(M.Balakrishna,News18,Hyderabad)
పర్యావరణానికి తీవ్ర హాని చేస్తున్న ప్లాస్టిక్ కవర్ల (Plastic covers)నిషేధంపై ఎంత అవగాహన కల్పించినా, కొందరు వక్రబుద్ధి మానడం లేదు. కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న వారు కూడా క్లాత్ కవర్లు(Cloth covers),జూట్ కవర్లు (Jute covers)వాడేందుకు వెనకాడుతున్నారు. మిగతా వాటితో పోల్చితే ప్లాస్టిక్ కవర్ల ధర తక్కువగా ఉండటంతో వాటిని వాడేందుకే మొగ్గు చూపుతున్నారు. తాజాగా దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిన పుల్లారెడ్డి స్వీట్స్ (Pullareddy Sweets)షాపులో ప్లాస్టిక్ వాడినందుకు హైదరాబాద్ (Hyderabad)నగర అధికారులు భారీ జరిమానా (Fine)విధించడం చర్చనీయాంశంగా మారింది.
పుల్లారెడ్డి స్వీట్స్‌కు 20 వేల ఫైన్..
ఫేమస్ పుల్లారెడ్డి స్వీట్స్ షాపులో ప్లాస్టిక్ వాడినందుకు అధికారులు భారీ జరిమానా విధించారు.నిషేధం అమల్లో ఉన్నా అవేమీ పట్టించుకోకుండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగించినందుకు సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి, అదనపు పీసీసీఎఫ్ అధికారి అయిన మోహన్ చంద్ర ఆకస్మిక తనిఖీ చేసి భారీ జరిమానా విధించారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడినందుకే..
ప్యాకేజింగ్‌కు ప్లాస్టిక్ వాడినందుకు పుల్లారెడ్డి స్వీట్స్‌పై రూ.20వేలు జరిమానా విధించారు. నిషేధం ఉన్నప్పటికీ అవుట్‌లెట్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తున్నారని సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి, అదనపు పిసిసిఎఫ్ మోహన్ చంద్రకు ఫిర్యాదు చేయడంతో అధికారులు పుల్లారెడ్డి వంటగదిఆకస్మికంగా తనిఖీ చేశారు. నిషేధం ఉన్నప్పటికీ పుల్లారెడ్డి స్వీటు షాపులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తున్నారని సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి మోహన్ చంద్ర తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గుర్తించి వెంటనే భారీ జరిమానా వేసినట్టు ఆయన చెప్పారు.
యజమానుల నిర్లక్ష్యంపై యాక్షన్..
హైదరాబాద్ లోని ఖైరతాబాద్ సర్కిల్ సిఎం క్యాంపు ఆఫీస్ సమీపంలో పుల్లారెడ్డి మిఠాయి షాపులో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. దుకాణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను గుర్తించారు. మొదటి సారి కావడంతో రూ. 20,000 జరిమానా విధించారు. భవిష్యత్తులో మరలా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పట్టుబడితే షాపును క్లోజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. గతంలో పుల్లారెడ్డి స్వీట్స్‌లో కొనుగోలు చేసిన మిఠాయిలు కుళ్లిపోయాయని ఓ వినియోగదారుడు ఫిర్యాదు చేయడంతో రూ.25 వేల జరిమానా విధించారు. తాజాగా ప్లాస్టిక్ వాడటం వల్ల మరోసారి భారీ జరిమానా వేశారు.
వ్యాపారమే గాని పర్యావరణంతో పనిలేదా..
కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోన్న పుల్లారెడ్డి స్వీట్స్ యాజమాన్యం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగించడంపై పర్యావరణ వేత్తలు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే ప్లాస్టిక్ వినియోగించడం వల్ల అనేక అనర్థాలు వాటిల్లాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే తరాలు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు హెచ్చరించడంతో, కేంద్రం నిషేధం విధించింది. అయినా కొందరు వ్యాపారులు మాత్రం వారి వక్రబుద్ధి మార్చుకోకపోవడం శోచనీయం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Plastic Ban, Telangana News