హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad rains:బయటికి రావొద్దు -ఇవాళ కూడా భారీ వర్షం -ఇవీ తాజా అప్‌డేట్స్

Hyderabad rains:బయటికి రావొద్దు -ఇవాళ కూడా భారీ వర్షం -ఇవీ తాజా అప్‌డేట్స్

హైదరాబాద్ లో నేడు కూడా భారీ వర్షం

హైదరాబాద్ లో నేడు కూడా భారీ వర్షం

Hyderabad rains updates| తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం తాలూకు బీభత్సం శనివారం కూడా కొనసాగుతున్నది. ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని, అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటికి రావొద్దని అధికారులు హెచ్చరించారు. మూసీ నది సహా ఇతర జల మార్గాల్లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా వరదలో మునిగిపోయాయి. వందలాది ఇళ్లు నీటమునిగాయి. పైనుంచి వరద కొనసాగుతుండటంతో పరిస్థితి ఇంకా చక్కబడలేదు. చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. వివరాలివి..

ఇంకా చదవండి ...

హైద‌రాబాద్ న‌గ‌రంలో శ‌నివారం మ‌ధ్యాహ్నం త‌ర్వాత భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో డైరెక్ట‌ర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్‌, డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నందున న‌గ‌ర ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి పౌరులు త‌మ ప్ర‌యాణ ఏర్పాట్లు చేసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. భారీ వ‌ర్ష సూచ‌న నేప‌థ్యంలో డీఆర్ఎఫ్ బృందాలు అల‌ర్ట్ అయ్యాయి.

ఉరుము, మెరుపు లేకుండా నిన్న రాత్రి కురిసిన వర్షానికి భాగ్యనగరం మొత్తం మునిగిపోయింది. ఫలానా ప్రాంతం అనే తేడా లేకుండా నగరం నలుమూలలా వర్షం ముంచెత్తింది. దీంతో ప్రజలు సుమారు కొన్ని గంటల పాటు బయటకు రాకుండానే ఉండిపోయారు. దసరా పండుగ సమయంలో ఇలా వర్షం కురవడంతో షాపింగ్‌లకు వెళ్దామనుకున్న వారు కూడా బయటకు రావడానికి వీలుపడలేదు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శుక్రవారం రాత్రి కురిసిన కుంభవృష్టి అందరినీ కష్టంలోకి నెట్టేసింది. మూసీని ఆనుకుని ఉండే లోతట్టు ప్రాంతాలైతే కొద్ది గంటలుగా నరకాన్ని చవిచూస్తున్నట్లు దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. చాలా చోట్ల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద ఓ లారీ బ్రేక్ డౌన్ కారణంగా వరదనీటిలో చిక్కుకుపోవడంతో హైదరాబాద్-బెంగళూరు రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డుకు అటుఇటు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి.

హైదరాబాద్ వాతావరణ విభాగం చెప్పిన వివరాల ప్రకారం, నగరంలోని లింగోజిగూడలో 10.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, కుర్మగూడలో 10 సెంమీ, హస్తినాపురం 8.8, ఆస్మాన్‌ఘడ్‌ 8.7, సర్దార్‌ మహల్‌ 8.6, కంచన్‌బాగ్‌ 8.4, జూ పార్క్ 8, అల్కాపురి కాలనీ 7.1, అత్తాపూర్ 7, రాజేంద్రనగర్‌లో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

నగరంలో శుక్రవారం రాత్రి కురిసన వర్షానికి 20కిపైగా కాలనీలు నీట మునిగాయి. వరద తగ్గుముఖం పట్టిన తర్వాతే ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే వీలుంటుంది. నగరంలో ఎక్కడిక్కడే జీహెచ్ఎంసీ, పోలీస్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే,

హైదరాబాద్ లోని జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ చెరువులకు వరద ప్రవాహం పోటెత్తింది. ఈ నేపథ్యంలో అధికారులు రెండు చెరువుల నుంచి మూసీ నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్‌ సాగర్ నాలుగు గేట్లు ఎత్తి 1,400 క్యూసెక్కులు, ఉస్మాన్‌సాగర్‌ 4 గేట్లు ఎత్తి 960 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

Cyclone Jawad: దూసుకొస్తున్న జావద్ తుపాను.. ఏపీకి పొంచి ఉన్న మరో ముప్పు


మరోవైపు, ఏపీకి పొంచి ఉన్న మరో తుఫాను ముప్పు తెలంగాణపైనా ప్రభావం చూపించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 10న ఉత్తర అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుందని, అది బలపడి 13-14 తేదీల్లో తుఫానుగా మారొచ్చని, దాంతో ఏపీలో విపరీతంగా, తెలంగాణలో మోస్తారుగా వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది.

First published:

Tags: Heavy Rains, Hyderabad Rains, Telangana, Weather report

ఉత్తమ కథలు