హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyd | Metrorail : ఎక్కడిక్కడ నిలిచిపోయిన హైదరాబాద్ మెట్రో రైళ్లు.. కారణం ఏంటో తెలుసా..?

Hyd | Metrorail : ఎక్కడిక్కడ నిలిచిపోయిన హైదరాబాద్ మెట్రో రైళ్లు.. కారణం ఏంటో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad: జంటనగరాల్లో నిత్యం వేలాది మందికి రవాణా సౌకర్యం కల్పిస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపం కారణంగా హైదరాబాద్‌లోని మెట్రో రైళ్లు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

జంటనగరాల్లో నిత్యం వేలాది మందికి రవాణా సౌకర్యం కల్పిస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ Metrorailసేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపం కారణంగా హైదరాబాద్‌(Hyderabad)లోని మెట్రో రైళ్లు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం దసరా(Dussehra)సెలవుల కారణంగా మెట్రో తన సర్వీసుల సమయాన్ని పెంచింది. అయితే సాంకేతిక లోపం కారణంగా తలెత్తిన సమస్యను మెట్రో రైల్ అధికారులు నిపుణులతో పరిశీలిస్తున్నారు. మరోవైపు సుధూర ప్రాంతాలకు వెళ్లాల్సిన చాలా మంది మెట్రో రైళ్లలో చిక్కుకుపోయారు. ఓవైపు రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్‌ కాల్స్(Phone calls)ద్వారా తమ సమాచారాన్ని చేరవేస్తున్నారు.

Gangavva: అప్పట్లో బీడీలు చుడితే రోజుకు 500రూపాయలు .. ఇప్పుడు గంగవ్వ రోజు సంపాదన ఎంతంటే

ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది..

కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఇటీవల కాలంలో అత్యధిక ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేస్తూ రికార్డు బ్రేక్ చేసిన హైదరాబాద్ మెట్రో రైల్‌ ఇప్పుడు సాంకేతిక లోపం ఏర్పడం ఒకింత ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. సుమారు రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల మంది ప్రయాణం చేస్తారనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ట్రైన్ సర్వీస్ గత కొద్ది రోజులుగా 3నుంచి 4లక్షల మంది మెట్రో ట్రైన్ సర్వీస్‌ని ఉపయోగించుకున్నట్లుగా సంస్థ యాజమాన్యం ప్రకటించింది.

ఈ-టికెటింగ్ సౌకర్యం ..

కరోనా ప్రభావం తగ్గడం పూర్తిగా చాలా కంపెనీలు, ఉద్యోగస్తులు మెట్రోరైల్ సేవలకు అలవాటు పడిపోయారు. ఈపరిస్థితుల్లోనే కేంద్ర ప్రభుత్వ డిజిటల్‌ ఇండియా ప్రోగ్రామ్‌కి అనుగూణంగా హైదరాబాద్‌ మెట్రో, ఎల్‌అండ్‌టీ సంస్థలు తొలిసారిగా ఈ-టికెటింగ్‌ను ప్రారంభించాయి. ప్రయాణికులకు ఈ- టికెటింగ్‌పై కొన్ని నెలలుగా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన అధికారులు మెట్రోస్టేషన్లలో వాట్సాప్‌ టికెటింగ్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికులు ప్రవేశ ద్వారం వద్ద క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి ఎక్కడికి వెళ్లాలో ఎంటర్‌ చేసి యూపీఏ ద్వారా డబ్బులు చెల్లించొచ్చు. రైలు దిగిన తర్వాత వాట్సాప్‌లో వచ్చిన టికెట్‌ను స్కాన్‌ చేస్తే గేటు తెరుచుకుంటుంది. దేశంలోనే మొట్ట మొదటిసారిగా వాట్సప్‌ టికెటింగ్‌ను ప్రారంభించడం జరిగింది.

First published:

ఉత్తమ కథలు