హైదరాబాద్‌లోని డీ మార్ట్ సూపర్ మార్కెట్(D-Mart), ప్యారడైజ్ రెస్టారెంట్‌కు(Paradise Restaurant) ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్ నగరం హైదర్‌గూడలోని డీమార్ట్ బ్రాంచ్‌కు, సికింద్రాబాద్, బేగంపేటలలోని ప్యారడైజ్ బ్రాంచ్‌లకు వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రూ. 50 వేల చొప్పున జరిమానా విధించినట్టుగా తెలుస్తోంది. 2019లో అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు విజయ్ గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినియోగదారుల ఫోరమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఈ విషయాన్ని విజయ్ గోపాల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
వివరాలు.. విజయ్ గోపాల్ 2019 ఏప్రిలో సికింద్రాబాద్(Secunderabad) ప్యారడైజ్ రెస్టారెండ్ నుంచి ఆహారం కొనుగోలు చేశారు. రెండు నెలల తర్వాత బేగంపేటలోని ప్యారడైజ్ రెస్టారెంట్ నుంచి ఆహారాన్ని(Food) కొనుగోలు చేశారు. ఇక, 2019 జూన్‌లో హైదర్‌గూడలోని డీ మార్ట్ నుంచి వస్తువులు కొనుగోలు చేశారు. అయితే తాను ఆహారం, వస్తువులు కొనుగోలు చేసిన సమయంలో క్యారీ బ్యాగ్ కోసం డబ్బులు వసూలు చేసినట్టుగా విజయ్ గోపాల్ తెలిపారు. ప్యారడైజ్ రెస్టారెంట్ క్యారీ బ్యాగ్ కోసం రూ. 4.76 చార్జ్ చేయగా, డీ మార్ట్ రూ. 3.5 వసూలు చేసింది. ఇందుకు సంబంధించి విజయ్ గోపాల్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(Consumer Disputes Redressal Commission)ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తాజాగా కమిషన్ తీర్పు ఇచ్చింది.
I hope with this order, @Director_EVDM shall double down on the implementation and save the citizens from being harassed and penalize all shops resorting to commercialization of covers without following laws. https://t.co/p0aqegrGdE
— Vijay Gopal (@VijayGopal_) August 27, 2021
రెండు ప్యారడైజ్ రెస్టారెంట్లకు, డీ మార్ట్‌కు జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. అలాగే క్యారీ బ్యాగ్‌ల(Carry Bags) చార్జీలను నిలిపివేసి, వినియోగదారులకు వాటిని ఉచితంగా అందించాలని రెస్టారెంట్, రిటైల్ అవుట్లెట్కు కమిషన్ తెలిపింది. మరోవైపు ఫిర్యాదు చేసిన విజయ్ గోపాల్‌కు రూ. 4 వేల నష్ట పరిహారం, కోర్టు ఖర్చులు చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Telangana News