Home /News /telangana /

HYDERABAD HYDERABAD ORR TOLL CHARGES HIKE VS

హైదరాబాద్ : ఓఆర్ఆర్ టోల్ చార్జీల పెంపు నేటి నుండి అమలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎవరి లాభం వారిదే : ఓఆర్ఆర్‌పై వసూలు చేసే టోల్ ఛార్జీలను 3.5శాతం పెంచుతూహైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ నిర్ణయం తీసుకుంది. కాగా ప్రతి కిలోమీటర్‌కు 6 నుండి 39 పైసల వరకు టోల్‌ఛార్జీ పెరగనున్నట్టు ప్రకటించింది..పెరిగిన చార్జీలు నేటి నుంచి అమలులోకి వచ్చాయి.

ఇంకా చదవండి ...


ఓ వైపు కరోనాతో ఆర్ధిక పరిస్థితులు సతమవుతుంటే..మరోవైపు తమ నష్టాన్ని పూడ్చుకునేందుకు ఆయా సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్‌‌పై ప్రయాణించేవారికి షాకింగ్ న్యూస్ ఇచ్చారు.. ఓఆర్ఆర్‌పై వసూలు చేసే టోల్ ఛార్జీలను 3.5శాతం పెంచుతూహైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ నిర్ణయం తీసుకుంది. కాగా ప్రతి కిలోమీటర్‌కు 6 నుండి 39 పైసల వరకు టోల్‌ఛార్జీ పెరగనున్నట్టు ప్రకటించింది.. కాగా పెరిగిన చార్జీలు నేటి నుంచి అమలులోకి వచ్చాయి.

నగరం చుట్టూ 158 కి.మీ మేర నిర్మించిన ఓఆర్‌ఆర్‌పై రోజూ 1.20 లక్షలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. . గతంలో పోలిస్తే ప్రస్తుతం ఓఆర్ఆర్‌పై రాకపోకలు భారీగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వాహనాల రద్దీకి అనుగుణంగా ఓఆర్‌ఆర్‌ చుట్టూ హెచ్‌ఎండీఏ రకరకాల అభివృద్ధి పనులను చేపడుతోంది. ముఖ్యంగా వాహనదారులకు ఆహ్లాదం కలిగించేలా ఓఆర్ఆర్‌కి ఇరువైపులా, మధ్యలో లక్షలాది మొక్కలు నాటింది. వీటి నిర్వహణకే ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. కాని కరోనా సయమంలో రేట్లు పెంచడం , డీజీల్ ,పెట్రోల్ పెరగడంతో వాహానదారులు ఇబ్బందిపడే అవకావకాశాలు కనిపిస్తున్నాయి.
Published by:yveerash yveerash
First published:

Tags: Hyderabad, ORR, Toll Gates

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు