హైదారబాద్‌లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా దీని గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇక ఎక్కడైనా ఏమైనా రోడ్డు పనులు జరిగినా.. ఫ్లైఓవర్లు నిర్మించినా.. ట్రాఫిక్ మరింత పెరిగిపోతుంది. అటు వైపుగా వెళ్లే వాహనాలకు ఇబ్బందులు తప్పవు. ఆ రోడ్లను క్లోజ్ చేస్తూ.. ట్రాఫిక్‌ను డైవర్ట్ చేస్తుంటారు ట్రాఫిక్ పోలీసులు. అయితే తాజగా నగరంలోని అంబర్‌పేటలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో గాంధీ విగ్రహం వద్ద నుంచి అంబర్‌పేట టీ జంక్షన్ వరకు రోడ్డు మూసేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఈ రోడ్డుల మూసివేత నేటి నుంచి మార్చి 10వ తేదీ వరకు ఉండనుంది. అంటే దాదాపు 40 రోజుల పాటు అటువైపు రోడ్లన్నీ క్లోజ్ కానున్నాయి. ఆ రూట్‌లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. గాంధీ విగ్రహం నుంచి 6 నంబర్ బస్టాప్ వరకూ వెళ్లే మార్గంలో (ఒకవైపు) వాహనాలను అనుమతించకుండా ఆంక్షలు విధించారు. ఇటు ఉప్పల్ వైపు నుంచి 6 నంబర్ బస్టాప్ మీదుగా చాదర్‌ఘాట్ వెళ్లే భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు హబ్సిగూడ క్రాస్‌రోడ్స్ నుంచి తార్నాక, ఉస్మానియా వర్సిటీ, అడిక్‌మెట్ ఫ్లైఓవర్, విద్యానగర్, ఫీవర్ దవాఖాన, బర్కత్‌పురా, నింబోలి అడ్డా వైపునకు వాహనాలను మళ్లించనున్నారు అధికారులు.
ఇక ఇదే మార్గంలో వెళ్లే సిటీ బస్సులు, సాధారణ వాహనాలను గాంధీ విగ్రహం నుంచి ప్రేమ్ సదన్ బాయ్స్ హాస్టల్, సీపీఎల్ అంబర్‌పేట్ గేట్, అలీఖేఫ్ క్రాస్‌రోడ్స్,. 6 నంబర్ బస్టాప్, గోల్నాక, నింబోలి అడ్డా మీదుగా చాదర్‌ఘాట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఛే నంబర్ బస్టాప్ వైపు నుంచి ఉప్పల్ వైపు వెళ్లే అన్ని వాహనాలను అధికారులు అనుమతించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.