HYDERABAD HYDERABAD CYBER CRIMINALS CHEATS WOMAN RS 50 LAKHS PRETEXT OF MARRIAGE SU
Hyderabad: జీవితంలో తోడు కోసం చూసిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని.. చివరకు రూ. 50 లక్షలు మోసపోయింది.. అసలేం జరిగిందంటే..
ప్రతీకాత్మక చిత్రం(Image-Youtube)
ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగినికి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే భర్త చనిపోవడంతో కూతురితో కలిసి జీవనం సాగిస్తుంది. అయితే జీవితంలో తోడు కోసం మళ్లీ చేసుకోవాలని భావించింది.
భర్త చనిపోయిన మహిళకు దగ్గరైన ఓ వ్యక్తి.. జీవితాంతం తోడుగా ఉంటానని చెప్పాడు. తాను ప్రస్తుతం విదేశాలలో ఉన్నానని.. నీకోసం భారత్‌కు వచ్చి ఉంటానని నమ్మించాడు. తీరా చూస్తే రూ. 50 లక్షలు దోచేశారు. ఇందుకు సంబంధించి బాధిత మహిళ.. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జూబ్లిహిల్స్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగినికి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆ దంపతులకు ఓ కుమార్తె కూడా ఉంది. అయితే భర్త చనిపోవడంతో కూతురితో కలిసి జీవనం సాగిస్తుంది. అయితే జీవితంలో తోడు కోసం మళ్లీ చేసుకోవాలని భావించింది. ఇందుకోసం మ్యాట్రిమోనీ సైట్లో ప్రకటన కూడా ఇచ్చింది.
ఈ క్రమంలోనే ఆమెకు విజయానంద్ పేరుతో ఓ వ్యక్తి పరిచమయ్యాడు. తాను బ్రిటన్‌లో ఉంటానని.. డాక్టర్‌గా పనిచేస్తున్నానని చెప్పాడు. ఆమెకు ఇష్టమైతే వివాహ చేసుకుంటానని చెప్పాడు. పెళ్లి కోసం ఇండియాకు వచ్చి.. ఇక్కడే ఉండిపోతానని నమ్మించాడు. పెళ్లి సంబంధించిన కొంత సామాగ్రి, గిఫ్ట్‌లు, నగదు పంపిస్తున్నానని ఆమెను మాయమాటలు చెప్పాడు.
అయితే అలా చెప్పిన రెండు రోజులకు ఆ మహిళకు.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కస్టమ్స్ ఆఫీసర్ రుబీనాఖాన్ మాట్లాడుతున్నానని బాధితురాలికి ఫోన్ వచ్చింది. ఫారిన్ కరెన్సీతో కూడిన పార్సిల్ వచ్చిందని మహిళకు చెప్పింది. పార్సిల్లో డాలర్లు ఉన్న కారణంగా.. వాటిని పొందడానికి ఆర్బీఐ నుంచి నో అబ్జెక్షన్, యాంటీ టెర్రరిస్ట్ సర్టిఫికెట్లు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పింది. అయితే ఆ మాటలు నమ్మిన మహిళ విడతల వారీగా ఆమెకు రూ. 50 లక్షలు చెల్లించింది. ఆ తర్వాత పార్సిల్ మాత్రం రాలేదు. ఆ తర్వాత మరిన్ని డబ్బుల కోసం ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడటంతో.. బాధిత మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.