హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: వాహనదారులకు అలెర్ట్​.. హైదరాబాద్​ పోలీసుల కీలక ప్రకటన..

Hyderabad: వాహనదారులకు అలెర్ట్​.. హైదరాబాద్​ పోలీసుల కీలక ప్రకటన..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నేడు, రేపు హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు పలు సూచనలు చేశారు.

  తెలంగాణ (Telangana)ను మరోసారి భారీ వర్ష సూచన భయపెడుతోంది. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గత మూడ్రోజులుగా అక్కడక్కడ చిరు జల్లులు మాత్రమే కురిశాయి. వరుణుడు కాస్త గ్యాప్ ఇచ్చాడని ఊపిరిపీల్చుకునేలోపే వెదర్ అప్‌డేట్ ప్రజల్లో కొత్త టెన్షన్‌ పుట్టిస్తోంది. వర్షాలు, వరదలతో బురదలోంచి జనం బయటపడక ముందే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గురువారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తునే ఉన్నాయి. కాస్త గ్యాప్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ భారీ వర్షాల రూపంలో విరుచుకుపడటంతో సాగు పనులు మొదలుపెట్టిన రైతులు ఆందోళన చెందుతున్నారు.

  కాగా, నేడు, రేపు హైదరాబాద్ (Hyderabad) నగరానికి భారీ వర్ష  (Heavy rains)సూచన ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు  (Traffic Police) వాహనదారులకు పలు సూచనలు చేశారు. వర్షం నిలిచిన వెంటనే రోడ్ల మీదికి రావొద్దని సూచించారు. కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం నిలిచిన వెంటనే హడావుడిగా రోడ్ల మీదికి రాకుండా గంట తరువాత రావాలని సూచించారు. భారీ వర్షాలతో నగరంలోని రోడ్ మీదికి చేరిన నీరు బైటికి వెళ్లేందుకు గంటకు పైగా సమయం పడుతుందన్నారు. ఈ సూచనలు పాటించకపోతే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాధికారులు సూచిస్తున్నారు.

  తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లుగా వాతవరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్ , ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో పాటు నిజామాబాద్. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో రాగల 48గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

  మరో మూడ్రోజుల పాటు పలుచోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు, వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో చూసుకుంటే ఎక్కువగా కామారెడ్డి జిల్లాలోని లింగంపేట్‌లో అత్యధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో 60 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అయితే ప్రస్తుతానికి ఎటువంటి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న హెచ్చరికలు ఇవ్వలేదు. బుధ, గురువారాల్లో మాత్రం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో ఎడాతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే వర్షాలు, వరదలతో నష్టపోయిన వాళ్లకు తక్షణ సాయం కింద కేంద్రం వెయ్యి కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వంలోని విద్యుత్, రోడ్లు, భవనాలు, పంచాయితీరాజ్‌శాఖ, మున్సిపల్‌ డిపార్ట్‌మెంట్‌లో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు తిరిగి మరమ్మతులు చేపట్టడానికి నిధులు ప్రకటించాలని లేఖలో రాసింది..

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Heavy Rains, Hyderabad Traffic Police

  ఉత్తమ కథలు