హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad Crime News: హైదరాబాద్‌లో మరో దారుణం.. పట్టపగలే యువతిపై అత్యాచారం.. పోలీసులు ఏం చెప్పారంటే..

Hyderabad Crime News: హైదరాబాద్‌లో మరో దారుణం.. పట్టపగలే యువతిపై అత్యాచారం.. పోలీసులు ఏం చెప్పారంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఇటీవల గాంధీ ఆస్పత్రిలో అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఇటీవల గాంధీ ఆస్పత్రిలో అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా పట్టపగలే ఓ యువతిని దారి మళ్లించిన ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వరుస ఘటనలు ప్రస్తుతం నగరంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వివరాలు.. హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌ పరిధిలో నివసిస్తున్న యువతి (20) మైలార్‌దేవ్‌పల్లిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం మైలార్‌దేవ్‌పల్లికి వెళ్లేందుకు యువతి ఆటో ఎక్కింది. అయితే యువతి ఒక్కరే ఆటోలో ఉండటంతో.. డ్రైవర్ ఆటోను దారి మళ్లించాడు. ఆమె ఇదేమిటని అడగ్గా.. దగ్గరి దారి అంటూ నమ్మబలికాడు.

ఆ తర్వాత ఆటోను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. అయితే కొన్ని గంటలకు స్పృహలోకి వచ్చిన యువతి.. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. బాధిత యువతి ఇంకా షాక్‌లో ఉందని.. వివరాలు సక్రమంగా చెప్పలేకపోతుందన్నారు. ప్రస్తుతం బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించాం. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వాహించాల్సి ఉంది. ఆమెపై ఒక్కరే అత్యాచాం చేశారా?, సామూహిక అత్యాచారం జరిగిందా? అనేది తేలాల్సి ఉందన్నారు. ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.

ఆటో డ్రైవర్ ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. బాధితురాలు ఆటో ఎక్కిన చోటుతో పాటు.. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

First published:

Tags: Crime news, Hyderabad, RAPE

ఉత్తమ కథలు