గర్భవతిగా ఉన్న నన్ను నా భర్త కెనడాలో వదిలేసి హైదరాబాద్‌కు వచ్చాడు.. ట్విట్టర్‌‌‌లో మహిళ ఫిర్యాదు.. కట్ చేస్తే..

ప్రతీకాత్మక చిత్రం

దీప్తి రెడ్డి అనే మహిళ తన భర్త అనుగుల చంద్రశేఖర్ రెడ్డి తాను కెనడాలోని మాన్‌ట్రీల్‌లో వదిలేసి ఇండియాకు వచ్చేశాడని చెప్పింది. తనకు ఏ మాత్రం చెప్పకుండా ఇండియాకు వచ్చేశాడని తెలిపింది

 • Share this:
  ‘నా భర్త నన్ను కెనడాలో(cana)da వదిలిపెట్టి హైదరాబాద్(Hyderabad) వచ్చేశాడు. నేను ఇప్పుడు గర్భవతిగా ఉన్నాను. నా ఆరోగ్య పరిస్థితి కూడా ఏం బాగోలేదు. నాకు సాయం చేయండి’అంటూ ఓ మహిళ ట్విటర్ ద్వారా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ను(Union Minister Jaishankar) కోరింది. అయితే ఈ విషయం కాస్తా రాచకొండ పోలీసులకు(Rachakonda Police) దృష్టికి వచ్చింది. దీంతో రాచకొండ పోలీసులు స్పందించారు. ఆ మహిళ చెప్పిన వివరాలపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని రాచకొండ సీపీ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దీప్తి రెడ్డి అనే మహిళ తన భర్త అనుగుల చంద్రశేఖర్ రెడ్డి తాను కెనడాలోని మాన్‌ట్రీల్‌లో వదిలేసి ఇండియాకు వచ్చేశాడని చెప్పింది. తనకు ఏ మాత్రం చెప్పకుండా ఇండియాకు వచ్చేశాడని తెలిపింది. ఇప్పటివరకు అతను ఎక్కడున్నాడనే దానిపై సమాచారం లేదని చెప్పింది. ఆగస్టు 20వ తేదీన ఇందుకు సంబంధించి ఇండియన్ హైకమిషన్‌లో (Indian High Commission) ఫిర్యాదు చేశానని.. అయితే ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

  ‘నా పేరు దీప్తి రెడ్డి. నేను మాన్‌ట్రీల్‌లో ఉంటున్నాను. నేను ఇక్కడికి మూడు నెలల క్రితం వచ్చాను. నా భర్త అనుగుల చంద్రశేఖర్ రెడ్డి. మెక్‌గ్రిల్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభాగంలో పోస్ట్‌డాక్‌ గా పని చేస్తున్నాడు. అతడు నాకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా ఆగస్టు 9న ఇండియాకు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి నాకు అతనితో, అతని కుటుంబంతో ఎలాంటి కాంటాక్ట్ లేకుండా పోయింది. వారి ఫోన్లలో నా నెంబర్‌ను బ్లాక్ చేశారు. వారు ఇప్పుడు బంధువుల ఇళ్లలో దాక్కున్నారు. నేను ఇప్పుడు రెండు నెలల గర్భవతిని. నేను ప్రస్తుతం ఉన్న ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఇండియాకు ప్రయాణం చేయలేను. నా భర్త సోదరుడు శ్రీనివాస్ రెడ్డి చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. నా భర్త ఎక్కడ ఉన్నాడు నాకు తెలియడు. ఆయన ఆరోగ్యం గురించి నేను ఆందోళన చెందుతున్నాను. నా భర్త ఎక్కడున్నాడు కనుక్కోవడానికి సాయం చేయండి’అని కోరారు. అలాగే తన అత్తమామల పాత, కొత్త ఇళ్ల అడ్రస్‌ను షేర్ చేశారు. తన పాస్‌పోర్ట్, మ్యారేజ్ సర్టిఫికేట్.. ఆధారాలను ఇండియన్ హైకమిషన్‌కు పంపించినట్టు చెప్పారు.

  అలాంటి వీడియోలు చూస్తే పోలీసులు ఇంటికి వచ్చేస్తారు.. ఇప్పటి వరకు 1095 మంది అరెస్ట్

  ఇక, ఇది కాస్తా రాచకొండ పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో స్పందించిన రాచకొండ సీపీ..ఆ మహిళ చెప్పిన వివరాల మేరకు విచారణ జరపాలని ఆదేశించారు. దీప్తి రెడ్డి తల్లిదండ్రులు, బంధువులు ఎవరైనా హైదరాబాద్‌లో ఉంటే రాచకొండ సీపీని కలవాలని పోలీసులు ట్వీట్ చేశారు.

  Sad: తలుపులు బద్దలు కొట్టి చూస్తే షాకింగ్ సీన్.. ఇంట్లో ఐదుగురి మృతదేహాలు.. పాపం ఆ మూడేళ్ల చిన్నారి..

  సీపీ ఆదేశాలతో దీప్తి ఫిర్యాదుపై విచారణ జరిపినట్టుగా మీర్‌పేట్ పోలీసులు తెలిపారు. దీప్తి బంధువును భువనగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించినట్టుగా చెప్పారు. దీప్తి తరఫున బంధువులు ఫిర్యాదు చేస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
  Published by:Sumanth Kanukula
  First published: