హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad:పెట్రోల్‌తో పనిలేకుండా కారు నడిపిస్తున్నాడు..ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ది ఏం బుర్ర సామి

Hyderabad:పెట్రోల్‌తో పనిలేకుండా కారు నడిపిస్తున్నాడు..ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ది ఏం బుర్ర సామి

Photo Credit:Youtube

Photo Credit:Youtube

Pedal Car:అది ఆటో కాదు. అలాగని రిక్షా అంతన్న కాదు. డిజైనర్ మాత్రం కారు అంటున్నాడు. పెట్రోల్‌తో పనిలేకుండా కేవలం ఛార్జింగ్‌తో నడిచే వాహనాన్ని రూపొందించాడు. దానికి పెడల్ కారు అని ేరు పెట్టాడు. ఈ వాహనాన్ని ఐదుగురు తొక్కుతుంటే ఒకేసారి ఏడుగురు ప్రయాణించే విధంగా డిజైన్ చేశాడు హైదరాబాద్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.

ఇంకా చదవండి ...

కళ్లు ఉన్నవాడు ముందు మాత్రమే చూస్తాడు. దిమాక్ ఉన్నాడో దునియా మొత్తం చూస్తాడనే దూకుడు సినిమాలో డైలాగ్‌కి సరిపోయేలా తన బ్రెయిన్‌కి పదునుపెట్టాడో సాఫ్ట్‌పేర్ ఇంజనీర్. హైదరాబాద్‌(Hyderabad)కి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్(Software engineer)తన బుర్రను ఉపయోగించి ఓ వెరైటీ వెహికల్‌ని సృష్టించాడు. రోజు రోజుకు పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు, మరోవైపు వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెండింటి సమస్య లేకుండా ఉండేలా ఓ వినూత్నమైన వాహనాన్ని కనిపెట్టాడు. హైదరాబాద్‌ లాంటి సిటీలో హెల్దీ జర్నీ కోసం పెడల్ కార్‌(Pedal Car)ని డిజైన్ చేశాడు హైదరాబాద్‌కి చెందిన ప్రణయ్‌ ఉపాధ్యాయ (Pranay Upadhyay)అనే సాఫ్‌వేర్ ఇంజనీర్. సిటీలో తిరగడానికి వీలుగా ఉండేలా ఓ సెవన్ సిట్టర్‌ వెహికల్‌(Seven Sitter Vehicle)ని అత్యంత తక్కువ ఖర్చుతో డిజైన్ చేశాడు. తాను సృష్టించిన వాహనానికి పెడల్ కార్‌గా నామకరణం చేశాడు ప్రణయ్‌ ఉపాధ్యాయ. ఈ పెడల్ కారులో ఒకేసారి ఏడుగురు ఒకేసారి ప్రయాణించవచ్చు. అయితే సైకిల్‌ తొక్కినట్లుగా ఐదుగురు వ్యక్తులు ఈ వెహికల్‌ని తొక్కుతూ ఉండాలి మరో రెండు సీట్లు వృద్ధులు, వికలాంగుల కోసం స్పేర్‌గా ఉంచారు. ప్రణయ్‌ తయారు చేసిన కారు గంటకు 25-30 కిలోమీటర్ల (25-30కKMPH)వేగంతో నడుస్తుంది. ఈ వాహనాన్ని ఇంధనంతో పని లేకుండా కేవలం ఛార్జింగ్‌(Charging‌)తో నడిచే విధంగా రూపొందించాడు.

పెడల్ కారు..

ఈ పెడల్‌ కారు నడిపించేందుకు 1000వాట్స్ బీఎల్‌డీసీ మోటర్‌ను కారుకు అమర్చాడు. అలాగే 400వాట్స్ మోనో పెర్స్ సోలార్ ప్యానల్‌ని ఉపయోగించాడు. దీని వల్ల సులభంగా బ్యాటరీ ఛార్జింగ్‌ అవుతుందని..ఎలాంటి వాయు, శబ్ధ కాలుష్యం ఉండవని పెడల్ కారు రూపకర్త ప్రణయ్ ఉపాధ్యాయ చెబుతున్నాడు. చూడటానికి కాస్త నాలుగు చక్రాల రిక్షా బండిలా కనిపించే ఈ పెడల్ కారును ఇంకొంచెం అభివృద్ధి చేసి సమర్ధవంతంగా పనిచేసేలా స్ట్రాంగ్‌గా ఉండేందుకు వెదురుతో తయారు చేస్తానని వెల్లడించారు. పూర్తిస్థాయిలో ఈ పెడల్‌ కారును తయారు చేసిన తర్వాత కొనుగోలు చేయాలనుకునే వారి కోసం బహిరంగ మార్కెట్‌లో అందుబాటులోకి తెస్తామని చెప్పాడు.

నో పెట్రోల్..నో పొల్యూషన్ ..

అయితే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇంతటి వెరైటీ వెహికల్ కనుగొనడానికి ప్రధాన కారణం కాలుష్యం అంటున్నాడు. మానసీక అనారోగ్యంతో పుట్టిన తన బిడ్డలను చూసిన తర్వాత ఒంటరిగా ప్రయాణించేందుకు ఇంధనంతో నడిచే వాహనాలు వాడకూడదని నిర్ణయించుకున్నాడట ప్రణయ్‌ ఉపాధ్యాయ. ఆ వాహనాల వెదజల్లే కాలుష్యం వల్లే మానసీక అనారోగ్యం కలుగుతుందనేది ప్రణయ్‌ ఉపాధ్యాయ భావన. అందుకే మన పిల్లల ఆరోగ్యం కోసం నాన్‌ పొల్యూషన్‌ వెహికల్‌నే వాడాలని నిర్ణయించుకొని పెడల్ కారును తయారు చేశాడు. గత వారం రోజులుగా ఇదే వాహనంపై ఆఫీసుకు వెళ్తున్నానని గర్వంగా చెబుతున్నాడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రణయ్‌ ఉపాధ్యాయ.

Published by:Siva Nanduri
First published:

Tags: Greater hyderabad, Trending news

ఉత్తమ కథలు