హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: రాత్రి కల వస్తే చాలు పగలు పనైపోవాల్సిందే..వెరైటీ దొంగ అరెస్ట్

Hyderabad: రాత్రి కల వస్తే చాలు పగలు పనైపోవాల్సిందే..వెరైటీ దొంగ అరెస్ట్

Hyderabad: దొంగతనాల్లో ఆరితేరిపోయాడు. పదేళ్లుగా పోలీసులకు చిక్కకుండా కోట్ల రూపాయల సొమ్మును దోచుకొని దాచుకున్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన ప్రసాద్ అనే ఓ గజదొంగ రాత్రి పూట కలలో వచ్చిన ప్రాంతంలో చోరీలు చేస్తూ అమావాస్య చంద్రుడిలా మాయమైపోతుంటే లాలాగూడ పోలీసులు పట్టుకున్నారు.

ఇంకా చదవండి ...

దొంగతనం చేసేవాడు ముందు రెక్కీ నిర్వహిస్తాడు. లేదంటే తన బ్యాచ్‌ని తీసుకొని పని పూర్తైన తర్వాత ఎవరికి దొరకుండా ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు. కాని హైదరాబాద్‌(Hyderabad) వనస్థలిపురం(Vanasthalipuram)పరిధిలో వరుస చోరీలు చేస్తున్న ఓ దొంగను పోలీసులు పట్టుకున్నారు. అతని క్రైమ్ ప్రొఫైల్(Crime profile), చోరీ చేసే విధానం తెలిసి పోలీసులకే కళ్లు బైర్లుగమ్మాయి. గుంటూరు(Guntur)జిల్లా పిడుగురాళ్ల గాంధీనగర్‌(Gandhinagar)కి చెందిన ముచ్చు అంబేద్కర్ (Muchu Ambedkar) అలియాస్ కందుల రాజేంద్రప్రసాద్‌ పేరుతో చెలామణి అవుతున్నాడు. ఎలక్ట్రీషియన్‌(Electrician‌)గా పని చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ...భారీ చోరీలు చేస్తూ పోలీసుల కళ్లలో కారం జల్లి తప్పించుకొని తిరుగుతున్నాడు. గత 10సంవత్సరాలుగా అంబేద్కర్ ఈ విధంగా చిక్కడు, దొరకడు అన్నట్లుగా తెలివిగా ఎస్కేప్ అవుతున్నాడు. అసలు విషయానికి వస్తే అంబేద్కర్ అలియాస్ ప్రసాద్‌ దొంగతనాలు చేసే తీరే చాలా ఆశ్చర్యంగా ఉంటుందని పోలీసులు వెల్లడించారు. రాత్రి వేళల్లో కలలు కనడం..తెల్లవారు జామున రాత్రి వచ్చిన కలను నిజం చేసుకోవడం ఈ గజదొంగ మేనరిజం. అలా దోచుకున్న మొత్తం సొమ్ము కోటి 30లక్షల(1Crore 30lakhs)విలువైన 2కిలోల బంగారం(Two kg Gold),పది కిలోల వెండి(10 kg Silver)సామాన్లతో పాటు 18వేల నగదును పోలీసులు రికవరీ చేసుకున్నారు. ఈ దొంగిలించిన సొత్తును కూడా చెక్కు చెదరకుండా..భద్రంగా దాచుకున్నట్లు పోలీసులు తెలిపారు.

వెరైటీ దొంగ..

ప్రసాద్‌ అలియాస్ అంబేద్కర్ 1991లో చోరవృత్తిని ప్రారంభించాడు. హైదరాబాద్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 10సంవత్సరాల్లో ఆంధ్రా, తెలంగాణతో పాటు కర్నాటకలో కూడా దొంగతనాలు చేస్తూ వచ్చాడు. హైదరాబాద్‌ శివార్లను మెయిన్‌గా టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడే ప్రసాద్‌పై లాలాగూడ పోలీసులు నజర్ పెట్టి ప్రసాద్‌ క్రైమ్‌ స్టోరీలకు పుల్‌స్టాప్ పెట్టారు. పోలీసుల విచారణలో నిందితుడి దగ్గర భారీ సొమ్ము, సొత్తును గుర్తించారు. ప్రసాద్‌పై ఇప్పటి వరకు వేర్వేరు పోలీస్ స్టేషన్‌లలో 43 కేసులు నమోదవగా..కేవలం హైదరాబాద్‌ లిమిట్స్‌లోనే 21కేసులు బుక్ చేశారు.

పదేళ్లలో 43కేసులు..కోటిన్న సొత్తు చోరీ..

పదేళ్ల నుంచి ఇంత తెలివిగా..చోరీలు చేస్తూ వచ్చిన ప్రసాద్‌కి గంటూరులో కూడా ఓ త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది. దొంగిలించిన సొమ్ము, బంగారం, వెండి సామాన్లను అక్కడే భద్రపరిచినట్లుగా రాచకొండ పోలీసులు తెలిపారు. పక్కా ఆధారాలతో ఈ టక్కరి దొంగపై ఫోకస్ పెట్టిన పోలీసులు వనస్థలిపురంలో అరెస్ట్ చేశారు. దొంగతనం చేసే ముందు రోజే తనకు ఎక్కడ చోరీ చేయాలని కల వస్తుంది..దాని ప్రకారమే చోరీలు చేస్తూ వచ్చానంటూ ప్రసాద్ చెప్పుకొచ్చాడు. వరుస చోరీలు చేస్తున్న ఓ నిందితుడు చెప్పిన మాటలు విన్న పోలీసులు ఇది నిజంగా జరిగే పనేనా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. పట్టుబడ్డ నిందితుడు మాత్రం ఇదే వాస్తవమని పోలీసుల ముందు అంగీకరించాడు.

First published:

Tags: Crime news, Greater hyderabad

ఉత్తమ కథలు