Home /News /telangana /

HYDERABAD HYDERABAD SON WAS IN THE ROOM WITH THE MOTHER DEAD BODY FOR THREE DAYS SNR

Telangana:తల్లి మృతదేహంతో మూడ్రోజులుగా గదిలో ఉన్న కొడుకు..మల్కాజ్‌గిరిలో డెత్ మిస్టరీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana:కన్నతల్లి చనిపోయింది. ఆ కొడుకుకి కొంచెం కూడా బాధ లేదు. కనీసం బంధువులు, చుట్టు పక్కల వాళ్లకు విషయం తెలియజేయలేదు. చనిపోయిన తల్లి శవాన్ని ఇంట్లో పెట్టుకొని మూడ్రోజులు గడిపాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఇంకా చదవండి ...
ఆమెది హత్య, ఆత్మహత్య, లేక సాధారణ మరణమో తెలియని పరిస్థితి. ఎసలు ఏం జరిగిందో ఎవరికి తెలియదు. మృతదేహం మూడ్రోజులుగా ఫ్లాట్‌లోనే ఉండటంతో దుర్వాసన వచ్చే వరకు ఆమె చనిపోయిందనే విషయం స్థానికులకు, పోలీసులకు తెలియదు. ఈ డెత్ మిస్టరీలో అసలు ట్విస్ట్ ఏమిటంటే..ఆమె కుమారుడు ఈ మూడ్రోజులు విషయం పోలీసులకు తెలిసే వరకు ఫ్లాట్‌లోనే ఆమె శవం పక్కనే ఉన్నాడు. అసలు ఏం జరిగిందనే భయాందోళనలో అపార్ట్‌మెంట్‌ వాసులు ఉన్నారు. ఈ దారుణం హైదరాబాద్‌Hyderabad లోని మల్కాజ్‌గిరి(Malkajgiri)లో చోటుచేసుకుంది. విష్ణుపురి కాలనీలో(Vishnupuri Colony)ని మైత్రి నివాస్ (Maitri Nivas) అపార్టుమెంట్‌లోని ఫ్లాట్‌ నెంబర్ 202లో విజయ(Vijaya) అనే 50సంవత్సరాల మహిళ(50Years old women) చనిపోయింది. గదిలోంచి మూడ్రోజులుగా ఆమె బయటకు రాలేదు. ఆమె కుమారుడు 22సంవత్సరాల సాయికృష్ణ (Saikrishna)సైతం బయట కనిపించలేదు. శనివారం (Saturday)ఫ్లాట్‌లోంచి దుర్వాసన రావడంతో పొరుగున ఉంటున్న వాళ్లు మల్కాజ్‌గిరి పోలీసు(Police)లకు సమాచారం ఇచ్చారు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు లోపల మహిళ మృతదేహం(Dead body)తో పాటు ఆమె కుమారుడు కూడా ఉండటం చూసి షాక్ అయ్యారు. అసలు ఎలా జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీశారు. అపార్ట్‌మెంట్‌(Apartment)‌లో నివాసముంటున్న మరికొందరు విజయను ఆమె కుమారుడు సాయికృష్ణనే హత్య చేసి ఉంటాడనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. చనిపోయిన మహిళ కుమారుడు సాయికృష్ణ మానసిక పరిస్థితి బాగుండేది కాదని అందుకే తల్లితో తరచూ గొడవపడుతూ ఉండేవాడని చెప్పారు.

మూడ్రోజులుగా తల్లి శవం పక్కనే..
అనుమానాస్పదమృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గదిలో తల్లి మృతదేహం ఉంటే కనీసం పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదని సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారిస్తున్నారు. మానసిక పరిస్థితి సరిగాలేక సాయికృష్ణ తల్లిని హత్య చేశాడా అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు. లేదంటే తల్లి చనిపోయిందనే విషయాన్ని కూడా గమనించలేని మానసికస్థితిలో ఉన్నాడో తెలుసుకుంటున్నారు.

మానసిక రోగా లేక చంపాడా ..
ఈకేసులో నిజా నిజాలు ఎలా ఉన్నప్పటికి ..తల్లి మృతదేహం గదిలో ఉంటే మూడ్రోజుల పాటు దుర్వాసన వచ్చే వరకు కొడుకు ఎలా ఉన్నాడని స్థానికులు, పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ఇలాంటి సంఘటనలు ఈమధ్య కాలంలో ఎక్కువగా జరుగుతుండటంతో మల్కాజ్‌గిరి పోలీసులు సాయికృష్ణ మానసికస్థితి ఎలా ఉందో ముందు తెలుసుకుంటున్నారు. సరూర్‌నగర్‌లో మానసకి పరిస్థితి సరిగా లేని దత్తపుత్రుడు సాయితేజ తల్లి భూదేవిని హత్య చేసిన వారం రోజుల్లోనే అదే తరహాలో మరో ఘటన జరగడంతో పోలీసులు డబ్బుల కోసం మల్కాజ్‌గిరిలో సాయికృష్ణ తల్లిని చంపి ఉంటాడా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Crime news, Hyderabad, Old women killed, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు