Home /News /telangana /

HYDERABAD HUSSAIN SAGAR IN HYDERABAD IS FULL DUE TO HEAVY RAINS AND OFFICIALS ARE ALERTING PEOPLE PRV

Hussain sagar: హైదరాబాద్​ ప్రజలకు అలెర్ట్​.. నిండిపోయిన హుస్సేన్​ సాగర్​..

సాగర్​లో పొంగిపొర్తుతున్ననీరు

సాగర్​లో పొంగిపొర్తుతున్ననీరు

తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్​లో గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని నాలాలన్ని పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీరు భారీగా రావడంతో హుస్సేన్ సాగర్ నిండిపోయింది.

    హైదరాబాద్ (Hyderabad ) నగరంలోని హుస్సేన్ సాగర్  (Hussain Sagar) నిండిపోవడంతో మూసీ (Musi) లోకి నీటిని విడుదల చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఐదు రోజులుగా హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయిలో నిండింది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 అడుగులు. అయితే పూర్తి స్థాయిలో వరద నీరు చేరడంతో వచ్చిన నీటిని వచ్చినట్టుగానే అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇంకా మూడు రోజులు తెలంగాణలో వర్షాలు ఉన్నందున హుస్సేన్ సాగర్ కు వరద వచ్చే అవకాశం ఉందని భావించి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల నాళాల నుండి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది.

    ఐదు రోజులుగా కురుస్తుండటంతో..

    బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా వర్షాలు కురుస్తున్నాయి. ఐదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం తడిసిముద్దైంది. వరద నీరు రోడ్లపైకి చేరుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. గ్రేటర్ పరిధిలో కుండపోతగా వర్షం కురవకున్నా సరాసరి 4 సెంటిమీటర్ల వర్షపాతం రోజూ నమోదవుతోంది. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని నాలాలన్ని పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీరు భారీగా రావడంతో హుస్సేన్ సాగర్ నిండిపోయింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.



    ఏ క్షణంలోనైనా వరద నీరు దిగువకు విడుదల చేసే అవకాశం వుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అయితే హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 అడుగులు కాగా.. ప్రస్తుతం 513.41 అడుగులకు చేరుకుంది. మరోవైపు.. GHMC పరిధిలో మరో 12 గంటల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం (Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.

    8 జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్థం..

    అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో సంభవించిన వాతావరణ మార్పు బీభత్స పరిస్థితుల్ని సృష్టించింది. గత మూడ్రోజులుగా దంచి కొడుతున్న వర్షాలకు ఉమ్మడి సుమారు 8 జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏజెన్సీ, నదీ పరివాహక ప్రాంతాలు కలిగిన జిల్లాల్లో ప్రజలు జలదిగ్భందంలో చిక్కుకుకొని బాహ్యసంబంధాలు కోల్పోయారు.

    ముఖ్యంగా ఆదిలాబాద్(Adilabad)జిల్లాలో వరదలు పోటెత్తాయి. జిల్లాలోని జలాశయాలు నిండుకుండలా మారాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రహదారులు కోతకుగురై, చెట్లు విరిగి రోడ్డిపై పడి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. భారీ వర్షాలకు నిర్మల్(Nirmal)జిల్లాలో నదులకు వరద పోటెత్తుతుంది. ఎస్సారెస్పీ(SRSP), కడెం(Kadem), గడ్డెన్న స్వర్ణ ప్రాజెక్ట్(Swarna) లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వర్షాభావ పరిస్థితుల్ని జిల్లా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి(Indrakaran Reddy) ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Heavy Rains, Hussain sagar, Hyderabad, Hyderabad Heavy Rains

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు