హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad police: హైదరాబాద్​ పోలీసుల సంచలన నిర్ణయం.. ఇకపై డ్రంకెన్​ డ్రైవ్​ మాదిరిగానే ఆ టెస్టులు కూడా..

Hyderabad police: హైదరాబాద్​ పోలీసుల సంచలన నిర్ణయం.. ఇకపై డ్రంకెన్​ డ్రైవ్​ మాదిరిగానే ఆ టెస్టులు కూడా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్​ పోలీసులు. ప్రజల భద్రత, క్షేమం కోసం సంచలన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనుకాడరు. అలాంటి నిర్ణయమే ఇపుడూ తీసుకున్నారు.

హైదరాబాద్​ (Hyderabad) మహానగరం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. దానితో పాటు పాశ్చాత్య సంస్కృతి కూడా పాతుకుపోతోంది. ఇప్పటికే పబ్​లు, డ్రగ్స్​ హైదరాబాద్​ను కుదిపేస్తున్నాయి. దీంతో సీఎం కేసీఆర్​ డ్రగ్స్​ (Drugs)విషయంపై ఇప్పటికే సీరియస్​ (Serious) అయిన సంగతి తెలిసిందే. తెలంగాణలో మాదక ద్రవ్యాల వాడకాన్ని కఠినంగా నియంత్రించేందుకు (To strictly control drug use in Telangana) చేపట్టాల్సిన కార్యాచరణ విధి విధానాలపై అధికారులతో కొన్ని రోజుల కిందటే చర్చించారు. ఈ మేరకు పోలీసు శాఖ , ఎక్సైజ్ శాఖ అధికార యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేశారు.

నగరంలో డ్రగ్స్ కల్చర్ (drug culture) నానాటికీ తీవ్రమవుతుండటంతో పోలీసులు (Hyderabad police) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై డ్రంకెన్ డ్రైవ్ (drunken drive) మాదిరిగానే డ్రగ్ టెస్టులు (drug tests) నిర్వహించాలని నిర్ణయించారు. నోటిలోని లాలాజలంతో టెస్ట్ నిర్వహించి.. 2 నిమిషాల్లో ఫలితాలు సైతం ఇవ్వనున్నారు పోలీసులు. ఇందులో పాజిటివ్ వస్తే మూత్రం, రక్త పరీక్షలతో నిర్థారణ చేసుకోనున్నారు. ఒకవేళ దానిలోనూ పాజిటివ్​ వస్తే కఠిన చర్యలు తీసుకునేలా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ విధానాన్ని ఇప్పటికే వినియోగిస్తున్నారు పోలీసులు. డ్రగ్ టెస్ట్‌ల నిర్వహణకు హైదరాబాద్ పోలీసులు కసరత్తు చేస్తున్నారు.

ఫుడ్​ అండ్​ మింక్​ పబ్​తో..

కొద్దిరోజుల కిందటే రాడిసన్ బ్లూ హోటల్‌ (Radisson Blu Hotel)లోని ఫుడ్ మింక్ (Food and mink) పబ్లో డ్రగ్స్​ వాడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసు (Hyderabad Drugs case)లో కీలక విషయాలు తెరపైకి వచ్చాయి.  పబ్‌లో పట్టుబడ్డ వారిలో కిందరు డ్రగ్స్ (Drugs) తీసుకున్నట్లుగా ఆధారాలు దొరికాయని పోలీసులు తెలిపారు. పబ్‌లో 20మందికి డ్రగ్స్ సరఫరా అయినట్లు పోలీసులకు ఆధారాలు లభ్యమమయ్యాయి. డ్రగ్స్ తీసుకున్న 20 మందికి నోటీసులు ఇచ్చే పనిలో పోలీసులు ఉన్నారు. మింక్ పబ్ ఆదాయం (Pub Income) చూసి పోలీసులు అవాక్కయ్యారు. ప్రతి నెలా మూడున్నర కోట్లు ఆదాయం వస్తున్నట్లు గుర్తించారు. ప్రతి వీకెండ్‌లో 30 నుంచి 40 లక్షల ఆదాయం వస్తున్నాయట. సాధారణ రోజుల్లో రోజుకు పది లక్షల వరకు బిజినెస్ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారట.

ఇటీవలె ఓ యువకుడు..

హైదరాబాద్‌లో (Hyderabad) డ్రగ్స్‌కు (drugs) ఇటీవలె ఓ యువకుడు బలయ్యాడు. ఇటీవలె నగరానికి చెందిన బీటెక్ విద్యార్ధి (B.tech student) ఒకరు గోవాకు వెళ్లి డ్రగ్స్‌ తీసుకున్నాడు. ఈ క్రమంలో వారం రోజులకే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. విషయం తెలిసి ఆసుపత్రిలో చేర్చించగా సదరు విద్యార్ధి ఎనిమిది రోజులు చికిత్స పొంది ప్రాణాలు కోల్పోయాడు. దీంతో హైదరాబాద్‌లో డ్రగ్స్ (Drugs in Hyderabad) కారణంగా మరణించిన తొలి కేసుగా నిలిచింది. అయితే అందుతున్న సమాచారం మేరకు బీటెక్​ విద్యార్థితో పాటు గోవాకు మరో ఎనిమిది మంది వెళ్లినట్లు తెలిసింది. ఇందులో నలుగురు విద్యార్థులు, ఐదుగురు డీజేలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తొమ్మిది మంది కూడా డ్రగ్స్​ తీసుకోవడంతో వీళ్లందరినీ ఆసుపత్రిలో చేర్చించారు అధికారులు

First published:

Tags: Drugs, Drugs case, Drunken drive test, Hyderabad police

ఉత్తమ కథలు