HYDERABAD HYDERABAD MAN ATTACKS ELECTRICITY SUB ENGINEER FOR DISCONNECTING POWER SUPPLY HELD PAH
Hyderabad: పాతబస్తీలో రెచ్చిపోయిన యువకుడు.. సబ్ ఇంజినీర్ ఛాతీపై తన్నాడు.. కారణం ఏంటంటే...
అధికారిపై దాడిచేస్తున్న యువకుడు
Old city: కార్వాన్ లో యువకుడు ఎలక్ట్రిక్ ఆఫీస్ లో వీరంగం సృష్టించాడు. తన కార్యలయానికే విద్యుత్ సరఫరా ను కట్ చేస్తావా అంటూ.. అధికారిపై దాడికి పాల్పడ్డాడు.
Karwan Man attacks electricity sub engineer: హైదరాబాద్ లో యువకుడు బీభత్సం సృష్టించాడు. తన కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తావా అంటూ విద్యుత్ అధికారిని నానా బూతులు తిట్టాడు. అంతటితో ఆగకుండా చుట్టు అధికారులు వద్దని వారిస్తున్న వినకుండా బల్లపై ఎక్కి మరీ దాడికి తెగబడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటనతో పాతబస్తీ మరోసారి వార్తలలో నిలిచింది.
ప్రధానంగా పాత బస్తీలో స్థానిక నాయకులు, కొంత మంది యువకులు అధికారుల పట్ల ఇష్టాను సారంగా ప్రవర్తిస్తారు. ఈ ఆరోపణలకు బలం చూకూర్చే విధంగా అనేక సంఘటనలు ఇప్పటికే వార్తలలో నిలిచాయి. తాజాగా, మరో ఉదంతం వెలుగులోనికి వచ్చింది. ఒక యువకుడు పెండింగ్ బిల్లులు చెల్లించలేదని విద్యుత్ అధికారి అతని కార్యాలయానికి.. విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు.
Hyderabad | A sub-engineer, Vijay Kumar, of the electricity dept at Karwan section office was kicked on his chest by a 22-yr-old local resident, after the former disconnected electricity supply over long pending issues: SHO G Santosh Kumar
దీంతో 22 ఏళ్ల సదరు స్థానిక యువకుడు, మరో ముగ్గురితో కలిసి రెచ్చిపోయారు. తన కార్యాలయానికే విద్యుత్ సరఫరా నిలిపిస్తావా అంటూ ఆఫీస్ కు వచ్చాడు. కార్యాలయంలో జూనియర్ ఇంజనీర్ విజయ్ కుమార్ ఛాంబర్ కు వెళ్లాడు. అక్కడ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా.. బెంచీ మీద నిలబడి అధికారిపై పిడిగుద్దులు కురిపించారు. అంతటితో ఆగకుండా అధికారిని కాలితో తన్నారు.
ప్రస్తుతం ఈ క్లిప్పింగ్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, కొంత మంది స్థానిక నాయకులు, ఎమ్మెల్యేల అండదండలతో యువకులు రెచ్చిపోతున్నారని పలువురు భావిస్తున్నారు. కొంత మంది దురుసుగా ప్రవర్తించడం వలన అందరికి చెడ్డపేరు వస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనతో పాతబస్తీ మరోసారి వార్తలలో నిలిచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.