Home /News /telangana /

HYDERABAD HYDERABAD CP ANJANI KUMAR INSPECTS VINAYAKA IDOL IMMERSION ARRANGEMENTS AT TANK BUND SU

మీ ఇంటి గణేష్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌లో నిమజ్జనం చేద్దామనుకుంటున్నారా? మీకో బ్రేకింగ్ న్యూస్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వినాయక నిమజ్జనాల సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌ వద్ద ఎంత సందడిగా ఉంటుందో అందరికి తెలిసిందే. ఈ ఏడాది కూడా మీ ఇంటి గణేష్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌లో నిమజ్జనం చేద్దామనుకుంటున్నారా?.. అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే..

    వినాయక నిమజ్జనాల(Vinayaka idol Immersion) సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌ వద్ద ఎంత సందడిగా ఉంటుందో అందరికి తెలిసిందే. నవరాత్రులు వినాయకుడిని ఎంతో భక్తి శ్రద్దలతో కొలిచిన భక్తులు.. ట్యాంక్‌ బండ్‌కు తీసుకొచ్చి నిమజ్జనం చేస్తుంటారు. నగరం నలుమూలల నుంచి వినాయక విగ్రహాలను నిమజ్జనం నిమిత్తం ట్యాంక్ బండ్‌కు తీసుకొనివస్తారు. ఇళ్లలో ప్రతిష్టించే చిన్న విగ్రహాలు మొదలు.. పెద్ద పెద్ద విగ్రహాలను కూడా ట్యాంక్ బండ్‌లో నిమజ్జనం చేసేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తారు. నగర శివారు ప్రాంతాల్లో వినాయక నిమజ్జనం చేసేందుకు కొన్ని అనువైన ప్రదేశాలు ఉన్నప్పటికీ.. చాలా మంది వినాయక విగ్రహాలను ట్యాంక్ బండ్‌ వద్ద నిమజ్జనం చేయాలని భావిస్తారు. ఈ క్రమంలోనే జనాలు కూడా వినాయ నిమజ్జనానికి చూసేందుకు భారీగా ట్యాంక్ బండ్ వద్దకు తరలివస్తారు.

    అయితే ఈ ఏడాది ట్యాంక్ బండ్‌ వద్ద వినాయక నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి పోలీసులు కీలక సూచనలు చేశారు. కేవలం పెద్ద విగ్రహాలకు మాత్రమే ట్యాంక్ బండ్‌కు అనుమతి ఉంటుందని హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ స్పష్టం చేశారు.

    సోమవారం ట్యాంక్ బండ్‌పై(Tank Bund) వినాయక నిమజ్జనానికి సంబంధించి పోలీసులు చేస్తున్న ఏర్పాట్లను సీపీ అంజనీకుమార్ పరిశీలించారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన సుందరీకరణ దెబ్బతినకుండా ట్రయల్ రన్‌ను పోలీసులు నిర్వహించారు.గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని సీపీ అంజనీకుమార్(CP Anjani Kumar) చెప్పారు. త్వరగా నిమజ్జనం చేసేందుకు ఆటోమేటిక్‌ ఐడల్‌ రిలీజ్ సిస్టమ్‌ను వాడుతున్నామని వెల్లడించారు. ట్యాంక్ బండ్ పై ఈ సారి క్రేన్ల సంఖ్య తగ్గిస్తున్నామని ఆయన తెలిపారు.కేవలం పెద్ద విగ్రహలకు మాత్రమే ట్యాంక్ బండ్ పైకి అనుమతి ఇస్తామని చెప్పారు. ఈ సారి ట్యాంక్‌బండ్‌పై క్రేన్ల సంఖ్యను తగ్గిస్తున్నట్లు చెప్పారు. ట్యాంక్‌బండ్‌పై 16, ఎన్‌టీఆర్‌ మార్గ్‌లో 12, పీపుల్స్‌ ప్లాజాలో 8 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

    ఇక, ఇది చిన్న విగ్రహాలను ఏర్పాటు చేసేవారికి, ఇళ్లలోనే వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేస్తున్నవారికి ఇది కొద్దిగా షాకింగ్ వార్తేనని చెప్పాలి. ఎందుకంటే కేవలం పెద్ద విగ్రహాలకు మాత్రమే ట్యాంక్ బండ్‌కు అనుమతి ఉంటుందని సీపీ అంజనీకుమార్ వెల్లడించిన.. మరి చిన్న విగ్రహాల నిమజ్జనం ఎక్కడ చేయాలనే ప్రశ్న పలువురిని వెంటాడుతోంది.

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Ganesh immersion, Hyderabad, Tank Bund, Vinayaka Chaviti

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు