హోమ్ /వార్తలు /తెలంగాణ /

హైదరాబాద్ లో కరెంట్ పోనే పోదు..పవర్ ఐలాండ్ గా మార్చామన్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ లో కరెంట్ పోనే పోదు..పవర్ ఐలాండ్ గా మార్చామన్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

హైదరాబాద్ లో కరెంట్ పోనే పోదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.న్యూయార్క్, పారిస్, లండన్ లో అయిన కరెంటు పోతుందేమో కానీ హైదరాబాద్ లో మాత్రం పోదని అన్నారు. హైదరాబాద్ ను పవర్ ఐల్యాండ్ గా మార్చాము. రాష్ట్రంలో అన్ని జనరేటెడ్ సెంటర్లతో, దేశ ఎలక్ట్రిక్ తో అనుసంధానం చేశాం అని కేసీఆర్ అన్నారు. ఇక మెట్రోను మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. కేంద్రం సహకారం ఉన్నా లేకున్నా తాము మాత్రం మెట్రోను విస్తరిస్తాం అన్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్ లో కరెంట్ పోనే పోదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.న్యూయార్క్, పారిస్, లండన్ లో అయిన కరెంటు పోతుందేమో కానీ హైదరాబాద్ లో మాత్రం పోదని అన్నారు. హైదరాబాద్ ను పవర్ ఐల్యాండ్ గా మార్చాము. రాష్ట్రంలో అన్ని జనరేటెడ్ సెంటర్లతో, దేశ ఎలక్ట్రిక్ తో అనుసంధానం చేశాం అని కేసీఆర్ అన్నారు. ఇక మెట్రోను మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. కేంద్రం సహకారం ఉన్నా లేకున్నా తాము మాత్రం మెట్రోను విస్తరిస్తాం అన్నారు.

Big News: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

ఎయిర్ పోర్టుకు రెండో రన్ వే..

నేడు  మెట్రోను ఇంకా విస్తరించాల్సి ఉంది. ORR చుట్టూ మెట్రో రావాల్సిన అవసరం ఉంది. చాలా సురక్షితమైన నగరం హైదరాబాద్. ఇక్కడ అన్ని భాషలు, సంస్కృతుల వాళ్లు కలిసి వుంటున్నారు. హైదరాబాద్ లో 1912లోనే పవర్ సదుపాయం ఉంది. చరిత్రలో హైదరాబాద్ సుప్రసిద్ధ నగరం. వర్తమానంలోనూ హైదరాబాద్ గొప్ప నగరం. అందరికి అనువైన వాతావరణం ఇక్కడ ఉంది. ఇక ఎయిర్ పోర్టు వరకు రెండో రన్ వే ప్రారంభం కాబోహుంది. ఎయిర్ పోర్టుకు మెట్రో కనెక్టివిటీ తీసుకురాబోతున్నాం అని సభలో కేసీఆర్ చెప్పుకొచ్చారు.

Hyderabad Metro: హైదరాబాద్ చుట్టూ మెట్రో రైల్.. మరో శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్

రెండో దశ పనులకు సీఎం శంకుస్థాపన

హైదరాబాద్ లో మెట్రో విస్తరణలో భాగంగా సీఎం కేసీఆర్ (Cm kcr) శుక్రవారం రెండో దశ పనులకు శంకుస్థాపన చేశారు.  రాయదుర్గం నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు 31 కిలోమీటర్లు రూ.6,250 కోట్లతో ఈ పనులు ప్రారంభించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నేడు ఫేజ్ 2 పనులకు కేసీఆర్ (Cm kcr) భూమి పూజ నిర్వహించారు. భూసేకరణ సమస్యలు లేనందున 3 ఏళ్లలో ఈ పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ  కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ , శ్రీనివాస్ గౌడ్ , సబితా ఇంద్రా రెడ్డి, కేశవరావు, సీఎస్ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు.  ఈ మెట్రో పనుల్లో భాగంగా మైండ్ స్పేస్ కూడలి నుంచి 0.9 దూరంలో రాయదుర్గం ఎయిర్‌పోర్టు స్టేషన్‌ నిర్మిస్తారు. అక్కడి నుంచి ఎయిర్‌పోర్టు మెట్రో (Airport Metro) ప్రారంభమవుతుంది.

ఇక మరికాసేపట్లో కేసీఆర్ తెలంగాణ భవన్ కు బయలుదేరనున్నారు. నిన్న BRSని ఆమోదిస్తూ ఈసీ కేసీఆర్ కు లేఖ పంపింది. దీనిపై నేడు కేసీఆర్ సంతకం చేయనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, ప్రకాష్ రాజ్ కూడా హాజరు కానున్నారు.

First published:

Tags: CM KCR, Hyderabad Metro, Hyderabad Metro rail, Telangana, Telangana News

ఉత్తమ కథలు