Home /News /telangana /

HYDERABAD HYDERABAD 70 YEARS SINCE NIZAMS DREAM OLD CITY YOUTH TO SET UP 2 WHEELER COMPANY GH VB

Hyderabad: ఈ రకంగా నిజాం కల సాకారం.. పాత బస్తీలోని నలుగురు యువకులు ఏం చేశారంటే..

నిజాం కాలం నాటి కారు (Image Credit : Twitter)

నిజాం కాలం నాటి కారు (Image Credit : Twitter)

70 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరం కోసం నిజాం కన్న కల ఎట్టకేలకు నెరవేరింది. దేశంలో విద్యుత్‌ వాహనాల జోరు కొనసాగుతుండగా.. హైదరాబాద్‌లో కూడా టూవీలర్‌ ఎలక్ట్రిక్‌ బైక్స్ ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు నలుగురు యువకులు సిద్ధమయ్యారు.

70 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరం కోసం నిజాం కన్న కల ఎట్టకేలకు నెరవేరింది. దేశంలో విద్యుత్‌ వాహనాల (Electric Vehicles) జోరు కొనసాగుతుండగా.. హైదరాబాద్‌లో కూడా టూవీలర్‌ ఎలక్ట్రిక్‌ బైక్స్ ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు నలుగురు యువకులు (Youth) సిద్ధమయ్యారు. వీరంతా ఓల్డ్ సిటీ (Hyderabad Old City)కి చెందినవారే కావడం విశేషం. తెలంగాణలో టూవీలర్ (Two Wheelers) ఈవీ(EV) తయారీ ప్లాంట్ కోసం ఈ యువకులు బ్రిటీష్ ఎలక్ట్రిక్ వాహనాల(British Electric Vehicles) తయారీ సంస్థ అయిన వన్ మోటో (One Moto)తో చేతులు కలిపారు. వీరు హైదరాబాద్(Hyderabad) నగర శివార్లలో ఈవీ ఫ్యాక్టరీని(Ev Factory) రూ.250 కోట్లతో నిర్మించనున్నారు. దాంతో నగరంలో ఆటోమొబైల్ ఫ్యాక్టరీ(Auto Mobile Factory) ఏర్పాటు చేయాలనే చిరకాల స్వప్నాన్ని సాకారం చేసినట్లయింది.

IT Jobs: ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్.. ఆఫ్​ క్యాంపస్​ డ్రైవ్​ నిర్వహించనున్న క్యాప్​జెమిని.. పూర్తి వివరాలిలా..


హైదరాబాద్ నగరం 1950 కాలంలో పింగిల్‌ (Pingle) అనే కారును సొంతంగా ఉత్పత్తి చేసింది. దానిని నుమాయిష్‌ (లోకల్ ఎగ్జిబిషన్)లో ప్రదర్శించింది. భారతదేశంలో దేశీయంగా తయారైన మొట్టమొదటి కారు (India's first car) ఇదే కావడం గమనార్హం. అయితే అది కమర్షియల్ ప్రొడక్షన్ కు వెళ్లలేకపోయింది. మారుతీ కారును రూపొందించడానికి చాలా కాలం ముందు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, నిజాం VII మనవడు అయిన ముకర్రం జా (Mukarram Jah) హైదరాబాద్‌లో ఆటోమొబైల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇతను ఫ్యాక్టరీకి సంబంధించి కాగితాల పనులు పూర్తి చేశానని చెప్పారు కానీ కార్ల ప్రాజెక్టు అసలు స్టార్ట్ కాలేదు. అయితే మళ్లీ ఇప్పుడు 70 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌కు సొంతంగా ఆటోమొబైల్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయాలనే కల సాకారం అవుతోంది.

ఈ పాతబస్తీ యువకుల్లో ఎవరూ ఆటోమొబైల్ ఇంజనీర్‌ కాదు..
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈవీ ద్విచక్ర వాహన ప్రాజెక్ట్ చేపట్టిన నగర యువకులలో ఎవరూ కూడా ఆటోమొబైల్ ఇంజనీర్ కాదు. ఒకరు డెంటిస్ట్ అయితే, మరొకరు సెక్యూరిటీ నిపుణుడు, ఒకరు రియల్టర్, నాల్గవ వ్యక్తి బిజినెస్ డెవలప్‌మెంట్‌లో ఎక్స్‌ప‌ర్ట్. వన్ మోటో ఇటీవలే గ్రేటర్ నోయిడాలో తన కొత్త ఈ-స్కూటర్ ఎలక్టా(Electa) ను విడుదల చేసింది. ఈ బ్రాండ్ ఇప్పటికే భారతీయ కస్టమర్ల కోసం బైకా, ఎలెక్టా కమ్యుటా అనే మూడు ప్రీమియం ఈ-స్కూటర్‌లను తీసుకువచ్చింది. ఇవి కాకుండా మరో మూడు మోడళ్లను వన్ మోటో తీసుకురానుంది. ఈ 3 మోడళ్లలో రెండు ఇండియాలోనే రూపొందించారు. 15 ఎకరాల్లో ఉండే ఈ తయారీ కర్మాగారం రెండు ఇండియన్ బైక్స్ పాటు అన్ని వన్-మోటో ఫ్లీట్‌లను ఉత్పత్తి చేస్తుంది, వీటిని ఎల్లీసియం ఆటోమోటివ్స్ పరిచయం చేస్తుంది, ప్రస్తుతం భారతదేశంలో వన్ మోటోను ప్రమోట్ చేస్తోంది.

Cognizant: ఫ్రెషర్స్‌కు కాగ్నిజెంట్ గుడ్​న్యూస్​.. నెలకు రూ.21 వేల జీతం.. దరఖాస్తు ఇలా చేయండి..


డెంటిస్ట్‌, పారిశ్రామికవేత్త డాక్టర్ సయ్యద్ ఫహీమ్... సైబర్ సెక్యూరిటీ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్‌లో నిపుణుడు అయిన మహ్మద్ ముజామ్మిల్ రియాజ్ (Muzammil Riyaz)... బ్రాండ్, బిజినెస్ డెవలప్‌మెంట్‌లో నిపుణుడు సయ్యద్ హుస్సేన్ అలీ ఖాన్... రియల్టర్ ఆదిత్య రెడ్డి పురుమాండ్ల నగర శివార్లలో ఆటోమొబైల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. వీళ్లు మెకానికల్ ఇంజనీర్ మొయిదీన్ సమీర్ పర్తిపడి, వ్యవస్థాపక వ్యాపార అభివృద్ధి ఎగ్జిక్యూటివ్ శుభంకర్ చౌదరితో కలిసి దీన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఈ తయారీ ప్లాంట్లో ఈవీ టూ-వీలర్లు, లిథియం బ్యాటరీలను తయారుచేస్తారు. ప్రస్తుతం ముజామ్మిల్ రియాజ్ (Muzammil Riyaz) వన్-మోటో ఇండియా ప్రమోటర్‌, పార్ట్‌నర్ గా వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందు వివిధ టెక్నాలజీ ప్రాజెక్టుల కోసం ఇస్లామిక్ డెవలప్‌మెంట్ బ్యాంక్, ఐక్యరాజ్యసమితితో అనుబంధం కలిగి ఉన్నారు.

"ప్రపంచ స్థాయి విద్య, సౌకర్యాలు, స్వేచ్ఛ, వనరులు, అత్యాధునిక తయారీ కర్మాగారాన్ని నెలకొల్పేందుకు అవసరమైన సహకారాన్ని అందించిన హైదరాబాద్‌కు తిరిగి మంచి చేయాల్సిన సమయం. మేం ఎప్పటికీ హైదరాబాదీలుగా మిగిలిపోతాం," అని ముజామ్మిల్ చెప్పుకొచ్చారు. సయ్యద్ ఫహీమ్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఆవిష్కరణల కోసం ఉపయోగించని శక్తి, ఉత్సాహం పుష్కలంగా ఉన్నాయని చెప్పారు.
Published by:Veera Babu
First published:

Tags: Brand Hyderabad, Two wheeler

తదుపరి వార్తలు