Home /News /telangana /

HYDERABAD HYDERABAD HAS THE HIGHEST NUMBER OF CYBER CRIME CASES SHOCKING FACTS IN THE POLICE CRIME ANNUAL REPORT BK VB

Hyderabad Crime Report: హైద‌రాబాద్ లో అత్య‌ధిక సైబ‌ర్ క్రైమ్ కేసులు.. పోలీసు క్రైమ్ వార్షిక రిపోర్ట్ లో సంచ‌ల‌న నిజాలు.. 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad Crime Report: హైద‌రాబాద్ సిటీ పోలీసులు వార్షిక కేసులు రిపోర్ట్ ను విడుద‌ల చేశారు. అయితే ఎప్పుడు జ‌రిగే దొంగ‌త‌నాలు, హ‌త్య‌లు, దోపిడిలు లాంటి కేసుల త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో  నగర పోలీసులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ, ఈ సంవత్సరం సైబర్ క్రైమ్ కేసులు భారీగా పెరగడం పోలీసులకు అగ్నిపరీక్షగా రుజువు చేస్తోంది. 

ఇంకా చదవండి ...
    (Balakrishna,News18,Hyderabad)

    హైద‌రాబాద్ సిటీ పోలీసులు వార్షిక కేసులు రిపోర్ట్ ను విడుద‌ల చేశారు. అయితే ఎప్పుడు జ‌రిగే దొంగ‌త‌నాలు, హ‌త్య‌లు, దోపిడిలు లాంటి కేసుల త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో  నగర పోలీసులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ, ఈ సంవత్సరం సైబర్ క్రైమ్ కేసులు భారీగా పెరగడం పోలీసులకు అగ్నిపరీక్షగా రుజువు చేస్తోంది.  గ‌త ఏడాది 1,379 సైబర్ క్రైమ్ కేసులు నమోదైతే, ఈ ఏడాది 5,646 సైబర్ నేరాల కేసులను న‌గ‌ర పోలీసులు బుక్ చేశారు. సైబర్‌క్రైమ్ బాధితుల‌కు త్వ‌రిత‌గ‌తిన న్యాయం చేకూర్చ‌డానికి స్థానిక పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేసే సదుపాయాన్ని ప్రవేశపెట్టడం జరిగింద‌ని తెలిపారు అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్స్) శిఖా గోయెల్.

    ఇటీవల సిటీ క్రైమ్ వార్షిక రిపోర్ట్ ను విడుద‌ల చేసిన ఆమె సైబర్ నేరాలకు గురైన ఎవరైనా స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించవచ్చ‌ని తెలిపారు. సైబర్ క్రైమ్ దర్యాప్తు చేయ‌డం కోసం పోలీసుల‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణ కూడా అందిస్తోన్నామ‌ని ఆమె తెలిపారు. నైపుణ్యంతో శిక్షణ పొందిన స్థానిక పోలీసు అధికారులచే కేసులు బుక్ చేయబడి, దర్యాప్తు చేయబడతాయ‌ని అన్నారు ఆమె. ఎక్కువ శాతం మోసాలు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) స్కామ్‌లకు సంబంధించినవని ఆమె చెప్పారు. ఈ సైబ‌ర్  మోసగాళ్లు ఎక్కువగా బాధితులను క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి చెల్లింపును స్వీకరించమని మరియు బాధితులను మోసగాళ్లకు డబ్బును బదిలీ చేయమని అడుగుతున్న సంఘ‌ట‌న‌లే ఎక్వకువగా జ‌రుగుతున్నాయి.

    Occupied Land: బతికుండగానే చంపేసి.. 30 గుంటల భూమిని స్వాహా చేసేశారు.. ఎలా జరిగిందంటే..


    ఈ ఏడాది విడుద‌ల చేసిన వార్షిక రిపోర్ట్ ఆధారంగా దాదాపు 45 శాతం సైబర్ క్రైమ్ కేసులు UPI స్కామ్‌లకు సంబంధించినవి, 15 శాతం OTP మోసాలు, నకిలీ కస్టమర్ కేర్, పెట్టుబడి మోసం మరియు ఇతర సైబర్ క్రైమ్‌లకు సంబంధించినవి ఉన్నాయి. ఈ  సైబర్ క్రైమ్ మోసాలకు చాలా మంది సీనియర్ సిటిజన్లు బాధితులు అవుతున్నారని శిఖా గోయల్ తెలిపారు. “కోవిడ్  మహమ్మారి తరువాత, సీనియర్ సిటిజన్లు బయటకు వెళ్లడం మానుకున్నారు. త‌మ అవ‌స‌రమైన  చెల్లింపుల కోసం ఆన్‌లైన్ పోర్టల్‌లు మరియు ఇ-వాలెట్‌లను ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా మందికి భద్రతా మార్గదర్శకాలు స‌రిగ్గా తెలియ‌క‌పోవ‌డంతో సైబ‌ర్ నేరాగాళ్ల‌కు ఈజీగా మోసం చేయ‌డానికి అవ‌కాశం దొరుకుతుందని సిటి పోలీసులు అంటున్నారు.

    Telangana Politics: ఏపీ హైకోర్టులో అతడికి పాక్షిక ఊరట.. దర్యాప్తు అధికారికి ఆదేశాలు జారీ.. పూర్తి వివరాలివే..


    వృద్దులే ల‌క్ష్యంగా సిటీలో గ‌డిచిన ఏడాది సైబ‌ర్ నేరాగాళ్లు రెచ్చిపోయారు. ఇదిలా ఉండగా, నగర పోలీసులకు ఆన్ లైన్ లోక్ యాప్స్ మోసాలపై కూడా పెద్ద మొత్తంలో  ఫిర్యాదులు ఈ ఏడాది వ‌చ్చాయి. దీంతో ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకోవద్దని ప్రజలను పోలీసులు కోరుతున్నారు. ఆన్‌లైన్ పెట్టుబడి మోసగాళ్లపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని, ఈ ఏడాది 18 మందిని అరెస్టు చేశామని శిఖా గోయల్ తెలిపారు. అలాగే కొన్ని ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లు ప్లేయర్‌ల మ‌రియు క్రిప్టో కరెన్సీని మోసాలు కూడా న‌గ‌రంలో ప‌ద్ద సంఖ్య‌లో జ‌రుగుతున్నాయ‌ని పోలీసులు తెలిపారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Brand Hyderabad, Crime, Crime report

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు