Home /News /telangana /

HYDERABAD HYDERABAD RADISON BLU PUB CASE POLICE READY TO ISSUE NOTICE TO VIPS SB

Drugs case: రాడిసన్ పబ్ కేసు.. డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు... వారికి నోటీసులు తప్పవా ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పబ్‌లో పట్టుబడినవారిలో పలువురు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తెలుస్తోంది. మొత్తం 20 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఈ కేసులో పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

    హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసులో కీలక విషయాలు తెరపైకి వస్తున్నాయి. రాడిసన్ బ్లూ హోటల్‌లోని ఫుడ్ మింక్ పబ్ కేసులో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. మింక్ పబ్ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు అధికారులు. అయితే పబ్‌లో పట్టుబడ్డ వారిలో కిందరు డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆధారాలు దొరికాయన్నారు. పబ్‌లో 20మందికి డ్రగ్స్ సరఫరా అయినట్లు పోలీసులకు ఆధారాలు లభ్యమమయ్యాయి. డ్రగ్స్ తీసుకున్న 20 మందికి నోటీసులు ఇచ్చే పనిలో పోలీసులు ఉన్నారు.

    డ్రగ్స్ తీసుకున్న విఐపిలకు నోటీసు ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. పబ్ నిర్వహాకుడు మేనేజర్ అనిల్ తో పాటు అభిషేక్ కనుసన్నల్లోనే డ్రగ్స్ సరఫరా.. జరిగినట్లు తెలుస్తోంది. అభిషేక్ కాంటాక్ట్ లిస్ట్ గోవా ముంబైకు చెందిన కొంతమంది వ్యక్తుల సమాచారం ఉంది. మేనేజర్ అనిల్ కాంటాక్ట్ లో గతంలో డ్రగ్స్ తో పట్టుబడిన పెడ్లర్స్‌తో సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. గోవా, ముంబై లో నుంచి అనిల్.. డ్రగ్స్ తెప్పించినట్లుగా ఇచ్చినట్టుగా పోలీసులకు ఆధారాలు..దొరికినట్లు తెలుస్తోంది.

    గత వారం పబ్‌లో డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం రావడంతో అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పలువురు ప్రముఖులు, రాజకీయ, సినీ సెలబ్రిటీల పిల్లలు పట్టుబడ్డారు. రాత్రి మూడు గంటల ప్రాంతంలో పబ్‌పై దాడులు చేసిన పోలీసులు మొత్తం 150మందిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌ను తరలించారు. వారిని విచారించి ఆ తర్వాత ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇళ్లకు వదిలి పెట్టారు.

    మరోవైపు, ఫుడింగ్ అండ్ మింక్ డ్రగ్స్ కేసుకు సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్‌లో నలుగురి పేర్లు చేర్చారు. ఇందులో A1గా అనిల్, A2గా అభిషేక్, A3గా అర్జున్, A4గా కిరణ్ రాజ్‌లను పేర్కొన్నారు. ప్రస్తుతం అనిల్, అభిషేక్ చంచల్ గూడ జైల్లో రిమాండులో ఉండగా అర్జున్, కిరణ్ పరారీలో ఉన్నారు. ఈ పబ్‌కి కిరణ్ రాజ్ లీగలైజర్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. రాడిసన్‌ హోటల్‌ లైసెన్స్‌ను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. పబ్‌, లిక్కర్‌ లైసెన్స్‌లను రద్దు చేస్తూ ఎక్సైజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 24 గంటలపాటు లిక్కర్‌ సప్లైకి రాడిసన్‌ హోటల్‌ అనుమతి తీసుకుంది. అయితే పబ్‌లో డ్రగ్స్‌ బయటపడటంతో లైసెన్స్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    హైదరాబాద్‌ డ్రగ్స్‌ సరఫరాపై పూర్తి నిఘా ఉందని నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ చీఫ్‌ చక్రవర్తి తెలిపారు. డ్రగ్స్‌ వినియోగించే స్పాట్స్‌పై సమాచారం ఉందన్నారు. పబ్బులు, క్లబ్‌లు, రెస్టారెంట్‌, రిసార్ట్స్‌పై పూర్తి నిఘా ఉంచామన్నారు. పబ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రగ్స్‌ కేసు నిందితులను ఐదు రోజుల కస్టడీ కోరతూ నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్‌ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Crime news, Drugs case, Hyderabad

    తదుపరి వార్తలు