హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: మరింత అందంగా చార్మినార్! కూలింగ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన పోల

Hyderabad: మరింత అందంగా చార్మినార్! కూలింగ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన పోల

X
water

water plant

ఈద్‌ షాపింగ్‌కు స్పెషల్‌ డిజైన్స్‌ ను ముంబాయి, గుజరాత్‌ ప్రాంతాల నుంచి తీసుకొనివస్తారు. రంజాన్‌ మాసంలో ఈవినింగ్‌ టైంలో ముఖ్యంగా రోజా అయిపోయిన తరువాత ఇక్కడ జనాలు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

(దస్తగిరి, న్యూస్‌-18 తెలుగు, రిపోర్టర్)

హైదరాబాద్ పాతబస్తీ అనగానే గుర్తుకు వచ్చేది ఛార్మినార్. ఈ పురాతన కట్టడం చుట్టూ అనేక వ్యాపారాలు వేల ఏళ్లుగా నడుస్తున్నాయి. ఇక్కడ దొరికే గాజులు, ఇరానీ ఛాయ్, పెరల్స్ దేశ వ్యాప్తంగానే కాదు, అనేక దేశాల్లోనూ ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా ఛార్మినార్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేవి అత్తర్లు. ఇక్కడ దాదాపు 500 రకాలకుపైగా అత్తర్లు తయారు చేసి అమ్ముతున్నారు. నాలుగు శతాబ్దాలుగా ఈ వ్యాపారం సాగుతోంది. కొన్ని షాపులు 150 సంవత్సరాలుగా నడుస్తున్నాయి. నాలుగోతరం వ్యక్తులు ఆ షాపులను నడుపుతున్నారు.

రంజాన్ జోష్‌లో యువత:

ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ నెల ప్రారంభమైంది. ఉపవాస దీక్షలు మొదలయ్యాయి. ఐతే హైదరాబాద్‌కు గర్వకారణమైన మక్కా మసీదు.. ఈ రంజాన్ సమయంలో మరింత ప్రత్యేకతను చాటుకుంటుంది. ఎంతో పురాతనమైన ఈ మసీదు ముస్లింల భక్తి పారవశ్యంతో కొత్త శోభను సంతరించుకుంటుంది. ఇఫ్తార్ సమయంలో ఇక్కడ దాదాపు 2వేల మంది పురుషులు, మహిళలు, పిల్లలు తమ ఉపవాసాన్ని విరమించుకోవడానికి గుమిగూడుతారు. శుక్రవారాలు, రంజాన్ చివరి రోజుల్లో ఈ సంఖ్య దాదాపు 5వేలకి పెరుగుతుంది. పవిత్ర మాసం ముగింపు రోజుల్లో మక్కా మసీదులోని ‘సెహన్’లో ప్రతిరోజూ 1,000 మంది మహిళలు తమ ఉపవాసాన్ని విరమిస్తారు. ఇక్కడున్న పతేర్‌గట్టి క్లాత్ మార్కెట్ కూడా చాలా ఫేమస్. వందల కోట్ల వ్యాపారం జరుగుతుంది.

రంజాన్ సమయంలో మక్కా మసీదులో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. మసీదు ప్రాంగణమంతా షామియాలు వేస్తారు. ఎంతో అందంగా ఉండే మసీదుకు ఇవి అదనపు ఆకర్షణ తీసుకొస్తాయి. ఉపవాసం ఉండే వారికి.. మసీదు అడ్మినిస్ట్రేషన్ ఉచిత ఖర్జూరాలు, త్రాగునీరు అందిస్తుంది. సాయంత్రం ఆరు గంటలు కాగానే ఇఫ్తారీ, హలీమ్, దహివాడ, ఇతర మిఠాయిలను కూడా విక్రయిస్తారు. దీనితో పాటు మసీదు వరండా దగ్గర ఉన్న కడాయ్‌లో వేడి వేడి వంటకాలను అప్పటికప్పుడు సిద్ధం చేస్తారు. ఇక ఏడాది పోలీసులు చార్మినార్ వద్ద కూలింగ్‌ డ్రింకింగ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు..

అందంగా ముస్తాబైన పలు చారిత్రాత్మక కట్టడాలు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. పండగ సీజన్‌ ముగుస్తుండడంతో చార్మినార్‌, పాతబస్తీ ప్రాంతాలు రద్దీగా మారుతున్నాయి... వస్త్రాలు, అలకరణ వస్తువులు, గృహోపకరణాల్లో వెరైటీ వెరైటీ కలెక్షన్స్‌ చార్మినార్‌ దగ్గరే ఉంటాయి. అర్ధరాత్రి 12 అయిన షాపుల దగ్గర ఉంటే సందడిని బట్టి ఇంది ఎంత స్పెషలో తెలుసుకోవచ్చు. దుస్తులు విషయానికొస్తే స్టోన్‌ వెరైటీస్‌.. కళ్లుచెదిరే కలర్స్‌ ఇక్కడ ఉంటాయి. ఈద్‌ షాపింగ్‌కు స్పెషల్‌ డిజైన్స్‌ ను ముంబాయి, గుజరాత్‌ ప్రాంతాల నుంచి తీసుకొనివస్తారు. రంజాన్‌ మాసంలో ఈవినింగ్‌ టైంలో ముఖ్యంగా రోజా అయిపోయిన తరువాత ఇక్కడ జనాలు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.మార్కెట్‌లో ఏ కొత్త చెప్పుల డిజైన్స్‌ విడుదలైన అవి చార్మినార్‌లో లభిస్తాయి.

First published:

Tags: Charminar, Hyderabad, Ramzan 2023

ఉత్తమ కథలు