HYDERABAD HYDERABAD BIRYANI NEW RECORED IN ONE MINUTE 115 ORDERS THIS IS THE TOP PLACE NGS BK
Biryani: హైదరాబాద్ బిర్యానీ మరో అరుదైన రికార్డ్..! నిమిషానికి 115 ఆర్డర్లతో టాప్ ప్లెస్
టాప్ ప్లేస్ లో హైదరాబాద్ బిర్యానీ
Hyderabad Biryani: హైదరాబాద్ అంటే అందరికి ముందుగా గుర్తు వచ్చేది బిర్యానీనే.. కమ్మని నోరు ఊరించే బిర్యానీకి ఫ్యాన్ అవ్వని వారు ఉండరేమో.. అందుకే అంత గుర్తింపు.. తాజాగా మన బిర్యానీ మరో రికార్డు క్రియేట్ చేసింది. ఆ రికార్డు ఏంటో తెలుసా..?
Hyderabad Biryani: హైదరాబాద్ బిర్యానీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అసవరం లేదు.. ఏ ప్రముఖులు నగరానికి వచ్చినా.. లేదా ఎవరి నోటైనా వేరే చోట హైదరాబాద్ (hyderabad) మాట వస్తే.. ముందుగా వినిపించేది బిర్యానీ (Biryani) గురించి మాత్రమే.. తాజాగా మన చికెన్ బిర్యాని (Chicken Biryani) మరో అరుదైన రికార్డ్ ను సొంత చేసుకుంది. ఇప్పటికే హైదరాబాద్ బిర్యానీకి ఏ రేంజ్ లో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారో తెలిసిందే. ఎవరైన దీని రుచికి ఫిదా అవాల్సిందే. ఇప్పుడు మన నిజాం బిర్యానీ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. స్విగ్గీ (Swiggy)ఆరో వార్షిక రిపోర్ట్ ప్రకారం దేశంలో అత్యంత ఎక్కువ ఆర్డర్ ఇచ్చిన డిష్ గా మన హైదరాబాద్ బిర్యానీ నిలిచింది.
స్విగ్గీ తాజా నివేధిక ప్రకారం, హైదరాబాద్ నుండి ఆర్డర్ చేయబడిన టాప్ డిష్ ల్లో చికెన్ బిర్యానీ మొదటి స్థానంలో ఉండగా తర్వాత చికెన్ 65, పనీర్ బటర్ మసాలా, మసాలా దోస మరియు ఇడ్లీ లు ఉన్నాయి. 2020లో నిమిషానికి 90 బిర్యానీలు ఆర్డర్ చేయగా, ఈ ఏడాది నిమిషానికి 115 బిర్యానీలు అంటే సెకనుకు 2 (1.91) బిర్యానీలను ఆర్డర్లు బిర్యానికి వచ్చాయని స్విగ్గీ తన రిపోర్ట్ లో పెర్కొంది.
శాఖాహారం కంటే 4.3 రెట్లు ఎక్కువగా బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు తెలుస్తోంది. చికెన్ బిర్యానీ 4.25 లక్షల మంది కొత్త యూజర్లతో స్విగ్గీని ఆర్డర్ చేయడంతో అగ్రస్థానంలో ఉంది. చెన్నై, కోల్‌కతా, లక్నో, హైదరాబాద్‌లలో చికెన్ బిర్యానీ అత్యంత ఎక్కువ ఆర్డర్ల తో అగ్రస్థానంలో ఉందని స్విగ్గీ ఒక ప్రకటనలో తెలిపింది.
స్నాక్స్ పరంగా, సమోసా స్విగ్గీలో 5 మిలియన్ ఆర్డర్లతో ముందు వరసలో ఉండగా, దేశీ సమోసా చికెన్ వింగ్స్ కంటే ఆరు రెట్లు ఎక్కువ ఆర్డర్ చేయబడింది పావ్ భాజీ 2.1 మిలియన్ ఆర్డర్లతో భారతదేశానికి రెండవ ఇష్టమైన స్నాక్ గా నిలిచింది. చీజ్ గార్లిక్ బ్రెడ్, పాప్‌కార్న్, ఫ్రెంచ్ ఫ్రైస్ తరువాత స్థానంలో ఉన్నాయి.
స్వీట్ కేటగిరిలో, గులాబ్ జామున్ 2.1 మిలియన్ ఆర్డర్లతో స్విగ్గీలో అత్యధికంగా ఆర్డర్ చేసిన డెజర్ట్‌గా నిలవగా తర్వాత రస్మలై 1.27 మిలియన్ ఆర్డర్లతో రెండో స్థానంలో నిలిచింది. స్వీగ్గీ ప్రతి ఏడాది తమకు వచ్చిన ఆర్డర్లల్లో అత్యధికంగా ఏ డిష్ ను వినియోగదారులు ఆర్డర్ చేస్తోన్నారు అనేదానిపై రిపోర్ట్ ను విడుదల చేస్తోంది.
గత ఏడాది విడుదల చేసిన నివేదికలో కూడా బిర్యానీ టాప్ ప్లెస్ లో నిలబడగా ఈ ఏడాది కూడా మళ్లీ బిర్యానీ టాప్ ప్లెస్ లో మొదటి వరసలో ఉంది. దీంతో బిర్యానీని మన వాళ్లే కాకుండా దేశవ్యాప్తంగా ఎంత మంది ఇష్టపడుతున్నారో అర్ధమవుతుంది. ఇప్పటికే బిర్యానీకి చాలా అరుదైన గౌరవాలు దక్కాయి. తాజాగా దీంతో ఇప్పుడు మరోసారి బిర్యానీ వార్తల్లో నిలిచిందనే చెప్పుకోవాలి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.