HYDERABAD HYDERABAD BASED COMPANY HAVE CREATED AN APP TO CHECK THE STATUS OF WATER IN WATER BOWLS FOR BIRDS FULL DETAILS HERE BA PRV
Birds Save: పక్షుల దాహార్తిని తీర్చడానికి హైదరాబాద్ యువకుల అద్భుత సృష్టి.. వాళ్లు చేసిన పనికి సెల్యూట్ చేయాల్సిందే..
ప్రతీకాత్మక చిత్రం
ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న యాప్ (Apps) లన్ని మన అవసరాలు తీర్చడానికి మనం రూపోందించుకున్నవే కాని ఈ యువకులు మాత్రం కాస్త వెరైటీగా ఆలోచించారు. వేసవిలో జంతువులు, పక్షులు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు ఒక వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు.
పక్షులు (Birds) దాహర్తిని తీర్చడానికి ఈ యువకులు చేసిన పనేంటో తెలిస్తే మీరు సెల్యూట్ చేయక మానరు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న యాప్ (Apps) లన్ని మన అవసరాలు తీర్చడానికి మనం రూపోందించుకున్నవే కాని ఈ యువకులు మాత్రం కాస్త వెరైటీగా ఆలోచించారు. వేసవిలో జంతువులు, పక్షులు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు ఒక వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. వేసవిలో అనేక NGOలు, సంఘాలు, చాలా మంది జంతు ప్రేమికులు పక్షకులు, జంతువుల కోసం కోసం అక్కడక్కడ వాటర్ బౌల్స్ (Water Bowls) ను ఉంచుతారు. అయితే ఒక్కసారి వాటర్ వాటిలో నింపుతారు తప్ప తరువాత అందులో నీరు ఉందా లేదా అనే విషయమే మర్చిపోతుంటారు. అయితే ఇదే సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ (Hyderabad)కు చెందిన బెస్ట్టెట్ టెక్నాలజీస్ ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టుంది. ఇలా ఏర్పాటు చేసిన నీళ్ల తొట్టిల (Water Bowls) లో నీరు ఉందా లేదా? ఎప్పుడు వాటిని రీఫిల్ చేయాలి అనే అంశాలను సూచించే యానిమల్ వాటర్ బౌల్స్ ఆఫ్ ఇండియా (Animal Water Bowls of India) అనే మొబైల్ యాప్ను రూపొందించింది.
యాప్ స్టోర్ (App store) లో బౌల్ యాప్ (Bowl app) అనే పేరుతో దీన్ని అందుబాటులో ఉంచారు. బయట మనం ఏర్పాటు చేసి నీళ్ల తొట్టిలు GPS తో ట్రాక్ చేయబడుతుంది. ఇది ప్రతి 24 గంటలకు మంచినీటితో ఉన్న బౌల్స్ కు సంబంధించిన సమాచారం మన ఫోన్ లో అందిస్తుంది. దీంతో మనకు దగ్గర ఉన్న నీళ్ల తొట్టిలో మనమే నీరు మళ్లీ నింపే వెసులుబాటు కల్పిస్తోంది ఈ యాప్.
"జంతువులకు, పక్షులకు ప్రతిరోజూ నీరు అవసరం. చాలా మంది ప్రజలు తమ నీటి గిన్నెలను రీఫిల్ చేయడం మరచిపోతారు. మనం వాటిని రీఫిల్ చేయకపోతే వాటిని అలా ఉంచే ఉద్దేశానికే అర్ధముండదు. వివిధ ప్రాంతాలలో జంతు ప్రేమికులు లేదా ఇతర వ్యక్తులు వారు సొంతగా ఏర్పాటు చేసిన నీళ్ల తొట్టిలు ఈ యాప్ (App) లో నమోదు చేసుకుంటే వాటికి సంబంధించిన సమాచారం దగ్గర్లో ఉన్న యాప్ లో నమోదు చేసుకున్న వ్యక్తులకు తెలియచేస్తోంది ఈ యాప్. దీంతో వాళ్లు ఆ నీళ్ల తొట్టిలను రీఫిల్ చేయడానికి వీలవుతుందని బెస్ట్టెట్ టెక్నాలజీస్ CEO అశోక్ గంటాల (Ashok gantala) న్యూస్ 18 (News 18) కి చెప్పారు.
యాప్
"ఎన్జీఓలతోపాటు ప్రజలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఈ నీళ్ల తొట్టిలు ఏర్పాటు చేసి ఉంటారు. ఒకటి రెండురోజులు వాటిల్లో నీటిని నింపిన మళ్లీ వాటిని పట్టించుకోవడం వాళ్లకు కుదరకపోవచ్చు. దీంతో మేం ఇలా ఏర్పాటు చేసి వాటర్ బౌవుల్స్ బాధ్యతను మరో జంతు ప్రేమికుడికి మా యాప్ ద్వారా అందిస్తాం. ఇదొక్కటే కాకుండా ఎక్కువ ప్రాంతాల్లో ఈ వాటర్ బౌల్స్ను ఇన్స్టాల్ చేయడమే ప్రాథమిక లక్ష్యం. కేవలం వేసవిలో మాత్రమే కాకుండా ఏడాది పొడవునా మంచినీరు అవసరం. వేసవి తర్వాత నీటిని రీఫీల్ చేయనప్పుడు దోమలు వృద్ధి చెందుతాయి. గిన్నెలను క్రమం తప్పకుండా నింపడం వల్ల దోమల వంటివి ఆగిపోతాయి. దీంతో పాటు పక్షులు జంతువులకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించబడుతుంది” అని బెస్ట్టెట్ ఐటి హెడ్ అనుష్క చిబ్బర్ అన్నారు. యానిమల్ వాటర్ బౌల్స్ ఆఫ్ ఇండియాను బెస్ట్టెట్ టెక్నాలజీస్లోని నలుగురు సభ్యుల బృందం జంతు సంక్షేమానికి అభివృద్ధి చేసింది. యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.