హోమ్ /వార్తలు /తెలంగాణ /

TV యాంకర్‌ టార్గెట్.. కోరిక తీర్చాలంటూ యువకుడి బెదిరింపులు

TV యాంకర్‌ టార్గెట్.. కోరిక తీర్చాలంటూ యువకుడి బెదిరింపులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జనరల్‌గా టీవీ యాంకర్ల జోలికి ఎవరూ వెళ్లరు. కానీ ఓ యువకుడు మాత్రం టీవీ యాంకర్‌ని టార్గె్ట్ చేసి బెదిరింపులకు దిగాడు. కోరిక తీర్చాలని వెంటపడ్డాడు. చివరికి ఏమైందో తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అడ్డదారిలో వెళ్తే జైలుపాలు కావడం ఖాయమనే విషయాన్ని ఇప్పటికే ఎన్నో కేసులు నిరూపించాయి. అయినా సరే కొందరి తీరు మారదు. అవే తప్పులు చేసి.. చిప్పకూడు తింటారు. అలా ఓ కుర్రాడు పోలీసులకు చిక్కాడు. కోరిక తీర్చాలంటూ టీవీ యాంకర్ వెంటపడి.. బెదిరింపులకు పాల్పడిన అతను.. చివరకు ఎలా చిక్కాడన్నది ఆసక్తికరం. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్.. మధురానగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటోంది 27 ఏళ్ల టీవీ ఛానెల్ యాంకర్. ఆమెకు కాలేజీ రోజుల్లో పరిచయమైన 30 ఏళ్ల సామ్రాట్.. ఇప్పుడు కూకట్‌పల్లిలో ఉంటున్నాడు.

ఎలా తెలుసుకున్నాడో గానీ.. యాంకర్ అడ్రెస్ తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను కలిసి కాలేజీలో సహ విద్యార్థినిని అని చెప్పాడు. అలా పరిచయం చేసుకొని.. ఆ తర్వాత తరచూ ఆమెను ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో ఆమెకు తెలియకుండా అప్పుడప్పుడూ మొబైల్‌తో ఫొటోలు తీశాడు.

ఆ తర్వాత ఆమెతో స్నేహం మొదలుపెట్టాడు. మంచివాడిలా నటించాడు. ఆమె అతన్ని బాగానే నమ్మింది. ఓ రోజు ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. తనకు అలాంటి ఫీలింగ్స్ లేవని చెప్పింది. దాంతో అతను సైకోలా మారాడు. పైకి మంచివాడిలా నటించాడు. ఓ రోజు.. టూరిజం ప్లేస్‌కి వెళ్దామంటూ ఆమెను కారులో తీసుకెళ్లాడు. మధ్యలో దారి మార్చి.. ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి.. రేప్ చెయ్యాలని యత్నించాడు. ఆమె ఎలాగొలా తప్పించుకుంది.

తన ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో.. ప్లాన్ బీ అమలుకు యత్నించాడు. ఆమెను రహస్యంగా తీసిన ఫొటోలను మార్ఫింగ్ చేసి.. నగ్న ఫొటోలలా మార్చి.. ఆమెకే పంపాడు. తన కోరిక తీర్చకపోతే.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు. ఇలాంటి వాళ్లకు తగినబుద్ధి చెప్పాలనుకున్న బాధితురాలు.. బుధవారం ఎస్సార్‌నగర్ పోలీసుల్ని కలిసి మ్యాటర్ చెప్పింది.

యాంకర్‌కి ధైర్యం చెప్పిన పోలీసులు.. ఓ చెరువు పక్కన కారును పార్క్ చేసి.. దూరంగా వెళ్తున్న జంటలను చూస్తున్న సామ్రాట్‌ని అరెస్ట్ చేశారు. ఇలా యాంకర్‌ను టార్గెట్ చేసిన నిందితుడు.. కటకటాలపాలయ్యాడు. అడ్డదారిలో వెళ్తే.. చిప్పకూడు తప్పదని ఈ కేసు మరోసారి నిరూపించింది.

First published:

Tags: Crime news, Crime story, Hyderabad, Telangana News

ఉత్తమ కథలు