Home /News /telangana /

HYDERABAD HYDERABAD POLICE HAS ARRESTED A MAN WHO MADE AN INTERNET CALL TO A BUSINESSMAN AND THREATENED TO KIDNAP HIM IF HE DID NOT PAY RS ONE CRORE PRV

Kidnap drama: ఇంటర్​నెట్​ కాల్​తో కోట్లు కొట్టేదామనుకున్నాడు.. ఓ బడా వ్యాపారికి ఫోన్​ చేసి బెదిరించాడు.. వ్యాపారి బయపడి ఏం చేశాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇంటర్​నెట్​ కాల్​ (Internet call)తో ఏకంగా కోట్లు కొట్టేద్దామనుకున్నాడు. ఓ బడా వ్యాపారికి కాల్ చేశాడు. కిడ్నాప్ (Kidnap drama)​ చేస్తాను అన్నాడు. అలా చేయకూడదంటే కోటి సమర్పించుకోవాలని బెదిరించాడు. వినకపోయే సరికి చంపేస్తానన్నాడు

    ఇంటర్​నెట్​ కాల్​ (Internet call)తో ఏకంగా కోట్లు కొట్టేద్దామనుకున్నాడు. ఓ బడా వ్యాపారికి కాల్ చేశాడు. కిడ్నాప్ (Kidnap drama)​ చేస్తాను అన్నాడు. అలా చేయకూడదంటే కోటి సమర్పించుకోవాలని బెదిరించాడు. వినకపోయే సరికి చంపేస్తానన్నాడు. అయితే ఈ కేసును చేధించడానికి పోలీసులకూ సవాల్​గానే మారింది. ఎందుకంటే నిందితుడు వినియోగించేది ఇంటర్​నెట్​ యాప్​ కాల్​. అయితే ఇలాంటి కేసులు ఎన్నో చూసిన పోలీసలు తమ ఎక్స్​పీరియన్స్​ వినియోగించి కేసును చేధించారు. నిందితుడిని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బోయిన్‌పల్లికి చెందిన బల్క్‌ డ్రగ్‌ వ్యాపారి మనోజ్‌ సలేచా జైన్‌ను టార్గెట్‌ చేసి, అతడి కుమార్తె కిడ్నాప్‌ కుదరక వాయిస్‌ ఓవర్‌ ఇంటర్‌నెట్‌ ప్రొటోకాల్‌ (VOIP) కాల్స్‌తో బెదిరింపులకు దిగిన జవారీలాల్‌ తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. దీనికి సంబంధించిన కాల్‌ రికార్డింగ్స్‌ను బోయిన్‌పల్లి పోలీసులు సేకరించారు. ఇతడిని పట్టుకోవడానికి నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సాంకేతికంగా దర్యాప్తు చేశారు.

    ఈ నెల 10న జవారీ ఇద్దరు అనుచరులతో కలిసి మనోజ్‌ కుమార్తెను ఈ నెల 10న కిడ్నాప్‌ చేసేందుకు యత్నించాడు. అది విఫలం కావడంతో బెదిరింపులకు దిగి డబ్బు గుంజాలని పథకం వేశాడు. దీనికోసం తన స్పాట్‌ ఫోన్‌లో ఓ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు.

    డబ్బు ఇవ్వకుంటే..

    ఆ యాప్‌ (APP) వినియోగిస్తూ మనోజ్‌కు వీఓఐపీ కాల్స్‌ చేశాడు. 10, 11 తేదీల్లో 12 కాల్స్‌ చేసిన ఇతగాడు తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగాడు. తన అనుచరుల ద్వారా మనోజ్‌ ఇంటిపై నిఘా వేసి ఉంచడంతో పోలీసుల కదలికల్నీ గుర్తించాడు. దీంతో ‘ఓ కాల్‌లో పోలీసులకు చెప్పొద్దంటే చెప్పావు కదా... ఇక నాకు డబ్బు వద్దు నీ ప్రాణమే కావాలి’ అంటూ హెచ్చరించాడు. ఆపై మళ్లీ రూ.కోటి ఇవ్వకపోతే మనోజ్‌తో పాటు అతడి భార్యనూ అంతం చేస్తానన్నాడు. డబ్బు ఇవ్వకుంటే మూడునాలుగు నెలలకైనా కాల్చి చంపేస్తానన్నాడు. తన వద్ద రూ.కోటి లేదని, అంత ఇచ్చుకోలేనని మనోజ్‌ అతగాడిని బతిమలాడాడు. తొలుత తగ్గింపు కుదరదని చెప్పిన జవారీలాల్‌ చివరకు రూ.5 లక్షలు తగ్గించి రూ.95 లక్షలు కచ్చితంగా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశాడు.

    20 టాప్‌ యాప్స్‌ను ఎంచుకున్నారు..

    ఇక నిందితులను పట్టుకోవడానికి నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ రంగంలోకి దిగింది. యాప్‌ ద్వారా వీఓఐపీ కాల్స్‌ చేస్తే వాటిని అందుకునే వారికి రకరకాల నంబర్లు కనిపిస్తుంటాయి. దీంతో టాస్క్‌ఫోర్స్‌ సాంకేతికంగా ముందుకు వెళ్లింది. ఎదుటి వ్యక్తి ఏ యాప్‌ ద్వారా ఈ కాల్స్‌ చేస్తున్నా డో కూడా తెలియదు. దీంతో పోలీసులు వీఓఐపీ సేవలు అందిస్తున్న 20 టాప్‌ యాప్స్‌ను ఎంచుకున్నారు. వాటి నిర్వాహకులకు ఈ–మెయిల్‌ పంపిస్తూ అందులో మనోజ్‌ నెంబర్‌ పొందుపరిచారు. దీనిపై స్పందించిన ఓ యాప్‌ నిర్వాహకుడు చేసిన వ్యక్తి నెంబర్‌ చెప్పలేమంటూ అయితే అతడు రిజిస్టర్‌ చేసుకోవడానికి వాడిని ఈ–మెయిల్‌ ఐడీ అందించారు.

    సదరు కాల్స్‌ చేయడానికి ఆ వ్యక్తి యాప్‌లోకి లాగిన్‌ అయిన ఐపీ అడ్రస్‌లు అందించారు. ఈ అడ్రస్‌లను సర్వీస్‌ ప్రొవైడర్లకు పంపిన పోలీసులు ఏ సెల్‌ఫోన్‌ నెంబర్‌తో ఈ ఐపీ అడ్రస్‌లు యాక్టివ్‌ అయ్యాయో చెప్పమని కోరారు. ఫలితంగా జవారీలాల్‌ నంబర్‌ తెలియడంతో పాటు అతడు జీడిమెట్లలో ఉన్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ నేపథ్యంలో మిగిలిన ఇద్దరినీ గుర్తించి పట్టుకున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Crime news, CYBER FRAUD, Hyderabad, Kidnap, Viral in internet

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు