder

Hyderabad: గంట వైయిట్ చేయ‌మ‌న్న పాపానికి క‌త్తితో పొడిచేశాడు స్విగ్గీ డెల‌వ‌రీ బాయ్. డెల‌వ‌రీ విష‌యంలో ఆలస్యమైందన్న కోపంలో ఘర్షణకు దారి తీసింది. దాడిలో గాయపడిన వ్యక్తి వారం రోజుల పాటు ప్రాణాల‌తో పోరాడి మృతి చెందాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

(M.Balakrishna,News18,Hyderabad)

గంట వైయిట్ చేయ‌మ‌న్న పాపానికి క‌త్తితో పొడిచేశాడు స్విగ్గీ డెల‌వ‌రీ బాయ్(Swiggy delivery boy). డెల‌వ‌రీ విష‌యంలో ఇద్ద‌ర మధ్య జ‌రిగిన గొడ‌వ చిలికి చిలికి గాలివాన‌గా మారి ప్రాణాలు తీసింది. వారం రోజుల పాటు ప్రాణాల‌తో పోరాడి మృతి చెందాడు బాధితుడు. గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్‌ (Golf Edge Apartment)లో పనిచేస్తున్న వంట మనిషి శివ ప్రసాద్‌(Shiva Prasad)ను సెప్టెంబర్ (September) 15న స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ కత్తితో పొడిచాడు. కత్తిపోటుతో గాయపడిన శివప్రసాద్ వారం రోజులపాటు ప్రాణాల‌తో పోరాడి మృతి చెందాడు.

Rain alert: తెలంగాణకు భారీ వర్ష సూచన .. రెయిన్ ఎఫెక్ట్ ఎన్ని రోజులంటే ..?

ఆలస్యం అవడమే కారణం..

మృతుడు శివప్ర‌సాద్ కెవిఎస్ భాస్కర్ నివాసంలో గత ఎనిమిది నెలలుగా వంట మనిషిగా పనిచేస్తున్నాడు. సెప్టెంబరు 8న భాస్కర్ బంధువు సాయిశ్రీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్విగ్గీలో స్వీట్లు ఆర్డర్ చేశాడు. బంజారాహిల్స్‌లోని షాప్ నుండి స్విగ్గీ డెలివరీ బాయ్ షేక్ అమీర్ ఆర్డర్ తీసుకున్నాడు. అయితే షేక్ అమీర్ అడ్ర‌స్ క‌న్ఫ్యూజ్ కావ‌డం వ‌ల‌న‌ ఆర్డర్ రెండు గంటలు ఆలస్యంగా డెల‌వ‌రి చేయ‌డానికి వ‌చ్చాడు.  ఈ అడ్ర‌స్ గంద‌ర‌గోళంలో అమీర్‌కి సాయిశ్రీ చాలాసార్లు ఫోన్ చేశాడు. కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

క్షణికావేశంలో గొడవ..

అయితే తీరా డెల‌వ‌రీ బాయ్ ఆర్డ‌ర్ డెల‌వ‌రీ చేయ‌డానికి శివ లేక‌పోవ‌డంతో ఫ్లాట్‌కి వచ్చే వరకు వేచి ఉండేలా చూడాలని విక్కీ డెల‌వ‌రీ బాయ్‌ని కోరాడు. దీంతో మ‌ళ్లీ ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో శివ ప్లాట్‌కి వ‌చ్చేస‌రికి సెప్టెంబర్ 8 సాయంత్రం 6 గంటల ప్రాంతంలో డెలివరీ బాయ్ కూరగాయలు కోసే కత్తితో శివ‌పై దాడి చేశాడు. శివ చెంప, గడ్డం, ఛాతీపై గాయాలయ్యాయి. గొడ‌వ‌ సమయంలో డెలివరీ వ్యక్తి చేయడానికి వచ్చిన వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. డెల‌వ‌రీ విష‌యంలో ఇద్ద‌రి మ‌ద్య అయిన గొడ‌వ చివ‌రికి శివ ప్రాణాలు తీసింది.

కొడాలి నాని లారీలు కడుక్కునే టైంలోనే కార్పొరేటర్‌ని .. గుడివాడలో పోటీ చేసి గెలుస్తా : రేణుకాచౌదరి

స్వీట్‌ ఆర్డర్ చేస్తే ప్రాణం పోయింది..

ఆన్‌లైన్‌ స్వీట్‌ ఆర్డర్ డెలవరీ విషయంలోనే శివ, అమీర్ మధ్య వాగ్వాదం జరిగిందని పోలీసులు తేల్చారు. కులం, మతం ఆధారంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని గచ్చిబౌలి పోలీసులు ధృవీకరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన శివను కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి, ఆపై నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన శివ‌ చికిత్స పొందుతూ సెప్టెంబర్ 15న మరణించాడు. నిందితుడు పరారీలో ఉన్నాడని, వీలైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. స్విగ్గీలో  స్వీట్స్ బుక్ చేయ‌డం ప్రాణాల మీద‌కు తెచ్చింది. చిన్న‌పాటి గోడ‌వ ఇలా ప్రాణాలు తీసే వ‌ర‌కు వెళ్లుతుంద‌నుకోలేదని శివ కుటుంబ స‌భ్యులు వాపోతున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Hyderabad, Telangana crime news

ఉత్తమ కథలు