Tea Rs.1,000: కప్పు టీ రూ.1,000.. అది కూడా తెలంగాణలో.. ఎందుకు అంత ధర..? తెలిస్తే మీరు వదలరూ..

టీ (ప్రతికాత్మక చిత్రం)

Tea Rs.1,000: హైదరాబాద్ లో ఇరానీ ఛాయ్ ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. పాత బస్తీలో ఇరానీ చాయ్ రుచి దేనికీ రాదు. ఒక్క కప్పు తాగితే వన్స్ మోర్ కప్ అనాల్సిందే. అంత రుచి ఇరానీ చాయ్ సొంతం. ఇలా హైదరాబాద్ దీనికి ఒక్కదానికే కాదు.. ఎన్నో రకాల రుచులకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. ఒక కేఫ్ లో ఒక్క ఛాయ్ రూ.1000 అంట. దాని గురించి తెలుసుకుందాం..

  • Share this:
    హైదరాబాద్(Hyderabad) లో ఇరానీ ఛాయ్ ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. పాత బస్తీలో ఇరానీ చాయ్(Irani Chai) రుచి దేనికీ రాదు. ఒక్క కప్పు తాగితే వన్స్ మోర్ (Once more) కప్ అనాల్సిందే. అంత రుచి ఇరానీ చాయ్ సొంతం. ఇలా హైదరాబాద్ దీనికి ఒక్కదానికే కాదు.. ఎన్నో రకాల రుచులకు కేరాఫ్ అడ్రస్ (Address) గా నిలుస్తుంది. అయితే సాధారణంగా కప్పు టీ(Tea) ఎంత ఉంటుంది.. రూ.5 నుంచి రూ.20 ఉంటుంది. కొన్ని హోటల్లో(Hotel) అయితే రూ.100 కూడా ఉంటుంది. కానీ అక్కడ ఒక్క ఛాయ్ వెయ్యి రూపాయలు. అవునండి నిజమే.. అది కూడా మన హైదరాబాద్ లోనే. వినడానికి మీకు ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

    Chinese Biryani: చైనా బిర్యానీ ఎలా తయారు చేస్తారో తెలుసా.. ఈ వైరల్ వీడియో చూడండి..


    ఎక్కడంటే.. నిలోఫర్ కేఫ్ దగ్గర. గమ్మత్తైన ఘుమఘుమలాడే సువాసన.. మైమరపించే రుచి.. తాగితే అద్భుతమైన అనుభూతి తప్పదంటున్నారు ఈ చాయ్ తయారు చేసేవారు. అస్సలు ఇంత రేటు ఎందుకు పెట్టాలి.. అందులో ఏముందో తెలుసుకుందాం పదండి.. ఈ ఛాయ్ అనేది ముదురు బంగారు వర్ణంలో ఉంటుంది. ఈ ఛాయ్ తయారు చేయడానికి అందులో వేసే పత్తా అత్యంత ఖరీదనైది మరియు అరుదైనది కూడా.

    Success Story: పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తి కూతురికి ఐఐటీలో సీటు.. వైరల్ అయిన ఇండియన్ ఆయిల్ చైర్మన్ ట్వీట్..


    మొగ్గల నుంచి తయారయ్యే పొడి.. అస్సోంలోని బ్రహ్మపుత్ర నదీ తీరప్రాంతంమైజాన్‌ టీ తోటల్లో మాత్రమే లభిస్తుంది. అవి అత్యంత అరుదైనవి. ఎందుకంటే.. అవి ఏడాదికి ఒక్కసారి మాత్రమే మొగ్గల రూపంలో వస్తాయి. వాటిని సూర్యోదయానికి ముందే కోసి.. ఆరపెట్టి.. పొడిగా చేస్తారు. అలా ఆ పొడి కూడా కిలో లేదా కిలోన్నర మాత్రమే ఉత్పత్తి అవుతుంది. దీంతో ఈ పొడికి చాలా డిమాండ్ ఉంటుంది. ఈ పొడిని కొనుగోలు చేయటానికి ఎంత ధర అయినా పెడతారు వ్యాపారులు.

    Viral Video: ఆ బాలుడు చేసే పని.. అందరికీ కన్నీళ్లు పెట్టించాయి.. ఇంతకు అతడు ఏం చేస్తున్నాడు.. ఎందుకు..?


    డబ్బులు ఉన్నా దానిని దక్కించుకోవడం అంత సులువు కాదు. దానికి వేలం నిర్వహిస్తుంటారు. కోల్ కత్తాలో నిర్వహించిన వేలంలో నిలోఫర్‌ కేఫ్‌ యజమాని బాబూరావు ఈ పొడిని రూ.75 వేలకు దక్కించుకున్నారు. ఇలా అతడు తయారు చేసే ఛాయ్ లో వీటిని కలుపుతుంటాడు. అందుకే ఆ ఛాయ్ కి అంత ఖరీదు. ఈ టీలో పాలను అస్సలు కలపరని అతడు వెల్లడించారు. టీ పొడి డికాషన్‌ రూపంలోనే మంచి టేస్ట్‌ ఉంటుందట. ఇలా ఒక కప్పు టీలో 4 గ్రాములు గోల్డెన్ టిప్స్‌ను(Goldedn Tips) వినియోగిస్తామని చెబుతున్నారు నిలోఫర్‌ కేఫ్‌ యజమాని.

    Viral Video: కొత్తగా.. సరికొత్తగా.. కొత్త పెళ్లి జంట.. జేసీబీలో ఇలా ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా..


    ఇంతటి అమోఘమైన చరిత్ర ఉన్న ఈటీకి అంత ధర ఉంది మరి. కానీ ధర ఎక్కువగా ఉందని ఎవరూ ఏ మాత్రం వెనకడుగు వెయ్యకుండా.. దాని విశేషాలు తెలిసి ఆ ఛాయ్ ని తాగుతున్నారట. మీకు కూడా ఇలాంటి టీని టేస్ట్ చేయాలని ఉందా.. అయితే హైదరాబాద్ లోని నిలోఫర్ కేఫ్ కు వెళ్లాల్సిందే. కొంతమంది ఎక్కువగా వెరైటీ టేస్ట్ లను టేస్ట్ చేయాలని ఉంటుంది. అలాంటి వారికి ఇది ఎంతగానే ఉపయోగపడుతుంది. అక్కడ ఉపయోగించే తేయాకు కిలో రూ. 75 వేలు. ప్రస్తుతం ఈ వార్త ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
    Published by:Veera Babu
    First published: