Home /News /telangana /

HYDERABAD HYDERABAD COURT HAS SENTENCED A PAINTER TO LIFE IMPRISONMENT FOR RAPING PSYCHIATRIST 9 YEARS AGO SNR

OMG:దివ్యాంగురాలిని కూడా వదల్లేదు ఆ కామాంధుడు..ఇక వాడు లైఫంతా అక్కడ గడపాల్సిందే

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Hyderabad: హైదరాబాద్‌లో తొమ్మిదేళ్ల క్రితం ఓ దివ్యాంగురాలిపై అత్యాచారం చేశాడో కామాంధుడు. నేరం చేసినట్లు నిరూపించడానికి కొంత టైమ్ పట్టింది. నేరం రుజువు కావడంతో అతడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది.

ఆ కామాంధుడికి కళ్లు మూసుకుపోయాయి. మదమెక్కిన స్థితిలో ఏం చేస్తున్నాడో తెలియలేదు. క్షణిక ఆనందం కోసం ఓ దివ్యాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ hyderabad లో ఇంతటి దారుణానికి ఒడిగట్టిన కామోన్మాదికి కోర్టు జీవిత ఖైదు విధించింది. దేవుడిచ్చిన అందమైన జీవితాన్ని ఆనందంగా గడపటం చేతకాని ఓ మూర్ఖుడు మానసికస్థితి సరిగా లేని ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సరిగ్గా తొమ్మిది సంవత్సరాల క్రితం అంటే 2013లో సరూర్‌నగర్‌ saroornagar పరిధిలోని భూపేష్‌గుప్తానగర్‌ bupesh guptha nagarకి చెందిన షేక్‌బాబా shaik baba వెయింటింగ్‌ వర్క్ చేస్తుండేవాడు. ఒక రోజు పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ meerpet police stationసమీపంలో మితిస్థిమితం లేని 28సంవత్సరాల మహిళ కనిపించడంతో పెయింటర్‌ కాస్తా కామాంధుడి అవతారమెత్తాడు. ఆమె ప్రతిఘటిస్తున్నా పట్టించుకోకుండా ఆమెపై అత్యాచారం చేశాడు. తొమ్మిదేళ్ల క్రితమే నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నేరం నిరూపించేందుకు తగిన సాక్ష్యాధారాల సేకరించారు పోలీసులు. షేక్‌బాబా ఓ దివ్యాంగురాలిపై అత్యాచారం చేసిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేశారు. అభియోగపత్రాలను కోర్టులో సమర్పించారు. అత్యాచార కేసును విచారణ చేపట్టిన 7వ అదనపు ప్రత్యేక సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జయలక్ష్మి నిందితుడు నేరం చేసినట్లుగా నిర్దారించారు. కామాంధుడు షేక్‌బాబాకు జీవిత ఖైదు విధించింది. జైలుశిక్షతో పాటు 10వేల రూపాయలన జరిమానా విధించినట్లుగా అదనపు పీపీ శేరిప్రతాప్‌రెడ్డి వెల్లడించారు.

9ఏళ్ల తర్వాత వాడి పాపం పండింది..
సమాజంలో కిరాతకాలు, అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఉన్మాదులు, కామాంధుల నేరచరిత్ర ఆలస్యంగానైనా బయటపడుతున్నాయి. అలాంటి వాళ్లకు న్యాయస్థానాలు కూడా కఠిన శిక్షలు విధిస్తూ తీర్పులు ఇస్తున్నాయి. సరూర్‌నగర్‌లో పదేళ్ల క్రితం జరిగిన ఓ అత్యాచారం కేసులో పెయింటర్‌ షేక్‌బాబా విషయంలో అదే జరిగింది.

కామాంధులకు జీవితఖైదే కరెక్ట్..
సమాజంలో దిక్కు, మొక్కులేని వాళ్లపై, మానసిక పరిస్థితి సరిగా లేని వాళ్లపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడిన వారికి న్యాయస్థానాలు జీవిత ఖైదు విధించడం సరైన నిర్ణయమని స్థానికులు అంటున్నారు. భవిష్యత్తులో మరెవరూ ఇలాంటి దురాగతాలకు పాల్పడకుండా ఉండేలా కఠినమైన చట్టాలు తేవాలని..నేరస్తులకు మరణశిక్ష లాంటివి విధించాలని డిమాండ్ చేస్తున్నాయి మహిళా సంఘాలు.
Published by:Siva Nanduri
First published:

Tags: Hydarabad, Rape case

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు