హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad:పది రూపాయలు ఇస్తే చాలు..లాక్‌డౌన్‌ టైమ్‌లో పెట్టిన ప్రతి కేసును కొట్టేస్తారట..

Hyderabad:పది రూపాయలు ఇస్తే చాలు..లాక్‌డౌన్‌ టైమ్‌లో పెట్టిన ప్రతి కేసును కొట్టేస్తారట..

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Police offer:లాక్‌డౌన్‌ టైమ్‌లో డిజాస్టర్‌మెనేజ్‌మెంట్‌ కింద నమోదు చేసిన కేసులను కొట్టివేస్తామని పోలీసులు తెలిపారు. అయితే అందుకు చిన్న కండీషన్ పెట్టారు. గతంలో నమోదు చేసిన పలు సెక్షన్‌ల కింద కేసులకు ఒక్కో సెక్షన్‌కి 10రూపాయలు చెల్లిస్తే చాలని ప్రకటించారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇంకా చదవండి ...

హైదరాబాద్‌(Hyderabad) నగరపౌరులకు మరో సదావకాశం కల్పించారు పోలీసులు. గత నెలలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్‌ (traffic challans Clearance)కోసం భారీ రాయితీ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసుల బాటలోనే నగర పోలీసులు మరో ఆఫర్ ప్రకటించారు. అదేంటంటే..కరోనా (Corona)లాక్‌డౌన్‌ (Lockdown)సమయంలో వైరస్ వ్యాప్తి చెందకుండా కొన్ని నిబంధనలు విధించింది. కాని వాటిని చాలా మంది లెక్క చేయకుండా పోలీస్‌ రూల్స్‌ని బ్రేక్ చేశారు. ఆ టైమ్‌లో సుమారు లక్షల్లో కేసులు నమోదయ్యాయి. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌(Disaster Management) కింద అధికారులు అంటే వేర్వేరు సెక్షన్లపై కేసులు నమోదు చేయగా..అందులో మూడు లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఆ కేసుల్లో ఉన్న బాధితులకు ఊరట కలిగించేందుకు నగర పోలీసులు మళ్లీ డిస్కౌంట్ ఆఫర్‌ ఇస్తునే కేసుల్ని కూడా ఎత్తేస్తామని ప్రకటించారు. 2020-21లాక్‌డౌన్‌ టైమ్‌లో పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. వెయ్యి రూపాయల జరిమానా వరకు విధించారు. అయితే ఇప్పుడు మాత్రం అలా నమోదు చేసిన ఏ సెక్షన్‌ కేసులకైనా సెక్షన్‌కి 10రూపాయల చొప్పున చెల్లిస్తే చాలు కేసులు కొట్టిస్తామనే (Cases Dismissal)బంపర్ ఆఫర్‌ని ప్రకటించారు. అయితే ఇందుకు కేవలం వారం రోజులు మాత్రమే గడువు ఇచ్చారు పోలీసులు. ఈనెల 2వ తేది నుంచి 8వ తేది వరకు అధికారులు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని సిటీ అడిషనల్ కమిషనర్(Additional Commissioner)ఏఆర్‌ శ్రీనివాసులు(Srinivasulu)సూచించారు.

నగరవాసులకు మరో ఆఫర్..

తెలంగాణ ప్రభుత్వం కేసుల పెండింగ్స్‌ని క్లియర్ చేసేందుకే ఈతరహాలో రాయితీలు ఇస్తూ వెసులుబాటు కల్పిస్తోంది. ట్రాఫిక్ చలాన్ల విషయంలో కూడా ప్రభుత్వం మంచి ఫలితాలను చవిచూసింది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో నమోదైన కేసుల్లో పెండింగ్‌లో ఉన్న మూడు లక్షల మంది అధికారులు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటున్నారు. లేని పక్షంలో ఎవరైతే బాధ్యులుగా ఉంటారో వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఉల్లంగిస్తే కేసులు తప్పవు..

అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో కూడా ఐదు శాతం తగ్గించిన ఆఫర్‌కి కూడా నగరవాసుల నుంచి మంచి రెప్సాన్స్ వచ్చింది. ఒక్క ఏప్రిల్‌ నెలలో 742 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. ఎర్లీ బర్డ్ పేరుతో ఇచ్చిన ఆఫర్‌ కోసం చవిర ఒక్కరోజే 100కోట్ల రూపాయలు వసూలయ్యాయి. ప్రభుత్వం ఖజానాకు రావాల్సిన డబ్బులను ప్రజల నుంచి ఎంత త్వరగా వసూలు చేస్తే అంత మంచిదనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తోంది.

First published:

Tags: Corona lockdown, Hyderabad police

ఉత్తమ కథలు