భాగ్యనగరాన్ని జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. ఎక్కడ చూసినా జ్వరాలతో బాధపడే వారే కనిపిస్తున్నారు. సీజనల్ ఇన్‌ఫెక్షన్లు, వైరల్ ఫీవర్ కారణంగా హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. రోగులు జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. చాలా మంది రోగులు ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులు కోలుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు. మందులు వాడినప్పటికీ లక్షణాలు తగ్గుముఖం పట్టడానికి సమయం పడుతోంది.
హైదరాబాద్‌లో వైరల్ ఫీవర్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొందరు పేషెంట్లు వైద్యులను సంప్రదించకుండానే యాంటీబయాటిక్స్ వాడుతున్నారు.
యాంటీబయాటిక్స్ వైరస్‌లకు వ్యతిరేకంగా పనిచేయవు కాబట్టి ఇటువంటి విధానం సమస్యకు పరిష్కారం కాదంటున్నారు డాక్టర్లు. అంతే కాకుండా యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల బ్యాక్టీరియా నిరోధక సమస్య వస్తుంది. అనారోగ్యానికి కారణం వైరస్ కాదు బ్యాక్టీరియా అయినప్పుడు యాంటీబయాటిక్స్ ఒక పరిష్కారం. బ్యాక్టీరియా ఒక జీవి కాబట్టి, యాంటీబయాటిక్స్ వాటి పెరుగుదల మరియు పునరుత్పత్తిని ఆపడం ద్వారా వాటికి వ్యతిరేకంగా పని చేస్తాయి. వైరస్‌ల విషయంలో కూడా ఇది నిజం కాదు.
అక్టోబరు నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో హైదరాబాద్‌లో వింటర్ సీజన్‌లో వైరల్ ఫీవర్స్ విజృంభించడం సర్వం సాధారణం అయినప్పటికీ, ఈ ఏడాది హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతోంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో చాలా మంది ప్రజలు మాస్క్‌లు ధరించడం మానేశారు. దీంతో వైరల్ ఫీవర్ మరియు ఇతర సీజనల్ ఇన్‌ఫెక్షన్‌లకు ఈజీగా ఎఫెక్ట్ అవుతున్నాయి. హైదరాబాద్‌లో చలికాలంలో వైరల్ ఫీవర్ రావం అసాధారణం కానప్పటికీ, వైరల్ ఫీవర్ రాకుండా నిరోధించడానికి కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
తరచుగా చేతులు కడుక్కుంటూ ఉండాలి. చాలా వైరస్‌లు మరియు బ్యాక్టీరియాలు అనేక ఉపరితలాలతో సంబంధంలోకి రావడం వల్ల చేతుల ద్వారానే మానవ శరీరంలోకి ప్రవేశిస్తాయన్న విషయం తెలిసిందే. కాబట్టి తరచుగా చేతులు కడుక్కోవడం వల్ల వైరల్ ఫీవర్, ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. అదే విధంగా మాస్క్ తప్పనిసరిగా వాడాలి. కోవిడ్-19 కేసుల పెరుగుదల సమయంలో మాస్క్ సాధారణమైనప్పటికీ, ఇప్పుడు చాలా మందికి ఇది తప్పకుండా వాడాల్సి వస్తోంది.
మాస్క్‌లు కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడమే కాకుండా వైరల్ ఫీవర్ మరియు ఇతర ఇన్‌ఫెక్షన్ల నుండి ఉత్తమ రక్షణగా కూడా పనిచేస్తాయి. అంతేకాకుండా ప్రస్తుతం చలి ఎక్కువగా ఉండటంతో... మానవుల రోగనిరోధక శక్తిని పెంచడంలో ఆరోగ్యకరమైన ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది అనేక రకాల వైరస్‌లు, బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా పోరాడడంలో సహాయపడుతుంది. అధిక ఉష్ణోగ్రతలలో వైరస్‌లు మనుగడ సాగించలేవు. కాబట్టి, వేడి వేడి ఆహారం ద్వారా వైరస్‌ల వ్యాప్తిని నివారిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ.. వేడివేడిగానే ఆహారం తీసుకోవడం మంచిది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fever, Hyderabad, Local News