Home /News /telangana /

HYDERABAD HYDERABAD POLICE HAS ARRESTED TONY FRIEND AFTAB WHO HELPS TO SUPPLY DRUGS IN OVERALL INDIA AND POLICE TOOK HIM FROM MUMBAI PRV

Hyderabad Drugs case: హైదరాబాద్​ డ్రగ్స్​ కేసులో కీలక ముందడుగు.. టోనీ ప్రధాన అనుచరుడి అరెస్టు.. దర్యాప్తు కోసం ముంబై నుంచి హైదరాబాద్ తీసుకొచ్చిన పోలీసులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్​ సహా ఇతర నగరాలకు డ్రగ్స్ (Drugs) సరఫరా చేస్తున్న నైజీరియన్ టోని (Tony) సహా ఏడుగురు వ్యాపారవేత్తలను హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) ఈ నెల 20వ తేదీన అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా టోనీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకొంది.

ఇంకా చదవండి ...
    హైదరాబాద్​ సహా ఇతర నగరాలకు డ్రగ్స్ (Drugs) సరఫరా చేస్తున్న నైజీరియన్ టోని (Tony) సహా ఏడుగురు వ్యాపారవేత్తలను హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) ఈ నెల 20వ తేదీన అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు (Hyderabad Drugs case)లో నిందితుల నుంచి కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. డ్రగ్స్ కేసులో విచారణ సమయంలో హవాలా, మనీలాండరింగ్ జరిగిందని పోలీసులు గుర్తించారు. మనీలాండరింగ్, హవాలాను నిగ్గు తేల్చాలని ఈడీకి హైదరాబాద్ పోలీసులు ఈ నెల 24న లేఖ రాశారు. తాజాగా టోనీ కేసు (Hyderabad Drugs case)లో కీలక పరిణామం చోటు చేసుకొంది. టోనీ ప్రధాన అనుచరుడు అఫ్తాబ్‌ను (aftab) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఫ్తాబ్‌ను ముంబైలో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు పోలీసులు. అయితే హైదరాబాద్‌లో టోనీ డ్రగ్స్ లావాదేవీలను అఫ్తాబ్ పర్యవేక్షించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

    హైదరాబాద్ కస్టమర్ల నుంచి డబ్బులు తీసుకుని వారికి డ్రగ్స్ అందించాడు అఫ్తాబ్. అతని ఖాతాలో రోజుల వ్యవధిలోనే రూ.కోట్లలో లావాదేవీలు గుర్తించారు పోలీసులు. ఈ క్రమంలో అఫ్తాబ్ ఖాతాల్లో డబ్బులు పంపినవారి వివరాలను సేకరిస్తున్నారు . అఫ్తాబ్ ఫోన్ సీజ్ చేసి.. ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు పరిశీలిస్తున్నారు పోలీసులు. ఈ డ్రగ్స్ కేసు (Hyderabad Drugs case)లో మరికొన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. స్టార్ బాయ్ ఎక్కడివాడు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్‌లో స్టార్ బాయ్ మకాం వేసినట్లు గుర్తించారు. ముంబై, హైదరాబాద్‌లో వ్యాపారవేత్తలకూ డ్రగ్స్ విక్రయించినట్లుగా తెలుస్తోంది.

    చిన్నతనం నుంచే​ డ్రగ్స్​ విక్రయం..

    స్టార్‌బాయ్ (Star Boy) నుంచే వ్యాపారవేత్తల కాంటాక్ట్‌లను టోనీ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అండర్ గ్రౌండ్‌లో వుండి దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు స్టార్ బాయ్.  చిన్నతనం నుంచే అతను డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. రెండుసార్లు స్టార్ బాయ్‌ని నేరుగా కలిశాడు టోనీ. స్టార్‌బాయ్ నెట్‌వర్క్‌ను టోనీ వాడుకున్నట్లుగా తెలుస్తోంది.

    వ్యాపారవేత్తలకు డ్రగ్స్‌ను కొరియర్ ద్వారా పంపిణీ చేయగా.. టోనీకి మాత్రం వారు నేరుగా డబ్బులు పంపలేదు. కొరియర్స్‌కే డబ్బులు ఇచ్చారు వ్యాపారవేత్తలు. చిన్న షాపుల్లో ఆన్‌లైన్ పేమెంట్స్ ద్వారా టోనీకి డబ్బులు పంపారు కొరియర్స్. ప్రతి నెలకు 20 గ్రాముల చొప్పున కొకైన్ తెప్పించుకున్నారు వ్యాపారవేత్తలు. ఈ నేపథ్యంలో వ్యాపారవేత్తలు డ్రగ్స్ వినియోగంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతకుముందు జనవరి 30న డ్రగ్స్ కేసులో (drugs case) రెండో రోజు టోనీ విచారణ ముగిసింది. విచారణకు టోనీ సహకరించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విచారణ సందర్భంగా పోలీసులు పలు కోణాల్లో ప్రశ్నించారు.

    ప్రధానంగా నగదు లావాదేవీలపై పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. టోనీ బ్యాంక్ అకౌంట్ల ద్వారా లావాదేవీలు ఏ విధంగా జరిపాడనే విషయంపై విచారణ జరిపినట్లు తెలుస్తోంది. అయితే డ్రగ్స్ కొనుగోలు చేసిన వ్యాపారవేత్తలు ఏ2 ఇమ్రాన్ అకౌంట్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ చేసినట్లు గుర్తించారు. ఇమ్రాన్ అకౌంట్ నుంచి డ్రగ్స్ డబ్బు టోనీకి చేరుతున్నట్లు నిర్థారించారు. ఓ నైజీరియన్ వేరే దేశానికి వెళుతూ తన బిజినెస్‌ను టోనీ అప్పగించినట్లు విచారణలో తేలింది. అయితే ఆ నైజీరియన్ (nigerian) ఎవరనే దానిపై టోనిని ప్రశ్నించారు పోలీసులు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Drugs case

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు