Home /News /telangana /

HYDERABAD HYDERABAD DOCTORS PERFORM RARE SURGERY ON 3 YEAR OLD GIRL SUFFERING FROM LAUGHTER DISORDER GH VB

Hyderabad Doctors: బాలికకు ఆ నవ్వు పెద్ద శాపంగా మారింది.. చివరకు డాక్టర్లు ఏం చేశారో తెలుసా..

ఆపరేషన్ తర్వాత బాలికతో వైద్యులు

ఆపరేషన్ తర్వాత బాలికతో వైద్యులు

ఏ కారణం లేకుండా హఠాత్తుగా నవ్వు వస్తుందా.. ఇలా వచ్చే నవ్వాపుకోలేక ఇబ్బంది పడుతున్నారా.. ఇవన్నీ ఒక రకమైన మూర్ఛ వ్యాధిని తెలిపే లక్షణాలు. సాధారణంగా మూర్ఛ (ఎఫిలెప్సీయా) అనగానే సృహ తప్పి పడిపోవడం, కళ్లు తేలేయడం, గింజుకోవడం లాంటి లక్షణాలు గుర్తొస్తాయి.

ఇంకా చదవండి ...
ఏ కారణం లేకుండా హఠాత్తుగా నవ్వు వస్తుందా.. ఇలా వచ్చే నవ్వాపుకోలేక ఇబ్బంది పడుతున్నారా.. ఇవన్నీ ఒక రకమైన మూర్ఛ వ్యాధిని తెలిపే లక్షణాలు. సాధారణంగా మూర్ఛ (ఎఫిలెప్సీయా) అనగానే సృహ తప్పి పడిపోవడం, కళ్లు తేలేయడం, గింజుకోవడం లాంటి లక్షణాలు గుర్తొస్తాయి. కానీ నియంత్రణ లేకుండా నవ్వడం అనేది కూడా ఒక రకమైన మూర్ఛ వ్యాధే. దీన్నే గెలాస్టిక్‌ సీజర్స్‌ (Gelastic Seizure) అని పిలుస్తారు. ప్రతి 2 లక్షల మంది పిల్లలలో ఒకరు మాత్రమే ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఇలాంటి వింత న్యూరాలజికల్‌ డిజార్డర్ వ్యాధి బారిన పడింది ఓ మూడేళ్ల బాలిక. తాజాగా ఆ చిన్నారికి ఒక సర్జరీని విజయవంతంగా పూర్తి చేసినట్లు ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. మూడేళ్ల చిన్నారిలో ఈ వ్యాధి ఎలా వచ్చింది? సర్జరీ ఎలా చేశారు? తదితర విషయాలు ఇప్పుడు చూద్దాం.

గ్రేస్ అనే బాలిక తన బాల్యంలోనే వింతగా ఒక సమస్యతో బాధపడుతోంది. ఆరు నెలల ముందువరకు గ్రేస్ నెలలో కనీసం ఒక్కసారైనా అకారణంగా పది సెకన్ల పాటు నవ్వేది. ఆ తర్వాత నుంచి గ్రేస్ రోజులో ఐదారుసార్లు అదేపనిగా నవ్వడాన్ని తల్లిదండ్రులు గమనించారు. పదేపదే నవ్వడం.. ఆపమన్నా ఎవరో చక్కిలిగింతలు పెట్టినట్లు నవ్వడం చూసి కలవరపడ్డారు తల్లిదండ్రులు. ఈ క్రమంలో గ్రేస్ ఎడమ కంటిలో మెల్ల కూడా వచ్చింది. రానురాను ఈ సమస్య మరింత తీవ్రతరం కావడంతో వైద్యం కోసం ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. కానీ ఫలితం లేకపోయింది. చివరికి గ్రేస్ తల్లిదండ్రులు ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రిని ఆశ్రయించారు.

గ్రేస్ అసాధారణంగా నవ్వుతున్నప్పుడు కామినేని ఆసుపత్రి వైద్యులు మెడికల్ ఎగ్జామినేషన్ చేశారు. వారి వైద్యపరీక్షల్లో ఆమెకు గెలాస్టిక్‌ సీజర్స్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆమెకు హైపోథాలమస్‌లో హైపోథాలమిక్ హమార్టోమా అనే కణితి వల్ల గాయం అయినట్లు కనిపెట్టారు. సాధారణ కణజాలంతో పాటు కణాలు అసాధారణంగా కలిసిపోయి తయారైన కణితినే హైపోథాలమిక్ హమార్టోమా అని అంటారు.

Narendra Modi: మోదీ కాన్వాయ్​లో కొత్త లగ్జరీ కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు..!


ఐపోథాలమస్‌ మెదడులో మధ్య భాగంలో ఉండే చిన్న పార్ట్. ఇది శరీరాన్ని సమస్థితి (homeostasis)లో ఉంచేందుకు అన్ని హార్మోన్లను రిలీజ్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇది పిట్యూటరీ గ్రంథిని నియంత్రిస్తుంది. దీని పనితీరు మందగిస్తే గెలాస్టిక్‌ సీజర్స్‌ అని పిలిచే అన్‌కంట్రోలబుల్ లాఫ్టర్ (uncontrollable laughter)తో సహా రకరకాల డిజార్డర్స్ వస్తాయి. గెలాస్టిక్‌ సీజర్స్‌ వ్యాధి సాధారణంగా బాల్యంలో వస్తుంది. అప్పుడే పుట్టిన పిల్లల్లోనూ ఇది కనిపిస్తుంది. అయితే ఇలాంటి వ్యాధితో మూడేళ్ల గ్రేస్ బాధ పడుతోందని.. యాంటీ-సీజర్ మందులను తీసుకోవడం కూడా ప్రారంభించిందని వైద్యులు తెలుసుకున్నారు.

అనంతరం బాలిక సమస్యను కచ్చితంగా తెలుసుకునేందుకు న్యూరోసర్జన్, న్యూరోఫిజిషియన్, శిశువైద్యుడు, ఎండోక్రినాలజిస్ట్ బృందం లోతుగా పరిశీలించారు. హైపోథాలమస్‌లో కణితులు ఉన్నాయా లేదా పనితీరులో లోపం ఏర్పడిందా అనేది తెలుసుకునేందుకు బాలికకు హై ఎండ్ 3టీ ఎంఆర్‌ఐ స్కానింగ్ చేయించారు. ఈ పరీక్షలో హైపోథాలమస్‌లోని ఒక కణితి వల్ల పెద్ద నాళాలు.. దృష్టి, అదనపు కంటి కదలికలకు సంబంధించిన నరాలపై ఒక పెద్ద గాయం పెరుగుతూ పోతున్నట్లు కనుగొన్నారు. ఆ తర్వాత బాలిక మెదడులోని కణితిని ఒక అరుదైన శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు కామినేని ఆస్పత్రి వైద్యులు.

Army Land: ఆక్రమణకు గురైన ఆర్మీ భూములు.. తెలుగు రాష్ట్రాల్లో సైతం.. ఎన్ని వందల ఎకరాలు ఇలా ఆక్రమించారో తెలుసా..


"బాలిక తల్లిదండ్రులకు వ్యాధి, చికిత్సకు సంబంధించిన ఇతర పద్ధతుల గురించి వివరించాం. పేరెంట్స్ అనుమతి తీసుకున్నాక అనస్థీషియా ఇచ్చి నావిగేషన్‌ను ఉపయోగించి క్రానియోటమీ(పుర్రె ఎముకలో రంధ్రం) చేసి కణితిని తొలగించాం. దృష్టి, అదనపు కంటి కదలికలు, నాళాలకు బాధ్యత వహించే నరాలకు ఎలాంటి నష్టం కలగకుండా శస్త్రచికిత్స చేశాం. సర్జరీ తర్వాత బాలికలో మూర్ఛల సంఖ్య గణనీయంగా తగ్గింది” అని కామినేని హాస్పిటల్స్‌లోని మినిమల్ యాక్సెస్ బ్రెయిన్, స్పైన్ సర్జన్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ రమేష్ వివరించారు.
Published by:Veera Babu
First published:

Tags: Hyderabad, Trending news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు