బిజీ లైఫ్‌లో ఉన్న జనం తొందరగా ఆఫీసులకు..ఇళ్లకు వెళ్లేందుకు ఆన్ లైన్లో వస్తున్న సర్వీసుల్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. దూరప్రాంతాలకు వెళ్లాంటే.. ఇంటి నుంచి బస్టాపులు, ఆటో స్టాండ్లు దూరమైతే.. ఆన్ లైన్ క్యాబ్ సర్వీసులు బుక్ చేసుకుంటున్నారు. క్యాబులు, ఆటోలతో పాటు.. బైక్ రైడ్స్ కూడా బుక్ చేసుకుంటున్నారు. అయితే కొందరు దీన్ని ఆసరాగా చేసుకొని బైక్ ఎక్కుతున్న మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. హైదరాబాదులో ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న ఓ మహిళా ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
కేసు వివరాల ప్రకారం.. మణికొండలోని ఓ కంపెనీలో కంటెంట్ క్రియేటర్‌గా పనిచేస్తున్న మహిళ సోమవారం ఉదయం బంజారాహిల్స్ సమీపంలోని తన నివాసానికి తిరిగి వస్తుండగా రైడ్ అగ్రిగేటర్ యాప్ ద్వారా బైక్ రైడ్ బుక్ చేసుకుంది. మహిళ బైక్‌పై కూర్చున్న కొన్ని నిమిషాల తర్వాత, టాక్సీ డ్రైవర్ ఆమెను అనుచితంగా తాకడం ప్రారంభించాడు. బైక్ కదులుతున్నప్పుడు ఆమెను పట్టుకున్నాడు. బైక్ జూబ్లీహిల్స్ ప్రశాంత్ నగర్ మీదుగా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
దీంతో ఆ మహిళ ఒక్కసారిగా కేకలుపెట్టడంతో ఖంగుతిన్న బైక్ డ్రైవర్ ఆమెను ప్రశాంత్ నగర్ వద్ద వదిలేసి వేగంగా వెళ్లిపోయాడు. ఈ ఘటనతో కంగుతిన్న బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించి డ్రైవర్‌పై ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్‌పై లైంగిక వేధింపులు, ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bike rides, Crime news, Hyderabad, Local News