కొంతమంది ప్రేమించుకొని ప్రేమ వివాహం(Love Marriage) చేసుకుంటారు. మనస్పర్థల కారణంతో చాలా వరకు విడిపోయిన జంటలు(Couples) కూడా ఉన్నాయి. ఈ విడిపోవడాలు అనేవి అరేంజ్ మ్యారేజ్(Arrange Marriage) లో కూడా ఉన్నాయి. ఇంట్లో పెద్దలు కుదిర్చిన సంబంధం కొంతమందికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటారు. అయితే ఇలా ఓ యువకడికి నాలుగు నెలల(Four Months) క్రితం ఓ మహిళ(Female)తో వివాహం జరిగింది. ఆమె అంటే ఇష్టం లేకపోవడంతో ఇంటి నుంచి వదిలి వెళ్లి పోయాడు. దీనిపై పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ఇలా ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. షాపూర్‌నగర్ కళావతినగర్‌కు చెందిన హారిక(19), నవీన్‌కుమార్ కు నాలుగు నెలల క్రితం వివాహం అయింది. నవీన్ కుమార్ ఎస్ఆర్ నగర్‌లోని న్యూఎరా లేడీస్ టైలర్స్‌లో ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేస్తున్నాడు. అక్కడే వాళ్లిద్దరు కలిసి ఉంటున్నారు. దసరా పండుగ నేపథ్యంలో భార్యను తన పుట్టింటికి పంపించేందుకు బస్సు ఎక్కించాడు. 15న ఉదయం 10.30 గంటకు భార్యను బస్సు ఎక్కించిన నవీన్‌కుమార్ తెలిసిన వారి నుంచి డబ్బులు వచ్చేది ఉందని, వాటిని తీసుకువస్తానని చెప్పాడు. తర్వాత అదే రోజు సాయంత్రం 4 గంటలకు నవీన్ కుమార్ కు హారికకు ఫోన్ చేసింది.
అతడి ఫోన్ స్వీచ్ఛప్ అయింది. మరుసటి రోజు అంటే అక్టోబర్ 16 న ఉదయం 10 గంటలకు హారిక మొబైల్ నంబర్ కు ఓ మెస్సేజ్ పంపించాడు. నీ బ్యాగ్ లో ఒ లెటర్ ఉంది చూడు అంటూ పంపించాడు. ఆమె కంగారుగా ఆ లెటర్ తీసి చదివింది. అందులో ఇలా రాసి ఉంది.. ‘ నువ్వంటే నాకు ఇష్టం లేదు.. అందుకే ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాను’ అంటూ రాశాడు. దీంతో ఆందోళన చెందిన ఆమె భర్త జాడ కోసం అతడి తమ్ముడు, చెల్లెలికి ఫోన్ చేయగా రాలేదని చెప్పారు.
వాళ్లు ఉంటున్న ఇంటి ఓనర్ కు కూడా ఫోన్ చేయగా అతడి ఇక్కడకు కూడా రాలేదు అని చెబుతాడు. అటు వాళ్ల ఇంటికి వెళ్లకుండా.. ఇటు అత్తగారింటికి రాకుండా అతడు ఎటు వెళ్లాడో అర్థం కాలేదు. భర్త ఎంతకీ తిరిగి రాకపోవడంతో హారిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Hyderabad, Missing cases