హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: సిటీలో మరో రెండు షీ షటిల్ బస్సు.. మహిళలకు పూర్తిగా ఉచితం

Hyderabad: సిటీలో మరో రెండు షీ షటిల్ బస్సు.. మహిళలకు పూర్తిగా ఉచితం

షీ షటిల్ బస్సులను ప్రారంభించిన డీజీపీ

షీ షటిల్ బస్సులను ప్రారంభించిన డీజీపీ

Hyderabad: 2015లో ఒక్క బస్‌తో ప్రారంభమైన షీ షటిల్స్‌ బస్సులు.. ప్రస్తుతం 17కు చేరుకున్నాయని ది సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ జనరల్‌ సెక్రటరీ కృష్ణ ఏదుల హర్షం వ్యక్తం చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్ (Hyderabad) సిటీలో మహిళల భద్రత కోసం మరో రెండు షీ షటిల్ బస్సు (She shuttle Buses) సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. శుక్రవారం రాయదుర్గం జేఆర్ సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఉమెన్స్ కాంక్లేవ్ అండ్ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డీజీపీ అంజనీ కుమార్.. పోలీసు ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు. సైబరాబాద్‌లో మహిళల భద్రత కోసమే షీ షటిల్ బస్సులను నడుపుతున్నామని ఆయన అన్నారు. త్వరలో మరిన్ని బస్సులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బస్సులను తయారు చేశారని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. మహిళలకు అన్ని సౌకర్యాలు ఉండేటట్లు ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ బస్సుల్లో ఆడవాళ్ళు ఉచితంగా, సురక్షితంగా ప్రయాణించవచ్చని... మహిళ భద్రతకోసం బస్సులో ఓ సెక్యూరిటీగార్డు కూడా ఉంటారని వెల్లడించారు. నగరంలోని మహిళలు ఈ బస్సులను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.

పెళ్లి బరాత్‌లో డాన్స్ చేస్తూ కుప్పకూలిన మహిళ.. డీజే సౌండే కారణం.

2015లో ఒక్క బస్‌తో ప్రారంభమైన షీ షటిల్స్‌ బస్సులు.. ప్రస్తుతం 17కు చేరుకున్నాయని ది సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ జనరల్‌ సెక్రటరీ కృష్ణ ఏదుల హర్షం వ్యక్తం చేశారు. మొన్నటి వరక 15 బస్సులు ఉన్నాయి. ఇప్పుడు మరో రెండు బస్సులను ప్రారంభించడంతో.. మొత్తం షీ షటిల్ బస్సుల సంఖ్య 17కి చేరింది. రాయదుర్గం, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాలతో పాటు మహిళలు ఎక్కువగా పనిచేసే పలు ప్రాంతాల్లో ఈ బస్సులు నడుస్తున్నాయి.

సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో డీజీపీ ముఖ్య అతిధి కాగా, సీపీ స్టీఫెన్ రవీంద్ర, SCSC సెక్రటరీ కృష్ణ ఏదుల, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

First published:

Tags: Hyderabad, Local News, Telangana

ఉత్తమ కథలు