హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని పురానాపూల్ ప్రాంతంలోని ఓ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మూసీ నదికి సమీపంలో ఉన్న ఓ భవనంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.ఆరు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ గోడౌన్ కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని జియాగూడ ప్రాంతంలో ఉంది. గోడౌన్ ఆవరణలో పొగలు కమ్ముకోవడంతో స్థానికులు గమనించి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు.
మంటలను ఆర్పేందుకు 6 ఫైరింజన్లను ఉపయోగించారు. స్థానిక పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి అలంకార వస్తువులను నిల్వ చేసేందుకు ఉపయోగించే గోడౌన్‌లో మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు.అగ్ని ప్రమాదం వెనుక కారణం ఇంకా తెలియాల్సి ఉంది.అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. భారీ పొగ ఆ ప్రాంతాన్ని కప్పేడం, భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fire Accident, Hyderabad, Local News