Samantha : కోర్టులో సమంతకు షాక్ -ఆమె లాయర్‌కు జడ్జి క్లాస్ -naga chaitanyaతో విడాకులపై రచ్చతో..

(photo credit mirchi 9)

అక్కినేని వారసుడు నాగ చైతన్యతో విడాకుల తర్వాత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటూనే, ట్రోలర్లపై న్యాయపోరాటానికి దిగింది నటి సమంత. తన విడాకులపై తప్పుడు ప్రచారాలు చేసిన రెండు యూట్యూబ్ చానళ్లతోపాటు ప్రముఖ డాక్టర్ వెంకట్ రావుపైనా ఆమె పరువునష్టం దావా వేశారు. ఆ పిటిషన్ ను కూకట్ పల్లి కోర్టు విచారణకు స్వీకరించింది. కానీ కోర్టులో ఆమెకు చిన్నపాటి షాక్ తగిలింది. సమంత తరఫు లాయర్ పైనా జడ్జిలు కస్సుమన్నారు..

  • Share this:
పరువునష్టం దావా వ్యవహారంలో నటి సమంతకు చేదు అనుభవం ఎదురైంది. నాగ చైతన్యతో విడాకుల వ్యవహారానికి సంబంధించి తప్పుడు ప్రచారాలు చేశారంటూ రెండు యూట్యూబ్ చానెళ్లు, డాక్టర్ వెంకట్ రావుపై సమంత కోర్టుకు ఎక్కిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత ప్రతిష్టకు, వ్యక్తిత్వానికి భంగం కలిగేలా అబద్దాలను ప్రచారం చేసిన సదరు వ్యక్తులు, చానెళ్లపై క్రిమినల్ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కూడా సమంత తన పిటిషన్ లో కోరింది. సదరు పిటిషన్ ను కూకట్ పల్లి కోర్టు గురువారం విచారణకు స్వీకరించింది. కానీ..

యూట్యూబ్ చానళ్లు, డాక్టర్ వెంకట్రావులపై పరువు నష్టం దావా పిటిషన్ ను అత్యవసరంగా విచారించడం కుదరదని కూకట్ పల్లి కోర్టు స్పష్టం చేసింది. నటిగా సమంత చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఆమె కేసును కోర్టు ఎమర్జెన్సీ ప్రాతిపదికన విచారించాలని సమంత తరఫు న్యాయవాది బాలాజీ కోరడంతో ఈ మేరకు జడ్జిలు స్పందించారు.

సమంత దాఖలు చేసిన పరువునష్టం పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలన్న ఆమె తరఫు లాయర్ బాలాజీపై కూకట్ పల్లి కోర్టు జడ్జి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసును ఎమర్జెన్సీ విచారణ కోసం లాయర్ చెప్పిన కారణాలతో జడ్జి విభేదించారు. ‘‘కోర్టులో, చట్టం ముందు అందరూ సమానులే. కొందరు ఎక్కువ, ఇంకొందరు తక్కువ అనే భావన ఉండదు. మీ(సమంత) కేసును ప్రొసీజర్ ప్రకారమే విచారిస్తాం. మిగతా పరువునష్టం కేసుల మాదిరిగానే వాదనలు వింటాం. దీనిని అత్యవసర కేసుగా టేకప్ చేయబోము..’అని జడ్జి పేర్కొన్నారు.
Published by:Madhu Kota
First published: