హోమ్ /వార్తలు /తెలంగాణ /

Wineshops Closed: మందు బాబులకు బ్యాడ్​న్యూస్​.. రేపు వైన్​ షాపులు బంద్​.. కారణం ఇదే..

Wineshops Closed: మందు బాబులకు బ్యాడ్​న్యూస్​.. రేపు వైన్​ షాపులు బంద్​.. కారణం ఇదే..

 (ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

శనివారం అనగా ఏప్రిల్ 16న హైదరాబాద్ నగర పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్స్, బార్ లను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎందుకంటే..

  మందుబాబులకు బ్యాడ్​న్యూస్​ . తెలంగాణ రాజధానికి హైదరాబాద్ (Hyderabad) లో మద్యం దుకాణాలు (Wine shops) మూతపడనున్నాయి. అయితే అది ఒక్కరోజు మాత్రమే. శనివారం అనగా ఏప్రిల్ 16న హనుమాన్ జయంతి (Hanuman jayanti) కారణంగా హైదరాబాద్ నగర పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు (Wine shops), కల్లు కాంపౌండ్స్, బార్ లను మూసివేస్తున్నట్లు (Wineshops closed) అధికారులు తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం అనగా ఏప్రిల్ 16న ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 17 ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఇదే విషయాన్ని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషన్‌ సీవీ ఆనంద్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. అయితే ఈ నిబంధనలు స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్స్ లోని బార్లకు వర్తించవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. వీటిని బేఖాతరు చేసిన వారిని చట్టపరంగా శిక్షిస్తామని కమిషనర్ హెచ్చరించారు.

  నగరంలో ట్రాఫిక్​ ఆంక్షలు..

  కాగా, శనివారం హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని ఆరోజు జరగనున్న ఊరేగింపు నేప‌థ్యంలో హైదరాబాద్​లో ట్రాఫిక్ ఆంక్ష‌లు ఉంటాయ‌ని సీపీ ఆనంద్ తెలిపారు. ట్రాఫిక్ ఆంక్ష‌ల‌కు సంబంధించి ఒక‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. హ‌నుమాన్ జ‌యంతి ఊరేగింపు 12 కిలోమీటర్ల మేర కొన‌సాగ‌నుంది. ఆదివారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యే ప్రధాన శోభాయాత్ర గౌలిగూడ రామమందిరం నుంచి ప్రారంభమై సికింద్రాబాద్ హనుమాన్ మందిర్ తాడ్‌బన్ వరకు సాగుతుంది.

  RTC 'X' రోడ్​, అశోక్ నగర్, గాంధీ నగర్..

  ఈ ఊరేగింపు కొన‌సాగే మార్గాలు వ‌రుస‌గా ఇలా ఉన్నాయి. గౌలిగూడ రామమందిరం, పుత్లిబౌలి ఎక్స్ రోడ్లు, ఆంధ్రా బ్యాంక్ ఎక్స్ రోడ్లు, కోటి, తిలక్ రోడ్, సుల్తాన్ బజార్ ఎక్స్ రోడ్లు, రామ్ కోటి ఎక్స్ రోడ్లు, కాచిగూడ ఎక్స్ రోడ్లు, వీర్ సావర్కర్ విగ్రహం, నారాయణగూడ వైఎంసీఏ, చిక్కడపల్లి ఎక్స్ రోడ్లు , RTC 'X' రోడ్​, అశోక్ నగర్, గాంధీ నగర్, వెనుక వైపు వైస్రాయ్ హోటల్, ప్రాగా టూల్స్, కవాడిగూడ, బన్సీలాల్ పేట్ గ్రేవ్ యార్డ్స్, బైబిల్ హౌస్, సిటీ లైట్ హోటల్, బాటా షో రూమ్, ఉజ్జయిని మహంకాళి టెంపుల్, రాంగోపాల్ పేట్ PS, ప్యారడైజ్ X రోడ్స్, CTO జంక్షన్, రాయల్ లీ ప్యాలెస్, బ్రూక్‌బాండ్, ఇంపీరియల్ గార్డెన్, మస్తాన్ కాస్ఫే, హనుమాన్ మందిర్ తాడ్‌బ‌న్‌.

  కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం (రాచకొండ కమిషనరేట్ పరిధి) నుంmr ప్రారంభమయ్యే మరో ఊరేగింపు డిఎంఅండ్ హెచ్‌ఎస్, ఉమెన్స్ జంక్షన్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తుంది. ఇది చంపేట్ వద్ద హైదరాబాద్ పరిమితుల్లోకి ప్రవేశిస్తుంది. ప్రధాన ఊరేగింపులో క‌ల‌వ‌డానికి ముందు ఈ క్రింది మార్గంలో కొన‌సాగుతుంది... చంపాపేట్ X Rd - IS సదన్ - ధోభిఘాట్ - సైదాబాద్ కాలనీ రోడ్ - శంకేశ్వర్ బజార్ - సరూర్ నగర్ ట్యాంక్ - రాజీవ్ గాంధీ విగ్రహం , దిల్ సుఖ్ నగర్ - మూసారం బాగ్ జంక్షన్ - మలక్ పేట - నల్గొండ X రోడ్ - అజంపురా రోటరీ - చాదర్ ఘాట్ X రోడ్.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Alcohol, Hyderabad, Wine shops

  ఉత్తమ కథలు