హోమ్ /వార్తలు /తెలంగాణ /

డబ్బులకు కక్కుర్తి పడ్డారు.. పోలీసులే అడ్డంగా బుక్కయ్యారు

డబ్బులకు కక్కుర్తి పడ్డారు.. పోలీసులే అడ్డంగా బుక్కయ్యారు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బేగంపేటకు చెందిన కే రాఘవేందర్ అనే వ్యక్తిపై గత ఏడాది డిసెంబర్ 21న బేగంపేట పోలీస్ స్టేషన్ లో 420, 417 సెక్షన్ల కింద కేసు నమోదు అయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Hyderabad

చట్టాన్ని న్యాయాన్ని రక్షించాల్సిన పోలీసులే... దాన్ని అతిక్రమించారు. కాసులకోసం కక్కుర్తి పడి.. అడ్డంగా బుక్కయ్యారు. దీంతో కేసులు నమోదు చేసి పౌరులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులపైనే.. తిరిగి కేసులు నమోదు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్ బేగం పేట పోలీస్ స్టేషన్ లో ఓ ఎస్సై... లంచం డిమాండ్ చేశారు. అతనితో పాటు.. కానిస్టేబుల్ కూడా జతకట్టాడు. ఓ బాధితునికి స్టేషన్ బెయిల్, జప్తుచేసిన వాహనాన్ని తిరిగి ఇవ్వడానికి బేగంపేట పోలీస్టేషన్ లో ఓ ఎస్సై రూ.12 వేలు డిమాండ్ చేశాడు. దీంతో ఆ ఎస్ఐతో పాటు అందులో భాగస్వామిగా ఉన్న కానిస్టేబుల్ పై కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా మంగళవారం ఏసీబీ అధికారులు బేగంపేట పోలీస్ స్టేషన్ లో నాలుగు గంటల పాటు సోదాలు జరిపారు.

కేసు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఫైళ్లను, కేసుకు సంబంధించిన ఇతర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎస్ఐని ప్రశ్నించారు. ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేటకు చెందిన కే రాఘవేందర్ అనే వ్యక్తిపై గత ఏడాది డిసెంబర్ 21న బేగంపేట పోలీస్ స్టేషన్ లో 420, 417 సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. ఈ కేసులో స్టేషన్ బెయిల్, సీజ్ చేసిన వాహనం తిరిగి అప్పగించడంతో పాటు ఇతర సహాయాల కోసం ఎస్ఐ బాధితుడి వద్ద నుంచి రూ. 15వేలు డిమాండ్ చేశాడు. ఆ డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందని అన్నాడు. ఇక ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ నరేష్ కూడా తనకు రూ. 3వేలు ఇవ్వాల్సి ఉంటుందని బాధితుడికి చెప్పాడు.

లంచం డబ్బులతో పాటు బెయిల్ ఇప్పించడం కోసం (ఎఫ్ఆర్) మరో రూ. 5 వేలు ఇవ్వాలని చెప్పారు. జనవరి 3వ తేదీన ఎఫ్ డీఆర్ కు రూ. 5 వేలు రాఘవేందర్ చెల్లించాడు. అదే సమయంలో కానిస్టేబుల్ నరేష్ కు కూడా వెయ్యి రూపాయలు చెల్లించాడు. బాధితుడి అభ్యర్థన మేరకు ఎస్ఐ సాయికుమార్ తన డిమాండ్ డబ్బు రూ. 15 వేల నుంచి రూ. 12వేలకు తగ్గించాడు. ఈ డబ్బు కోసం ఎస్ఐ రాఘవేందర్ ను వేధిస్తుండటంతో చివరకు బాధితుడు రాఘవేందర్ అవినీతి శాఖ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి అందించిన వీడియోలు, ఆడియోల ఆధారాలతో ఎస్ఐ సాయికుమార్, కానిస్టేబుల్ నరేష్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

First published:

Tags: ACB, Hyderabad, Local News