Home /News /telangana /

Hyderabad Sisters: వారిద్దరు అక్కాచెల్లెళ్లు.. ఉదయం 5 గంటలకు నిద్రలేచి వాళ్లు ఏం చేస్తారో తెలుసా..

Hyderabad Sisters: వారిద్దరు అక్కాచెల్లెళ్లు.. ఉదయం 5 గంటలకు నిద్రలేచి వాళ్లు ఏం చేస్తారో తెలుసా..

హైదరాబాద్ కు చెందిన అక్కాచెల్లెళ్లు

హైదరాబాద్ కు చెందిన అక్కాచెల్లెళ్లు

కోవిడ్ నేపథ్యంలో కుటుంబానికి ఆర్థిక చేయూత అందిస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు. మోతీ నగర్‌కు చెందిన ప్రమీల (15), పవిత్ర (13) అనే ఇద్దరు బాలికలు తమ తల్లిదండ్రులకు ఆశాజ్యోతిగా నిలిచారు. ఈ ఇద్దరు అమ్మాయిలు నగరంలోని మోతీ నగర్ ప్రాంతంలో న్యూస్ పేపర్ డెలివరీ చేస్తూ ఎంతోకొంత సంపాదిస్తున్నారు.

ఇంకా చదవండి ...
కరోనా మహమ్మారి(Corona) ఎన్నో కుంటుంబాల స్థితిగతులను తలకిందులు చేసింది. ఇప్పటికీ కోవిడ్ బాధిత కుటుంబాలు కోలుకోలేకపోతున్నాయి. దీంతో కుటుంబ అవసరాల కోసం పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఏదో ఒక పనిచేయాల్సి వస్తోంది. అయితే కోవిడ్ నేపథ్యంలో కుటుంబానికి ఆర్థిక చేయూత అందిస్తున్నారు హైదరాబాద్‌కు(Hyderabad) చెందిన అక్కాచెల్లెళ్లు(Sisters). మోతీ నగర్‌కు చెందిన ప్రమీల (15), పవిత్ర (13) అనే ఇద్దరు బాలికలు తమ తల్లిదండ్రులకు ఆశాజ్యోతిగా నిలిచారు. ఈ ఇద్దరు అమ్మాయిలు నగరంలోని మోతీ నగర్ ప్రాంతంలో న్యూస్ పేపర్(NewsPapers) డెలివరీ చేస్తూ ఎంతోకొంత సంపాదిస్తున్నారు. ఉదయం 5 గంటలకే నిద్రలేచి, ఉదయం 8 గంటల వరకు మోతీ నగర్‌లో వార్తాపత్రికలను పంపిణీ చేస్తారు. అనంతరం ప్రమీల(Prameela) కాలేజీకి, పవిత్ర(Pavitra) పాఠశాలకు వెళ్తారు. ప్రస్తుతం ప్రమీల ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, పవిత్ర పదో తరగతి చదువుతున్నారు.

Sad Incident: ఆమె ఎన్నో ఆశలతో ఇంటర్ కాలేజీలో జాయిన్ అయింది.. అతడు చేసిన ఆ పనికి.. పరిస్థితి ఇక్కడ వరకు వచ్చింది..


ఈ విషయంపై న్యూస్ 18 బృందం ఈ అక్కాచెల్లెళ్ల తల్లిదండ్రులను సంప్రదించింది. బాలికల తండ్రి రామ్ దాస్ నాయక్‌ మాట్లాడుతూ.. కరోనా లాక్‌డౌన్ సమయంలో న్యూస్ పేపర్ డెలివరీ బాయ్స్ ఎవరూ పనిలోకి రాలేదని చెప్పారు. మహమ్మారి నేపథ్యంలో కొత్తవాళ్లు ఎవరూ ఈ పనికి రాలేదని, దీంతో తాను ఒక్కడినే సొంతంగా వార్తా పత్రికలు వేసేవాడినని తెలిపారు. అయితే ఇందుకు ఎక్కువ సమయం పట్టేదని, దీంతో తనకు సాయం చేసేందుకు కూతుళ్లు ఇద్దరూ డెలివరీ గర్ల్స్‌గా పని చేయడానికి ముందుకు వచ్చారని వివరించారు.

