భాగ్యనగరంలో చారిత్రక కట్టడాల్లో మక్కా మసీదు ఒకటి. మక్కా మసీదు (హైదరాబాదు, భారతదేశం) భారతదేశంలోని ప్రాచీన, పెద్దవైన మస్జిద్ లలో ఒకటి. 1617 లో మహమ్మద్ కులీ కుతుబ్ షా, మీర్ ఫజులుల్లా బేగ్, రంగయ్య చౌదరి ల ఆధ్వర్యంలో ఈ మస్జిద్ ను కట్టించాడు. అబ్దుల్లా కులీ కుతుబ్ షా, తానా షా కాలంలోనూ దీని నిర్మాణం కొనసాగింది, 1694 లో మొఘల్ చక్రవర్తియైన ఔరంగజేబు పూర్తికావించాడు.
వందల ఏళ్లకు పైగా మసీదుకు అందాన్ని చేకూర్చిన చారిత్రక మక్కా మసీదు విలువైన, అరుదైన గడియారం 8 ఏళ్ల తర్వాత మళ్లీ అందుబాటులోకి వచ్చింది. మక్కా మసీదు యొక్క ఈ అరుదైన గడియారానికి దాని స్వంత చరిత్ర ఉంది. ఫ్రాన్స్‌కు చెందిన ఫేవ్రే-ల్యూబా కంపెనీకి చెందిన ఈ గడియారంను 1850లో తయారు చేయబడింది. అసఫ్ జాహీ రాజవంశానికి చెందిన IV నిజాం నవాబ్ నాసిర్-ఉద్-దౌలా ఈ గడియారాన్ని ఫ్రాన్స్‌కు ఆర్డర్ చేసి మక్కా మసీదులో అమర్చారు.
1948 తర్వాత కమీషనర్ ఎండోమెంట్ కింద మక్కా మసీదు, షాహీ మసీదు నిర్వహణలో ఉన్నప్పుడు భారత్ వాచ్ కంపెనీకి వాచ్ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.ఈ బాధ్యత 1972 నుంచి 1982 వరకు కొనసాగగా.. 1982లో అప్పటి పోలీస్ కమిషనర్ విజయరామారావు సిఫార్సు మేరకు నిర్వహణ పనులు వాహెద్ వాచ్ కంపెనీకి అప్పగించారు.
వాహెద్ వాచ్ కంపెనీకి చెందిన సికందర్ ఖాన్, భారత్ వాచ్ కంపెనీకి చెందిన వినోద్ షిండేల సంయుక్త కృషి ఫలితంగా 8 ఏళ్లుగా పనిచేయకుండా మూలన పడిన ఈ చారిత్రాత్మక గడియారం మళ్లీ పని చేయడం ప్రారంభించింది. సాలార్ జంగ్ మ్యూజియంలోని చారిత్రక గడియారం మరియు మక్కా మసీదు గడియారం రెండూ ఒకే మిషనరీని కలిగి ఉన్నాయని వీరు చెబుతున్నారు. ఏదీ ఏమైనా వాచ్ మళ్లీ పనిచేయడంతో.. అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News