• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • HYDERABAD HYDERABAD BASE TIFFIN CENTER COOKING FAMOUS IDLY RECIPE WHICH IS EQUALLY FAMOUS WITH HYDERABADI BIRYANI FULL DETAILS HERE PRN BK

Idly vs Biryani: ఇక్క‌డ ఇడ్లీ తింటే మీరు వ‌ద‌ల‌రు..! బిర్యానీకి పోటీనిస్తున్న ఇడ్లీ

Idly vs Biryani: ఇక్క‌డ ఇడ్లీ తింటే మీరు వ‌ద‌ల‌రు..! బిర్యానీకి పోటీనిస్తున్న ఇడ్లీ

హైదరాబాద్ లో ఫేమస్ అవుతున్న ఇడ్లీ

ఇన్నాళ్లూ హైదారాబాద్ అంటే బిర్యానీకి (Hyderabadi Biryani) కేరాఫ్ అడ్రస్ గా ఉండేది.. ఇప్పుడు మరో వంటకం దీనికి పోటీనిస్తోంది.

  • Share this:
    హైద‌రాబాద్ అంటే అంద‌రికి గుర్తొచ్చేంది ఏంటీ? ఇంకేముంటుంది బిర్యానీ క‌దా అంటారా? అవును అయితే ఇప్పుడు ఆ జాబీతాలో ఇడ్లీ కూడా చేరిపోయింది. ఏంటీ ఇడ్లీ అంటే చెన్నై క‌దా హైద‌రాబాద్ అంటున్నారేంటీ అనుకుంటున్నారా? అయితే మీరు ఒక్క‌సారి ఈ ఇడ్లీ తింటే మేము ఎందుకు చెప్పుతున్నామో మీకే తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు బిర్యానీకి కేరాఫ్ అడ్ర‌స్ గా ఉన్న హైద‌రాబాద్ ఇప్పుడు ఒక్క మంచి ఇడ్లీకి కూడా కేరాఫ్ అడ్ర‌స్ గా మారింది. మార్వ‌డీ కుటుంబం చేస్తోన్న ఈ ఇడ్లీల‌కు ఇప్పుడు హైద‌రాబాద్ లో భ‌లే గిరాకీ ఉంది. ఈ ఇడ్లీ టేస్ట్ చూడాలంటే మీరు నారాయ‌ణ గూడాలో ఉన్న రామ్ భరోసే భాత్త‌డ్ కా ఇడ్లీ టిఫిన్ సెంట‌ర్ కి వెళ్లాల్సిందే. ప్లేట్ కి నాలుగు ఇడ్లీలు, కారం పొడీ, నెయ్యితో పాటు ప‌ల్లి చెట్నీతో వీళ్లు ఇచ్చే ఇడ్లీకి సామాన్యులే కాదు సెల‌బ్రేటీలు కూడా ప‌డి చ‌స్తారు. భాత్త‌డ్ కా ఇడ్లీ అంటే ఇప్పుడు హైద‌రాబాద్ బిర్యానీ త‌రువాత అంత‌టి క్రేజ్ సంపాధించికుంది.

    ఇక్క‌డ చాలార‌కాల టిఫిన్లు దొరికిన‌ప్ప‌టికి ఇక్క‌డి ఇడ్లికి ఉండే క్రేజ్ అంతింతా కాద‌నే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇక్క‌డ ఇడ్లీ తిన‌డానికే హైద‌రాబాద్ లో ఉన్న ఇత‌ర ప్రాంతాల నుంచి ఇక్క‌డ వ‌స్తారంటే మీరే అర్ధం చేసుకోవాచ్చు. 1990 లో మీనా లాల్ భాత్త‌డ్, గోవిందా లాల్ ప్రారంభించారు. వారి త‌ద‌నంత‌రం కూడా వారి పిల్ల‌లు ఇదే టిఫెన్ సెంట‌ర్ ను కొన‌సాగిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ టిఫెన్ సెంట‌ర్ అవుట్ లెట్ లు న‌గ‌రంలో ఇత‌ర ప్రాంతాల్లో కూడా పెట్ట‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. దాదాపు ఇక్క‌డ 70 ర‌కాల దోశ‌లు దొరికుతున్నప్ప‌టికి అంద‌రూ ఇక్క‌డ ఇడ్లీల కోస‌మే వ‌స్తార‌ని అంటున్నారు టిఫెన్ సెంట‌ర్ నిర్వ‌హకులు.

    “1990లో మా తాత‌గారు ఈ టిఫెన్ సెంట‌ర్ మొద‌లుపెట్టిన‌ప్పుడు కేవ‌లం ప‌కోడి మాత్రం అమ్మేవారు. త‌రువాత కొన్ని రోజుల‌కు టిఫెన్స్ కూడా స్టార్ట్ చేయాల‌ని డిసైడ్ తొలిత ఇడ్లీ తో స్టార్ట్ చేశారు. అప్ప‌టి నుంచి మా ఇడ్లీకి మంచి గీరాకి ఉండేది. మా తాత గారు స్వ‌యంగా వంట చేస్తున్నారంటే కస్టమర్లు క్యూలో ఉండేవారు..అంత ప్ర‌త్యేక‌త ఆయ‌న చేతికుంది. అదే రుచిని ఇప్పుడు మేము కూడా అందిస్తున్నాం. అందుకే మా ద‌గ్గ‌ర చాలా ర‌కాల టిఫెన్లు ఉన్న ఇడ్లీ కే ఎక్కువ డిమాండ్ అది తిన‌డానికే ఎక్క‌డ నుంచో వ‌స్తుంటారు” అని నిర్వాహకులు చెప్తున్నారు.

    ఈ టిఫినె సెంటర్ కు కేవ‌లం సామాన్యూలు మాత్ర‌మే కాకుండా సినిమా, పొలిటిక‌ల్ సెల‌బ్రేటీలు కూడా ఇక్క‌డ నుంచి ఇడ్లీలు తెప్పించుకుంటారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ షూటింగ్ కోసం ఎప్పుడు హైద‌రాబాద్ వచ్చినా.. ఇక్క‌డ నుంచే ఇడ్లీలు తీసుకొని వెళ్లాతారని యోగేశ్ మీనా లాల్ మనవడు న్యూస్ 18 కి తెలిపారు. సో మీరు కూడా ఈ టిఫిన్ సెంటర్ కు వెళ్లి ఇడ్నీ టేస్ట్ చేసేయండి..!
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు