భార్య, భర్తల మధ్య కలహాలు, మనస్పర్ధలు కాపురాలు కూల్చుతాయని విన్నాం. కానీ ప్రాణాలు తీసుకోవడానికి దారి తీస్తాయని హైదరాబాద్(Hyderabad)లో జరిగిన అత్యంత విషాదకర సంఘటన ద్వారా తెలిసింది. నార్సింగ్ (Narsing)పోలీస్ స్టేషన్(Police Station)పరిధిలో సిద్ధప్ప (Siddappa)అనే వ్యక్తి భార్య చూస్తుండగానే బిల్డింగ్(Building)పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన సిద్దప్పను స్థానికులు ఆసుపత్రికి తరలించినప్పటికి ప్రయోజనం లేకుండాపోయింది. భర్త తన కళ్ల ముందే ప్రాణాలు విడవటం చూసిన సిద్దప్ప భార్య సొమ్మసిల్లి పడిపోయింది. సిద్దప్ప సూసైడ్ చేసుకోవడానికి భార్యభర్తల మధ్య తలెత్తిన చిన్న వివాదమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు నార్సింగ్ పోలీసులు.
భార్యతో గొడవపడి ..
క్షణికావేశమో..లేక భార్యపై కోపమో..ఏదైతేనేం ప్రాణాలు తీసుకోవాలనే ఓ భర్త తీసుకున్న నిర్ణయం స్థానికుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీరం చెరువు ప్రాంతంలో నివాసముంటున్న రేవన్ సిద్దప్ప అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. తన భార్య చూస్తుండగానే బిల్డింగ్ పైనుంచి కిందకు దూకాడు. ఎత్తుపై నుంచి పడిపోవడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడ్ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే సిద్దప్ప కన్నుమూశాడు. భార్యతో జరిగిన చిన్న గొడవ కారణంగానే సిద్దప్ప సూసైడ్ చేసుకున్నట్లుగా ప్రాధమిక విచారణలో తేలింది. భర్త క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయానికి భార్య షాక్ అయింది. తన కళ్ల ముందే ప్రాణాలు పోవడం చూసి బోరున విలపించింది.
బిల్డింగ్‌పై నుంచి దూకాడు..
భార్యతో జరిగిన గొడవ వల్ల మానసికంగా తట్టుకోలేకపోయిన సిద్దప్ప ఆమె చూస్తుండగానే బిల్డింగ్‌పై నుంచి దూకడం స్థానికుల్ని తీవ్రంగా బాధించింది. అయితే కాపాడేందుకు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికి తీవ్రగాయాలవడం, రక్తస్త్రావం అధికంగా ఉండటంతో ప్రాణాలు విడిచాడు. సిద్దప్ప భార్య, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్యభర్తల మధ్య ఘర్షణే కారణమా లేక ఇంకేమైనా ఒత్తిడులు ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు నార్సింగ్ పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.