వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గత మూడురోజులుగా వరుసగా వానలు కురుస్తున్నాయి. పలు చోట్ల... వడగండ్ల వానలు కూడా పడ్డాయి. అయితే ఈ అకాల వర్షాలతో.. ఇప్పుడు వేసవిలో వచ్చే మామిడి పండ్లు ప్రియం కానున్నాయి. వేసవిలో మామిడి పండ్లు తినాలని ప్రతీ ఒక్కరు అనుకుంటుంటారు. అయితే ఈ సారి మాత్రం సీజన్‌లో వచ్చే మామిడిపండ్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. పండ్లలో రారాజుగా భావించే మామిడి పండ్లు ఈ సీజన్‌లో ఖరీదైనవిగా మారే అవకాశం ఉంది. దీనికి కారణం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అకాల వర్షాలు, తెగుళ్ళ దాడితో మామిడి పంటలను ప్రభావితం చేసింది. ఆ ఫలితంగా వాటి దిగుబడిపై ఎఫెక్ట్ పడింది.
అకాల వర్షాలు , వడగళ్ల వానలు మామిడి పంటను మాత్రమే కాకుండా, మొక్కజొన్న, బొప్పాయి, ఉల్లి, పత్తి, టమోటా, మిరప వంటి ఇతర పంటలకు కూడా నష్టాలు కలిగించాయి. దీంతో దిగుబడికి నష్టం వాటిల్లిందని, దీని ప్రభావం తమ జీవనోపాధిపై పడుతుందని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో వర్షాలు మామిడి రైతుల కష్టాలను మరింత పెంచుతున్నాయంటున్నారు. జనవరి నుండి పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడంతో సీజన్ సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ, వర్షాలు , వడగండ్ల వానలతో పాటు తెగుళ్ళ దాడి పంటలపై ప్రభావం చూపింది. తెగుళ్ళ దాడుల కారణంగా పువ్వు-పండు మార్పిడి చెందకుండా ప్రభావితమైంది. ఫలితంగా తక్కువ దిగుబడి వచ్చింది.
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వడగళ్ల వానలు రాష్ట్ర రైతంగా తీవ్ర కష్టాలు ఎదుర్కొంటుంది. దీంతో ఈ సీజన్‌లో ఎలా బతుకుతామోనని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు, చీడపీడల కారణంగా పంటలు నష్టపోవడం ఎగుమతి మార్కెట్‌పై కూడా ప్రభావం చూపి సరఫరా తగ్గి ధరలు పెరగడానికి కూడా ఈ పరిస్థితి దారితీయవచ్చు. హైదరాబాద్ పొరుగు జిల్లాలు, తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో ఉత్పత్తి అయ్యే మొత్తం మామిడిలో, ఎక్కువ భాగం గల్ఫ్ దేశాలు, చైనా, ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేయబడుతుంది.
హైదరాబాద్ మార్కెట్‌కు ఇతర రాష్ట్రాల నుంచి మామిడి వస్తుంది. సాధారణంగా హైదరాబాద్ మార్కెట్‌లో తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి పచ్చి మామిడి పండ్లను తెస్తారని, అయితే ఈ ఏడాది పొరుగు రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్‌కు పచ్చి మామిడి పండ్లను తీసుకురావడంతో ధరలు పెరిగాయి. బెంగళూరు సిటీతో పాటు పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోని ఇతర ప్రాంతాల నుంచి మామిడి పండ్లను హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు వ్యాపారాలు. ఇవన్నీ కూడా నగరంలో మామిడిపండ్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News, Mango