హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad to Karachi flight: హైదరాబాద్ నుంచి కరాచీ వెళ్లిన ఫ్లైట్​లో ఎవరున్నారు? అధికారులు ఏమంటున్నారు?

Hyderabad to Karachi flight: హైదరాబాద్ నుంచి కరాచీ వెళ్లిన ఫ్లైట్​లో ఎవరున్నారు? అధికారులు ఏమంటున్నారు?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైద‌రాబాద్ (Hyderabad) నుంచి క‌రాచీ (karachi) వెళ్లిన చార్ట‌ర్ ప్లైట్ ఇపుడు ఇరు దేశాల్లో హాట్​ టాపిక్​గా మారింది. అయితే ఆ విమానంలో వెళ్లిన ఫ్లైట్​లో 12 మంది ఉన్నట్లు సమాచారం

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  హైద‌రాబాద్ (Hyderabad) నుంచి క‌రాచీ (karachi) వెళ్లిన చార్ట‌ర్ ప్లైట్ ఇపుడు ఇరు దేశాల్లో హాట్​ టాపిక్​గా మారింది. అయితే ఆ విమానంలో వెళ్లిన ఫ్లైట్​లో 12 మంది ఉన్నట్లు సమాచారం. ఆ చార్టర్ విమానం (Charted Flight) హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుంచి వెళ్లి ఆగస్ట్ 15 సోమవారం రోజున కరాచీ విమానాశ్రయంలో (Karachi airport) ల్యాండ్ అయిందని వార్తలు వచ్చాయి. ఈ చార్ట‌ర్ ప్లైట్ GL-5t విమానంగా గుర్తించారు అధికారులు. మొత్తం 12 మంది ప్ర‌యాణికుల్లో తొమ్మిది మంది మ‌గ‌వారు, ముగ్గురు ఆడవారు ఉన్నారు.

  ఈ చార్ట‌ర్ ఫ్లైట్  (Charted Flight) ఆగస్టు 15న కరాచీలోని పాకిస్థాన్‌లోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో (At Jinnah International Airport) దిగినట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. అయితే, పాక్ మీడియా సంస్థలు పేర్కొంటున్న‌ట్లు హైద‌రాబాద్ నుంచి ఎవ‌రూ ప్ర‌యాణించ‌లేద‌ని హైదరాబాద్ విమానాశ్రయ అధికారులు న్యూస్18 కి ధృవీకరించారు. అయితే, హైదరాబాద్ నుండి కరాచీకి వెళ్లే విమానం గురించిన సమాచారం త‌మ వ‌ద్ద ఉందంటున్నారు అధికారులు.

  మ‌రో వైపు ఈ ఘటనతో అప్రమత్తమైన పాకిస్థాన్ ప్రభుత్వం విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. GL-5 రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం-హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12:10 గంటలకు కరాచీ విమానాశ్రయంలో దిగినట్లు తెలుస్తోంది.  విమానంలో ఉన్న 12 మంది ప్రయాణికుల పేర్లను పాకిస్థాన్ మీడియా ఇప్ప‌టికే బ‌హిర్గ‌తం చేసింది. పాకిస్థానీ నివేదికల ఫ్లై స్కై అనే ఆప‌రేట‌ర్ కు చెందిన ఫ్లైట్ గా గుర్తించారు. అయితే ఇదే విష‌యాన్ని ఖండిస్తున్నారు అధికారులు.

  అదంతా తప్పు..

  ‘‘అది దుబాయ్ నుంచి వచ్చిన చార్టర్డ్ ఫ్లైట్‌. కేవలం ముగ్గురు వ్యక్తులు మాత్ర‌మే ఉన్నారు. ఆ ముగ్గురు కూడా విమాన సిబ్బంది మాత్రమే..చార్ట‌ర్ ప్లైట్ లో 12 మంది ఉన్నార‌నే స‌మాచారం త‌ప్పు... అయితే ప్ర‌యాణించిన వారిలో ఎవ‌రు కూడా నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా లేర‌ని  హైద‌రాబాద్ విమానాశ్ర అధికారులు న్యూస్18 కి స్ప‌ష్టం చేశారు.

  పాకిస్థాన్ మీడియా (Pakistan media) చెబుతున్న‌ట్లు 12 మంది ఇక్క‌డ నుంచి వెళ్ల‌లేదు. ఎవ‌రు బోర్డ్ అయ్యార‌నే విష‌యానికి సంబంధించి ఇప్పటికే ఆ ఎయిర్ లైన్ సంస్థ నుంచి స్ప‌ష్ట‌త కోరామ‌ని చెప్పారు. దుబాయ్ నుంచి వచ్చే చార్టర్ ఫ్లైట్‌ని ఫెర్రీ ఫ్లైట్‌గా మార్చామని అధికారి తెలిపారు. ఏవియేషన్ పరిభాషలో ఫెర్రీ ఫ్లైట్ అంటే ప్రయాణికులను కానీ సిబ్బందిని కానీ తీసుకెళ్లదు. అందులో ఎవ‌రూ ప్ర‌యాణించే అవ‌కాశం లేద‌ని చెబుతున్నారు అధికారులు. మ‌రి పాకిస్థాన్ ఈ విష‌యంలో ఎందుకు అంత హడావుడి చేస్తోందో తెలియ‌టం లేద‌ని  విమానాశ్ర‌య సిబ్బంది అంటున్నారు. ఇప్పటికైతే ఈ అంశంపై త‌మ‌కు ఆ దేశం నుంచి ఎలాంటి క‌మ్యూనికేష‌న్  రాలేదని స్ప‌ష్టం చేస్తున్నారు అధికారులు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Flight, Hyderabad, Pakistan

  ఉత్తమ కథలు