Painfull Incident: దారుణం.. అతడు ఆ పని చేశాడని.. పందిరి గుంజ కు 18 గంటల పాటు తాళ్లతో కట్టేసి చితకబాదారు..


సాధారణంగా న్యూస్ పేపర్ డెలివరీ చేసేవారు ఎక్కువగా అబ్బాయిలే ఉంటారు. అయితే ఈ పనిలో ప్రమీల, పవిత్ర అంకితభావం చూసిన రామ్ దాస్, 3 నెలల క్రితం వారికోసం ఒక స్కూటర్‌ కొనుగోలు చేశాడు. ఇప్పుడు తన కూతుళ్లిద్దరూ ప్రతిరోజూ 300 కంటే ఎక్కువ న్యూస్ పేపర్లను పంపిణీ చేస్తున్నారని రామ్ దాస్ నాయక్ వివరించారు.

న్యూస్ 18తో మాట్లాడిన ప్రమీల, పవిత్ర.. తాము భవిష్యత్తులో పోలీస్ ఆఫీసర్లు కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పాఠశాలకు వెళ్లేటప్పుడు తన తండ్రి వార్తాపత్రికలు అందజేస్తూ ఉండేవారని ప్రమీల చెప్పింది. ‘లాక్‌డౌన్ సమయంలో డెలివరీ బాయ్స్ దొరక్కపోవడంతో మా నాన్న ఇబ్బందుల్లో పడ్డారు. దీంతో న్యూస్ పేపర్లు వేయాలని ప్రవిత్రను, నన్ను నాన్న అడిగారు. మాకు ఈ పని థ్రిల్లింగ్‌గా అనిపించడంతో ఇష్టపడి చేశాం’ అని చెప్పింది. కస్టమర్ల నుంచి సైతం మంచి ప్రోత్సాహం లభించిందని, పండుగల సందర్భంగా కస్టమర్లు అదనంగా డబ్బు, స్వీట్లు కూడా ఇస్తున్నారని పవిత్ర తెలిపింది. తాము అబ్బాయిలతో సమానమని, ఎలాంటి పని అయినా చేయగలమని ఆమె వివరించింది.

Sad: వాళ్లిద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు కదా.. వాళ్లను చూసిన తర్వాత భార్యభర్తలు ఇలా ఉండొద్దని నేర్చుకుంటారు..


ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకు ఈ బాలికల దినచర్య ప్రారంభమవుతుంది. ముందు సంబంధిత ఏజెంట్ నుంచి వార్తాపత్రికలు తీసుకువస్తారు. అనంతరం మెయిన్ పేపర్, డిస్ట్రిక్ పేపర్లను కలిపి జతచేస్తారు. ఆ తరువాత స్కూటర్‌పై వెళ్తూ అన్ని న్యూస్ పేపర్లను పాఠకులకు అందజేస్తారు. న్యూస్‌పేపర్ బిజినెస్ ద్వారా తమ కూతుళ్లు నెలకు రూ.10,000 వరకు సంపాదిస్తున్నారని చెబుతున్నారు రామ్ దాస్ నాయక్. తాను హైదరాబాద్‌లోని ఒక దుకాణంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నానని చెప్పారు. కుమార్తెలు ఇద్దరికీ నాణ్యమైన విద్యను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

మీ నగరం నుండి (​హైదరాబాద్)

తెలంగాణ
​హైదరాబాద్
తెలంగాణ
​హైదరాబాద్
Published by:Veera Babu
First published:

Tags: Brand Hyderabad, News papers, Two girls, Viral

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు