Eetala Rajender : బీజేపీ అభ్యర్థిగా ఈటల .. అధికారికంగా ప్రకటించిన బీజేపి అధిష్టానం

eetala rajender

Eetala Rajender : హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ను ప్రకటిస్తూ బీజేపీ కేంద్ర పార్టీ అధికారికంగా ప్రకటించింది. కాగా ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నుండి గెల్లు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నుండి బల్మూరి వెంకట్‌లను ఆయా పార్టీలు ప్రకటించించాయి..

  • Share this:
    హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ను ప్రకటిస్తూ బీజేపీ కేంద్ర పార్టీ అధికారికంగా ప్రకటించింది. కాగా ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నుండి గెల్లు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నుండి బల్మూరి వెంకట్‌లను ఆయా పార్టీలు ప్రకటించాయి.

    ముగిసిన ప్రధాన పార్టీల ఎంపిక 

    హుజురాబాద్ ఎన్నికల నామినేషన్ గడువు ముగుస్తుండడంతో ప్రధాన పార్టీల నేతలు ఆయా పార్టీల అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తున్నాయి. దీంతో ఇప్పటికే హుజూరాబాద్‌లో ప్రధాన పోటిగా ఉండబోతున్న టీఆర్ఎస్, బీజేపీలతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆ పార్టీ నేతలు అభ్యర్థులను ప్రకటించారు. ఇక మొదటి నుండి బీజేపీ అభ్యర్థిగా భావిస్తున్న ఈటల రాజేందర్‌ను ఆ పార్టీ కేంద్ర పార్టీ కాసేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది.

    ఇక టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజే నామినేషన్‌ను దాఖలు చేశారు. అయితే నామినేషన్ దాఖలుకు మరో అయిదు రోజులు ఉండడంతో అభ్యర్థుల ప్రకటన చేసి బీ ఫాం అందజేస్తున్నారు. నిన్నటి వరకు బీజేపీ అధ్యక్షుడు పాదచేయడంతో నేటి నుండి హజూరాబాద్‌ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే అభ్యర్థిని ప్రకటించిన అనంతరం హుజూరాబాద్‌లో ఎన్నికల శంఖారావం ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జమ్మికుంటలో ఈటల రాజేందర్‌తో కలిిసి ఎన్నికల సభను నిర్వహించనున్నారు.

    ఇది చదవండి : బతుకమ్మ పాటకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం.. గౌతమ్‌మీనన్ దర్శకత్వం


    మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులను ప్రకటించగా.. నామినేషన్ చివరి రోజు వరకు ఎవరెవరు నామినేషన్లు వేస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్ల నేరుగా పోటి చేయకున్న వైఎస్ఆర్‌టీపీ నిరుద్యోగులతో నామినేషన్లు వేయించాలని నిర్ణయించింది. ఆ పార్టీ ఎంతమందితో నామినేషన్లు వేయిస్తారనేది వేచి చూడాలి.

    నిరుద్యోగుల నామినేషన్లు

    ఇక తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామి పథకంలో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్స్ ‌గా పని చేసే సుమారు 1000 మంది అభ్యర్థులు నామినేషన్ వేస్తామని ఆ సంఘం అధ్యక్షుడు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న 7600 మందికి పైగా ఉన్న ఉద్యోగుల్లో కనీసం సగం మంది దళితులే ఉన్నారని.. అయితే వారిని తొలగించిన ఫీల్డ్ అస్టిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళతామని హెచ్చరించారు. దీంతో పాటు ఇతర పార్టీల నేతలు స్థానికంగా ఉండే వారు సైతం ఎన్నికల్లో పోటి చేసేందుకు వ్యుహాలు రచిస్తున్నారు. మరోవైపు ఆయా పార్టీలు సైతం తమ ప్రత్యర్థుల ఓట్లను చీల్చడంలో భాగంగా ఆయా వర్గాలకు చెందిన వారిని కూడా  రంగంలోకి దింపనుంది.

    మరో 5 రోజులే 

    అయితే నామినేషన్ల ప్రక్రియకు మరో అయిదు రోజులు కీలకంగా మారనున్న నేపథ్యంలోనే ఎంతమంది వరకు నామినేషన్లు వేస్తారనేది తేలనుంది.
    Published by:yveerash yveerash
    First published: