హోమ్ /వార్తలు /తెలంగాణ /

పాపం.. ఎంత కష్టం.. విషం తాగి సాఫ్ట్ వేర్ ఉద్యోగి కుటుంబం ఆత్మహత్య..!

పాపం.. ఎంత కష్టం.. విషం తాగి సాఫ్ట్ వేర్ ఉద్యోగి కుటుంబం ఆత్మహత్య..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ముందుగా పిల్లలకు పొటాషియం సైనైడ్ తినిపించారు . ఆ తరువాత తల్లిదండ్రులు కూడా దాన్ని సేవించారు. అయితే కుటుంబ సభ్యులు, బంధువులు ఫోన్లు చేస్తున్నా రిప్లై లేకపోవడంతో.. అనుమానం వచ్చి చూడగా... నలుగురు మృతదేహాలు బయటపడ్డాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని కుషాయిగూడలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బాధిత కుటంబం సాఫ్టవేర్ ఇంజనీర్ గాదె సతీష్‌దిగాపోలీసులు గుర్తించారు. మృతులు.. సతీష్, అతని భార్య గాదె వేద, తొమ్మిదేళ్ల నిషికేత్, ఐదేళ్ల నిహాల్‌గా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సతీష్ కుమారుడు నిషికేత్ మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా, నిహాల్ ఆటిస్టిక్‌తో బాధపడుతున్నాడు. పిల్లలు ఆరోగ్య విషయంలో సతీష్, అనతి భార్య వేద తీవ్ర మనో ఆవేదనకు గురయ్యేవారు. పిల్లలకు ఇన్ని ఆరోగ్య సమస్యలు ఏంటని లోలోపల కుమిలిపోతు ఉండేవారు. ఈ క్రమంలో తల్లిదండ్రులుగా తమ పిల్లల ఆరోగ్య పరిస్థితులను జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నామని తీవ్రంగా బాధపడేవారు. పిల్లల్ని చంపి తాము కూడా చనిపోవాలని నిర్ధారించుకన్నారు. పిల్లలకు పొటాషియం సైనైడ్ తినిపించారు . ఆ తరువాత తల్లిదండ్రులు కూడా దాన్ని సేవించారు.

అయితే బంధువులు కుటుంబసభ్యులు ఎంత ఫోన్ చేస్తున్న స్పందించకపోవడంతో.. అనుమానం వచ్చిన వారు సతీష్ ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పటికే నలుగురు కూడా మృతి చెంది ఉన్నారు. వెంటనే.. పోలీసులకు సమాచారం అందించారు. ఇక పోలీసులు వచ్చి తల్లిపిల్లల మృతదేహాలు మంచంపై పడి ఉన్నాయి.. ఇక సతీష్‌ మృతదేహం గదిలో ఓ మూలన కనిపించింది అని కుషాయిగూడ పోలీసులు తెలిపారు. కుషాయిగూడ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత డెడ్ బాడీలను బంధువులకు అప్పగించనున్నారు.

First published:

Tags: Family suicide, Hyderabad, Local News

ఉత్తమ కథలు